10, ఫిబ్రవరి 2026, మంగళవారం

కాలం - అనుకూలం*

  *కాలం - అనుకూలం*

ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.

తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)

卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐

🌟 ఫిబ్రవరి 10 2026 🌟

శ్రీ విశ్వావసు నామ సంవత్సరం

ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘ మాసము కృష్ణ పక్షం


తిథి: *అష్టమి ఉ.7.27 కు* తదుపరి *నవమి 11 ఉ.9.26 కు*

వారం: *భౌమవారము (మంగళవారం)*

నక్షత్రం: *విశాఖ ఉ.8.15 కు* తదుపరి *అనూరాధ 11 ఉ.10.51 కు*

యోగం: *ధ్రువ రా.1:42 కు* తదుపరి *వ్యాఘాత 11 రా.2:29 కు*

కరణం: *తైతుల రా.8:43 కు* తదుపరి *వణిజ 11 రా.11:12 కు*

రాహుకాలం: *మ. 03.00 - 04.30 కు*

దుర్ముహూర్తం: *ఉ. 9.05 - 9.50 కు, రా. 11.14 - 12.04 కు*

వర్జ్యం: *మ.12.39 - 2.26 కు*

అమృతకాలం: *రా. 11.11 - 12.59 కు*

సూర్యోదయం: *ఉ. 6.48 కు*

సూర్యాస్తమయం: *సా. 6.11 కు*


*గురుబోధ:*

మానవులు ఏ విధమైన జాతికి, ప్రాంతానికి చెందినవారైనా సరే ఉదయం స్నానం చేసి, తూర్పు దిక్కునకు తిరిగి, దేవపూజ చేయవలసిందే. ఉదయం నిద్రలేచే పద్ధతిని అనుసరించి, జీవులకు, ఆయువు, ద్వేషం, మరణం, పాపం, భాగ్యం, వ్యాధి, పుష్టి, శక్తి అనేవి లభిస్తాయి. నిద్ర లేవడం ఆలస్యం అవుతున్న కొద్దీ ఆయువు తగ్గుతుంది. ద్వేషభావన పెరుగుతుంది. మరణం దగ్గర పడుతుంది. పాపాలు పెరుగుతాయి. భాగ్యం తరుగుతుంది. వ్యాధి అధికమౌతుంది. పుష్టి, శక్తి తగ్గిపోతాయి. కాబట్టి రాత్రి త్వరగా నిద్రపోయి, ఉదయం తొందరగా నిద్రలేచేవారికి శుభపరంపరలు పెరుగుతాయి.


*పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారి అమృత ప్రవచనాలు* 

*👉🏻 ఫిబ్రవరి 11, 2026 (ఉదయం); 🗓️సమయం: ఉ|| 10 గం.ల నుండి మ.12 గం.ల వరకు "భగవత్ రామానుజాచార్య స్వామి మరియు అష్టాక్షరీ మంత్ర వైశిష్ట్యం" 📍వేదిక: శ్రీ తల్పగిరి రంగనాథస్వామివారి దేవాలయం, రంగనాయకుల పేట, నెల్లూరు*

*👉🏻 ఫిబ్రవరి 11 2026 (సాయంత్రం); 🗓️ సమయం: సా|| 6:30 గం.ల నుండి రా.8:30 గం.ల వరకు "శ్రీ రామాయణ వైశిష్ట్యం" , 📍వేదిక: వేంకటేశ్వర స్వామి ఆలయం, బృందావన్ గార్డెన్స్, గుంటూరు*


https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

కామెంట్‌లు లేవు: