14, అక్టోబర్ 2020, బుధవారం

పితృశాపం

 Hindu Dharmam Vardhillali (హిందూ ధర్మం వర్ధిల్లాలి):

*పితృశాపం :-*


పితృదోషం కారణంగా ఏర్పడిన వివిధ రకాల సమస్యల నుంచి బయటపడటానికి కొన్ని రకాల ప్రక్రియలను శాస్త్రాలలో చెప్పబడింది. అందు ముఖ్యమైనది *తిలాహోమం*. హోమంలో నువ్వులను వేస్తూ హోమం చేస్తారు. బలితర్పణ అనే ప్రక్రియ ఆ తర్వాత ఈ తిలాహోమం జరుగుతుంది. ధర్మశాస్త్రాల ప్రకారం తల్లి వైపుకి చెందిన నాలుగు తరాలలో లేక తండ్రికి చెందిన ఏడు తరాలలో ఎవరైనా వ్యక్తి వివాహం కాకుండా చిన్న వయసులోనే మరణించిన లేక యుక్త వయస్సులో అకాల మృత్యువు పొందినా , లేక హత్య చేయబడినా పితృదోషం ఏర్పడుతుంది. ఈ పితృదోష నివారణ కోసం బలి తర్పణం మరియు తిలాహోమం జరుగుతుంది. మొదట పితృబలి, ఆ తర్వాత శార్థం , తర్వాత బలితర్పణం ఇచ్చి ఆ తర్వాత తిలాహోమం జరుపుతారు . 


పితృశాపం వలన కలిగిన ఫలితాలు రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఒక వ్యక్తి తాను గత రెండు జన్మలలో కానీ లేక ఈ జన్మలో గానీ తల్లిదండ్రులకు చేసిన అపకారం కారణంగా ఆ వ్యక్తి తన జీవితంలో పొందే రకరకాల నష్టాలు. రెండవది ఓక వ్యక్తికి సంబంధించిన పూర్వీకులు కొన్ని కారణాల వల్ల అకాల మృత్యువు పొందిన ఆ తర్వాత ఏ విధమైన శార్థకర్మలు లాంటివి లేని కారణంగా ప్రేతాత్మగా ఉండి తన వారసులను శపించడం జరుగుతుంది. ఈ విధమైన పిథృశాపం వలన కూడా మానవుడు ఆర్థిక నష్టాలు, సంతాన లేమి , ఇలా ఎన్నో రకాల కష్టాలు ఎదుర్కొనివలసి వస్తుంది. ఈ రెండు రకాల పితృశాపలకు కూడా పరిహారం చేయబడే ఒక హైందవ తాంత్రిక ప్రక్రియలను నారాయణ నాగ బలి అని పిలుస్తారు. 


మానవులకు అనేక కొరికలు ఉంటాయి . అయితే చాలా కొద్ది మందికి మాత్రమే వారి వారి కోరికలు కోరింది పొందగలరు. కేవలం డబ్బు ఉన్నంత మాత్రాన మనుషులు ఆశించినవన్నీ పొందుతారు అనుకోవడం అజ్ఞానం. అంతే కాక ఏది ఎవరికి ప్రాప్తమో , ఎంతవరకు ప్రాప్తమో అది అంతవరకే వరిస్తుంది. అయితే కొన్ని సార్లు గ్రహ ప్రభావం కారణంగా మానవులు కొన్ని పొందలేకపోతారు . అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే పితృశాపం అనే అతిశక్తివంతమైన అంశం నవగ్రహాలకన్నా అధికంగా మానవుల జీవితాలను ప్రభావితం చేస్తుంది. పితృశాపం అంటే ఏమిటి అంటే మానవులు తమకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు తగిన విధంగా సేవలు చేసి వారిని సంతోషపెట్టి ఆపై వారు స్వర్గస్థులైన తర్వాత వారికి తగిన విధంగా అంత్యక్రియలు పూర్తి చేసి అటు తర్వాత ప్రతీ సంవత్సరం మాతా , పితరుల ఆత్మశాంతి కోసం శార్థకర్మలు చేయిస్తూ ఆకలిగొన్న వారికి అన్నశాంతిని చేయిస్తూ ఉండాలి. అలా పితృఋణం , మాతృఋణం తీర్చుకొనే మానవులకు మంచి సంతానం, సంపదలు , సౌఖ్యాలు లభిస్తాయని హైందవ ధర్మం చెబుతోంది. అయితే కొందరు పితృశాంతి కోసం ప్రతీ సంవత్సరమూ ఎన్నో చేస్తున్నా వారికి సంతానం లేకపోవడం, జీవితం లో పైకి రాలేకపోవడం ఏదో ఒక విధంగా ప్రతీ దాంట్లోనూ నష్టాలు పాలు కావడం ఎందుకు జరుగుతోంది అనే ప్రశ్న వివేకం ఉన్న ఏ మానవుడికైనా ఎదురౌతుంది. ఇందుకు గల కారణం ఏమిటంటే కేవలం ఈ జన్మలో పితృఋణం తీర్చుకుంటే చాలదు . గతజన్మ లో మరి అంతకు ముందు జన్మలో తల్లిదండ్రులుగా ఉన్న వారికి ఏవిధమైన సేవలు చేయకుండా మరి పితృకర్మలు చేయకుండా తప్పించుకొనే మానవులు కనీసం ఈ జన్మలో అయినా పితృఋణం తీర్చాల్సి ఉంటుంది. ఒక మనిషి తీర్చాల్సిన పితృఋణం మూడు జన్మలవరకూ ఉంటుంది అని ధర్మశాస్త్రాలు చెపుతున్నాయి. ఈ జన్మలో పితృఋణం తీరుస్తున్నప్పటికి గత రెండు జన్మలలో మాతాపితరులకు ఋణపడి ఉన్న కారణంగా ఆ పితృదేవతల యొక్క ఆగ్రహం , అసంతృప్తి మూడవ జన్మలో ఉన్న మానవులపై ప్రసరించి ఆ మానవులు పితృశాపానికి గురికావడం జరుగుతుంది. ఆ ఫలితంగా మానవులు కొన్ని రకాల సమస్యలను ఎదుర్కొంటారు .


👉 పితృశాపం ఉన్నవారికి సంతానం కలుగదు. ఒకవేళ సంతానం కలిగినా చిన్న వయసులోనే నశించిపోతుంది. 


👉 పితృశాపం అనుభవిస్తున్న వారిపై పిశాఫిడ , దుష్ట గ్రహపీడలు అధికంగా ఉంటుంది. వీరికి విపరీతంగా చెడు దృష్టి తగులుతుంది. అంతే కాక వీరిపై వీరి శత్రువులు చేతబడులు అనేక సార్లు చేయించడం జరుగుతుంది. 


👉పితృశాపం ఉన్నవారికి అతి తొందరగా షుగర్, ఊబకాయం, ఆస్తమా లాంటి నివారణ లేని వ్యాధులు వస్తాయి. అంతే కాకుండా వీరి పిల్లల్ని కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం వస్తూ ఉంటుంది. 


👉 పితృశాపం ఉన్నవారికి తరచుగా యాక్సిడెంట్స్ జరగడం , హాస్పిటల్ పాలవడం జరుగుతుంది.


👉 గృహంలోని సభ్యులు అకాల మృత్యువు పొందటం లేక ఆత్మహత్య చేసుకోవడం , నీటిలో మునిగి చనిపోవడం లేక ప్రమాదంలో మరణించడం లాంటివి జరుగుతాయి.


గత రెండు జన్మలలో పితృఋణం తీర్చకుండా ఉండటమే కాక తల్లి తండ్రిని అన్నం పెట్టకుండా వారిని బాధించి మరియు హింసించిన వారికి మూడవ జన్మలో అతిభయంకమైన కష్టాలు కలగడం జరుగుతుంది. అయితే గత జన్మ లో వేరే విధమైన పుణ్య కార్యాలు చేసిన కారణం గా వీరికి అపారమైన డబ్బు, పరపతి, లభిస్తాయి. అయినంత మాత్రాన వీళ్ళు సుఖపడతారని బావించవలదు . వీళ్ళు సంపాదించే ఆస్తిని అనుభవించాల్సిన వాళ్ళు ( వారసులు ) అకాల మృత్యువు పొందటం వీళ్ళకు పైకి చెప్పుకోలేని దుఃఖాన్ని ఆక్రోశాన్ని కలిగిస్తారు . ఈ బాధాకరమైన సమస్యలను నివారించడానికి పితృశాప పరిహారాన్ని చేయించుకోవాలి. 


కొంత మంది


లు ఈ కింది పరిస్థితులలో అకాల మృత్యువు పాలవడం జరుగుతుంది. అలాంటి వారికి తగిన శార్ధకర్మలు చేసే వారసులు లేక , ఆ చనిపోయిన వారు ప్రేతాత్మలు గా మారి తమ కుటుంబం లోని వారిని వీలైనన్ని విధాలుగా భాధించడం జరుగుతుంది. అలా ఆత్మశాంతి లేకుండా ప్రేత రూపంలో సంచరించే కుటుంబీకుల ఆత్మఘోష పితృశాపంగా మారి బ్రతికి ఉన్నవారికి తగిలి బాధించడం జరుగుతుంది. 


*పితృశాపం ఎవరికి తగులుతుంది !?* 


👉 వివాహానికి పూర్వమే తమ కుటుంబానికి చెందిన ఒక పురుషుడు లేక స్త్రీ మరణించడం .


👉 నీటిలో మునిగి తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 ప్రమాదకరమైన జంతువుచే కానీ , విషపూరిత సర్పాలచే కానీ తమ కుటుంబానికి చెందిన వ్యక్తి మరణించడం. 


👉 కాల్చుకుని గానీ, విద్యుత్ షాక్ తో గాని , విషం తాగి గానీ, ఉరివేసుకుని గానీ తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం. 


👉 ఆహారం తినేటప్పుడు లేదా పానీయం తాగేటప్పుడు అది గొంతుకు అడ్డంపడి తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం. 


👉 విపరీతంగా తినడం వల్ల గానీ, మద్యాన్ని సేవించడం వల్ల కానీ తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 విదేశాల్లో లేక దూరప్రాంతాలలో దిక్కులేకుండా తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 దక్షిణాయణంలో గానీ, ఫంచక కాలంలో గానీ , అతిదుష్ట నక్షత్ర మరి తిథి కలిసి ఉన్న కాలంలో గానీ తమ కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి మరణించడం.


👉 ఈ విధమైన కారణాలవల్ల చనిపోయిన స్త్రీ లేదా పురుషులకు మరణానంతర కర్మకాండలు చేయించేవారు ఉండరు . చిన్న వయసులో ఇలా వివిధ కారణాల వల్ల దుర్మరణం పొందిన వ్యక్తల యొక్క ఆత్మలు , ప్రతాత్మలుగా మారి తమ తమ కుటుంబీకులను పీడిస్తాయని గరుడపురాణం చెబుతోంది. అయితే తమకు పితృశాపం ఉన్నది లేనిది ఎలా తెలుసుకోవాలి !? 


పితృశాపం ఉన్నవారికి , వారిని ఆ శాపానికి గురిచేసిన ప్రేతాత్మ లు తరచుగా కలలలోకి వస్తూ ఉంటారు. ఒక్కోసారి పితృశాపం ఉన్నవారికి నేరుగా ప్రేతాత్మలు కనబడకుండా పితృశాపానికి చిహ్నంగా కొన్ని ప్రత్యేక ప్రతీకలు స్వప్నంలో కనిపిస్తుంది. 


👉 కలలో. ఒక త్రాచుపాము పడగవిప్పి కనిపించడం గానీ, ముక్కలు ముక్కలుగా కనిపించడం గానీ ఆ కలకంటున్న వ్యక్తికి తాను కలలో త్రాచుపామును చంపుతున్నట్లగా కనిపించడం జరిగితే ఆ వ్యక్తికి పితృశాపం ఉన్నట్లు. 


👉 మహాసముద్రం గానీ , పెద్ద నదీగాని , పెద్ద సరస్సు కానీ అనేక సార్లు కలలో కనిపిస్తే అతనికి పితృశాపం ఉన్నట్లు.


👉 తాను నీటిలో మునిగి పోతున్నట్లు కానీ లేక నీటిలో నుండి బయటకి రావడానికి ప్రయత్నిస్తున్నట్లు గానీ అనేక సార్లు కలలు వస్తే ఆ వ్యక్తికి పితృశాపం ఉన్నట్లు .


👉 తాను ఇతరులతో తగాదాలు పడుతున్నట్లు, కోట్లాటలు చేస్తున్నట్లు అనేక సార్లు కలలు వస్తే ఆ వ్యక్తికి పితృశాపం ఉన్నట్లు.


👉 ఒక మహాభవనం పడగొట్టబడుతున్నట్లు కలలో కనిపిస్తే అతనికి పితృశాపం ఉన్నట్లు.


👉 ఇటీవలి కాలంలో భర్తను పోగోట్టుకున్న స్ర్తీ లేక చనిపోయిన స్త్రీ కలలో కనిపిస్తే అతనికి పితృశాపం ఉన్నట్లు.


👉 ఎవరో ఒక స్త్రీ పెద్దగా రోదిస్తూ భుజంపై చనిపోయిన తనబిడ్డను వేసుకుని ఎటో నడుచుకుంటూ వెళుతున్నట్లు కలవచ్చినా అతనికి పితృశాపం ఉన్నట్లు. 


ఇలాంటి స్వప్నాలు వచ్చేవారికి కచ్చితంగా పితృశాపం ఉండి తీరుతుంది. అలాగే ఆ పితృశాపం వలన కలిగే దుష్పలితాలలో కనిసం ఒకటైన వారికి కనిపిస్తుంది.

కామెంట్‌లు లేవు: