14, అక్టోబర్ 2020, బుధవారం

మహాలక్ష్మి

 శ్రీ మహాలక్ష్మి తంత్రం 


సంపదలకు మూలమైన లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకుంటే అష్టఐస్వర్యాలు సిద్ధిస్తాయని భావిస్తారు. లక్ష్మీ కటాక్షంకోసం అనేక ప్రార్థనలు చేస్తారు.


అయితే కొన్ని విధాలుగా పూజిస్తే లక్ష్మీదేవిప్రసన్నమవుతుందట.


కుబేరుని విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే లక్ష్మీ సంతోషిస్తుందట. ప్రపంచంలోని అన్ని సంపదలు కుబేరుడు అధీనంలో ఉంటాయి. కుబేరుడు ఉండే స్థానంలో పరిశుభ్రతను పాటించాలి.


చిన్న కొబ్బరికాయలు అంటే సాధారణ వాటి కన్నా చిన్న పరిమాణంలో ఉండేవి. వీటిని శ్రీఫలంగా వ్యవహరిస్తారు. శ్రీఫలం అంటే లక్ష్మీదేవికి సంబంధించిందని అర్థం.


అందుకే వీటితో పూజిస్తే లక్ష్మీదేవి ఇంట్లో కొలువుంటుందట. ఆకర్షణ కోసం పాదరసంతో శరీరంపై పచ్చబొట్టు, చిత్రాలను ప్రత్యేకంగా వేయించుకుంటారు.


మెర్క్యూరీ లక్ష్మీ విగ్రహాన్ని ఇంట్లో ఉంచితే దీనికి దేవి ఆకర్షితమవుతుంది. పిల్లలు ఆడుకునే గవ్వలు సముద్రం నుంచి లభిస్తాయి.


అలాగే లక్ష్మీదేవి కూడా పాల సముద్రం నుంచే ఉద్భవించింది కాబట్టి వీటిని పూజగదిలో ఉంచితే లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది.


మోతీ శంఖాన్ని మంత్ర, తాంత్రిక పూజల్లో ప్రత్యేకంగా వినియోగిస్తారు. ఇవి చాలా అద్భుతమైన శంఖంగా నమ్ముతారు. వీటిని కూడా ఇంట్లో ఉంచితే శ్రీలక్ష్మీ అనుగ్రహం లభిస్తుందట.


వెండితో తయారు చేసిన గణపతి, లక్ష్మీదేవి విగ్రహాలు చాలా పవిత్రమైనవి. వీటిని రోజూ పూజిస్తే సిరిసంపదలకు లోటే ఉండదట.


తాంత్రిక శాస్త్రంలో శ్రీ యంత్రానికి ఓ ప్రత్యేకత ఉంది. అన్ని యంత్రాలకు రాజుగా దీనిని పేర్కొంటారు. పూజ గదిలో ఈ యంత్రాన్ని ఉంచితే సిరి తరలివస్తుందట.


వెండితో తయారు చేసిన లక్ష్మీదేవి పాదుకలు సరైన దిశలో ఉంచితే ఆ ఇంట్లో లక్ష్మీ శాశ్వతంగా ఉండిపోతుందట.


కలువ పూల విత్తనాలు దండను పూజకు వినియోగిస్తే ఆ ఇంటికి లక్ష్మీదేవి నడిచివస్తుందట. ఎందుకంటే లక్ష్మీ కమలంలో నివాసం ఉంటుంది.


దక్షిణ దిశగా నోరు ఉండే శంఖం పూజ గదిలో ఉంటే ఆ ఇంట్లో లక్ష్మీ వెలుస్తుంది. తంత్ర శాస్త్రంలో దీనికి చాలా ప్రత్యేకత ఉంది.


*ఆదిరాజు ప్రసాద్ శర్మ*

కామెంట్‌లు లేవు: