శివుడి గుణం !!అత్యంత సుకుమారం!!
ఈశ్వరా!! పరమేశ్వరా!!
చుాడరా ఇటు చుాడరా!! అనే పాట వింటుాంటే ...శివుడు గురించి ఒక ఆధ్యాత్మిక భావన ఒకటి కలుగుతుంది .రెండు కన్నుల మనిషి బ్రతుకును..గుండెకన్నుతో చుాడరా..
ఎదుట పడని వేదనలను.నుదుటి కన్ను తో చుాడరా.....ఈశ్వరా...పరమేశ్వరా!!ఆది మరియూ అంత్యం అయిన శివుడు గురించి .. . ..పురాణాల్లో వేదాల్లోనుా, ఉపనిషత్తుల్లోను కవులు, నాయనార్లు ఇంకా శివయ్య గాఢ భక్తులు....వేల కొలది సాహిత్యం సృష్టించి వుంటారు...!! పద్యాల కధల స్తోత్రాల రుాపంలో మాటల రుాపంలో పాటల రుాపంలో ..వారి దయ కరుణ ను వర్ణించి వుంటారు....కాని ఒక పరమాణువు లాంటి నేను అలా వర్ణ నలు చేయలేను...అంత ప్రజ్ఞ , జ్ఞానము నాకు లేవు కానీ కొంచెం మాత్రమే శివుడు గురించి తెలుసు...అదిమాత్రమే శివుడు కి సమర్పించగలను....!!మెదట శివుడంటే మాములుగా అందరిలా వుండేదాన్ని...కానీ ఆయన ప్రేమ త త్వం ప్రేమ కోసం ఆయన పడే ఆరాటం బాధ దుఃఖం ఒక సిరియల్ లో చుాసాను....అప్పుడు నుండి శివుడంటే ఎక్కువ ఇష్టం గా మారింది....!!
మనిషి, దేవుడిని కుాడా అనుభవం లోనే పొందాలి....అప్పుడె ఇష్టం గా మారుతుంది శివయ్య కి మనస్వఛ్చమైన మనసునచ్చితే వాళ్ళ కోసం ఏదో ఒకటి మేలు చేస్తాడు అదే శివుడి గొప్పతనం .!!ఎందుకంటే పక్కన పార్వతీ మాత వుంటుంది మాత ప్రేమ దేవత ఆమె స్పుార్తి తోడు సహాయంతో శివుడు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయడం కోసం ఆరాటపడుతారు.కాని అదే పార్వతీ మాత పక్కన లేకుంటే ఆయనే దుఃఖభారంతో ఏ సహాయం చేయలేక నిర్లిప్తంగా వుంటారు.పిచ్చివారిలా తన శక్తి కుాడా తనకు గుర్తు రాదు..పార్వతీ మాత జగన్మాత ...సృష్టి మెుత్తం ఆమె బిడ్డలు ..అంటుంది....ఆమె మీద ప్రేమ తో ఆమెకి ఇష్టం అయిన సృష్టి ని ఆయన ప్రేమిస్తారు....!! ప్రేమించకుంటే మాత తన ను వదిలేస్తుందని భయం శివయ్య కి....!! అందుకే జీవుల్ని ఎక్కువగా ప్రేమిస్తారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి