*అధిక బరువు తగ్గాలని చూస్తున్నారా..?*
➖➖➖✍️
*అయితే ఈ ఆయుర్వేద సూత్రాలను పాటించండి..!*
అధిక బరువును తగ్గించుకోవడం చాలా కష్టంగా ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అధిక బరువు చాలా సులభంగా పెరుగుతారు. కానీ బరువు తగ్గడం చాలా అవస్థగా అనిపిస్తుంది. బరువు పెరిగేందుకు అనేక కారణాలు ఉంటాయి. అయితే అధికంగా ఉన్న బరువును తగ్గించుకునేందుకు చాలా మంది అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంటారు. రోజూ వ్యాయామం చేయడం, పౌష్టికాహారం తీసుకోవడం, వేళకు నిద్రించడం చేస్తారు. ఈ క్రమంలోనే సరైన జీవనశైలిని పాటిస్తేనే బరువును తగ్గించుకోవడం తేలికవుతుంది. అయితే బరువు తగ్గేందుకు పలు ఆయుర్వేద సూత్రాలు కూడా ఎంతో మేలు చేస్తాయి.
వాటిని పాటించడం వల్ల కేవలం బరువు తగ్గడం మాత్రమే కాదు, ఇంకా అనేక ఇతర ఆరోగ్య ప్రయోజనాలు కూడా కలుగుతాయి.
కరక్కాయ పెచ్చులు.. బరువు తగ్గాలని చూస్తున్న వారు ఆయుర్వేద ప్రకారం రోజూ ముల్లంగి రసాన్ని తాగుతుంటే ఎంతో ఫలితం ఉంటుంది.
ముల్లంగి రసాన్ని పూటకు 3 టీస్పూన్ల చొప్పున రోజుకు 3 సార్లు తీసుకోవాలి. దీని వల్ల శరీరంలో కొవ్వు చేరకుండా ఉంటుంది. బరువు తగ్గేందుకు ఈ రసం సహాయం చేస్తుంది. అలాగే కరక్కాయ పెచ్చులను చూర్ణం చేయాలి. దాన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని అందులో అంతే మోతాదులో తేనె లేదా వేడి నీరు కలపాలి. ఈ మిశ్రమాన్ని రెండు పూటలా తీసుకోవాలి. ఇలా చేస్తున్నా కూడా ఎంతో ఉపయోగం ఉంటుంది. అదేవిధంగా రేగు చెట్టు ఆకులను చిన్న ముద్దగా చేసి ఉలవచారు లేదా శనగలతో చేసిన చారుతో కలిపి తీసుకోవాలి. ఇది కూడా ఫలితాన్ని ఇస్తుంది. అలాగే ప్రతి రోజూ ఉదయం పరగడుపునే ఒక తమలపాకులో 5 మిరియాల గింజలను చుట్టి తిని వెంటనే ఒక గ్లాసు నీటిని తాగాలి. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
తేనె.. ఆముదం ఆకులను కాల్చి బూడిద చేసి నిల్వ చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని చిటికెడు చొప్పున తీసుకుని అందులో చిటికెడు ఇంగువ పొడిని కలిపి రెండు పూటలా బియ్యం కడిగిన నీళ్లతో కలిపి తీసుకోవాలి. అలాగే అర టీ స్పూన్ వాయు విడంగాల చూర్ణాన్ని తేనెతో కలిపి రెండు పూటలా తీసుకుంటున్నా కూడా ఉపయోగం ఉంటుంది. ఇక బరువు తగ్గేందుకు గాను పలు ఆయుర్వేద సూచనలను కూడా పాటించాల్సి ఉంటుంది. రోజూ ఆహారంలో అన్ని రుచులు కలిసిన పదార్థాలు ఉండేలా చూసుకోవాలి. అన్ని రుచులు ఉన్న ఆహారాలుగా రోజూ తినాలి. చక్కెర, ఉప్పు, నూనెలను తక్కువగా తినాలి. భోజనం చేసినప్పుడు ఉదరంలో కొద్దిగా ఖాళీ ఉండేట్లు చూసుకోవాలి. ఆహారం అయిన తర్వాత మధ్యలో ఎక్కువ సేపు భోజనం చేయాలి. ఇది బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది.
ఆముదపు నూనెలు.. బరువు తగ్గాలని చూస్తున్నవారు వ్యాయామానికి ముందు 2 టీస్పూన్ల తేనెను ఒక గ్లాసు గోరు వెచ్చని నీటిలో కలిపి తాగాలి. దీని వల్ల శరీర మెటబాలిజం పెరుగుతుంది. క్యాలరీలు త్వరత్వరగా కరిగిపోవడానికి సహాయం చేస్తుంది. అలాగే హైపర్ థైరాయిడ్ ఉంటే ఆముదపు నూనెను రోజూ టీస్పూన్, ఓట్స్, బార్లీ, చిరుధాన్యాలు, పెసలకి సంబంధించినవి తినాలి. డ్రై ఫ్రూట్స్ వంటివి తింటుంటే ఫలితం ఉంటుంది. అదేవిధంగా పచ్చి కూరగాయల సలాడ్లు ఎక్కువగా తినాలి. గోరు వెచ్చని నీళ్లను తాగాలి, ఉదయం. అలాగే పడుకునే ముందు రోజూ నీళ్లు తాగాలి. ఈ చిట్కా కూడా బరువు తగ్గేందుకు సహాయం చేస్తుంది. ✍️
*🅰️🅿️SRINU*
(ఇవి కేవలం మీ అవగాహన కోసం మాత్రమే! మీ డాక్టర్ని సంప్రదించి
వారి సలహాతో మాత్రమే వాడాలి.)
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷```
🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
➖▪️➖
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి