కశ్యపుని భార్యలైన ఈ కద్రువ వినతలమధ్య ఒకరికొకరు పోటీతత్త్వం ఉండేది.
కద్రువ వినతపై ఆధిపత్యం వహించాలనే తత్త్వాన్ని కలిగి ఉండేది. ఎలాగైనా వినతచేత తాను ఊడిగం చేయించుకోవాలని ఆలోచించేది.
అటువంటి ఆలోచనతో....
ఒకసారి కద్రువ వినతతో... ఒక పందెమునకు ఒప్పించినది.
ఈ పందెంలో భాగంగా కద్రువ వినతతో... "ఇంద్రుని గుఱ్ఱము పూర్తిగా తెలుపు కాదు. దాని తోక నల్లగా ఉంటుంది." అన్నది. దానికి వినత... "అదేమీకాదు. క్షీరసాగరమథనంలో పుట్టిన ఇంద్రుని వాహనాలైన ఐరావతంతో సహా అన్నీ పూర్తిగా తెల్లనివే. అదేవిధంగా ఇంద్రుని గుఱ్ఱము కూడా తెల్లనిదే..." అంటుంది. దానిమీద మాట మాట పెరిగి కద్రువ... నా మాటను నేను నిరూపిస్తాను. నీ మాటను నీవు నిరూపించుకోగలవా? ఈ పందెంలో ఎవరు ఓడిపోతే వారు రెండవవారికి దాస్యం చెయ్యాలి. అని అంటుంది. వినత కూడా దానికి సరే అంటుంది.
ఆ ఇంద్రాశ్వము ఉదయంవేళలో పచ్చికమేయటానికి వస్తుంది. కనుక ఆ సమయంలో పరిశీలిద్దాము అని కద్రువ చెబుతుంది.
ఈ క్రమంలో... కద్రువ తన సంతానమైన నాగులను పిలచి "మీరు వెళ్ళి ఇంద్రాశ్వము యొక్క తోకకు చుట్టుకొని మా పందెం ముగిసేవరకు ఉండండి." అని నాగులను ఆజ్ఞాపించగా.. కద్రువసంతానమైన నాగులు అట్లాగే చేస్తాయి.
మరునాడు నాగులు చుట్టుకొన్న ఇంద్రాశ్వమును కద్రువ వినతకు చూపి ఇంద్రాశ్వము తోక నల్లగా ఉన్నదని ఋజువు చేసి వినతను తనకు దాసీగా మార్చుకుంటుంది
ఇదంతా కద్రువకు నాగులు పుట్టి వినతకు సంతానం కలిగే మధ్యకాలంలో జరిగినవృత్తాంతము.
ఆ తరువాత వినతకు పుట్టిన గరుత్మంతుడు తన తల్లిని కద్రువ దాస్యం నుండి విడిపిస్తాడు. వినత యొక్క సంతానంలో విశిష్ఠమైనవాడు కనుక గరుత్మంతుడు వైనతేయుడుగా ప్రసిద్ధి చెందాడు.
మీ
*~శ్రీశర్మద*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి