*1903 తర్వాత ఇదే తొలిసారి.. హైదరాబాద్‌లో 191.8మిమీ వర్షపాతం*
*హైదరాబాద్: హైదరాబాద్‌లో ఇలాంటి వాన ఎన్నడూ చూడలేదు. మేఘాలు ఊడిపడ్డ తీరు ఈ కాలంలో ఎన్నడూ చోటుచేసుకోలేదు. గత రెండు రోజులుగా కురిసిన వానలకు.. పాత రికార్డులన్నీ బ్రేక్ అయ్యాయి. అక్టోబర్ నెలలో హైదరాబాద్‌లో ఈ రేంజ్‌లో వాన పడడం గత వందేళ్లలో ఇదే మొదటిసారి. 1903లో చివరిసారి ఇలాంటి వర్షం కురిసినట్లు వాతావరణ శాఖ ఇవాళ చెప్పింది. అయితే ఇవాళ ఉదయం 8.30 నిమిషాలకు హైదరాబాద్‌లో వర్షం నిలిచిపోయింది. ఆ సమయానికి నగరంలో గత 24 గంటల్లో సుమారు 191.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయినట్లు ఐఎండీ వెల్లడించింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఇంత భారీ స్థాయి వాన కురవడం 1903 తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం*.
*ప్రస్తుతం వాయుగుండం తెలంగాణ దాటి కర్నాటకలోని గుల్బర్గా దిశగా వెళ్తోంది. డిప్రెషన్ వేగంగా మహారాష్ట్ర దిశకు పయనిస్తున్నట్లు ఐఎండీ అంచనా వేస్తున్నది. రానున్న 12 గంటల్లో వాయుగుండం మరింత బలహీనపడే అవకాశాలు ఉన్నట్లు పేర్కొన్నది. దీని వల్ల మధ్య మహారాష్ట్ర, కొంకన్, గోవా, కర్నాటక, తెలంగాణలో పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్లు ఐఎండీ డైరక్టర్ మృత్యుంజయ మహాపాత్ర తెలిపారు. మహారాష్ట్రలో కొండచరియలు విరిగిపడే ఛాన్సు ఉన్నట్లు ఐఎండీ అంచనా వేసింది*.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి