అంతర్ కాంతి శీర్షిక సందర్భం..మేడే..
రచన రవికుమార్
బిడియల్
ఉదయమెప్పుడు మార్గనిర్దేశం..
అంతర్గత చీకట్లు తొలిచే కాంతి కేతనం..
గత భావాల సంభావ్యతల అన్వేషించి ఎర్రని పాదాలఫై సరిహద్దులు లేని ప్రపంచం లోనికి అడుగులువేద్దాం..
భూమి తనచుట్టుతానుతిరుగుతూ డాలర్ చుట్టు తిరుగాడే..
సంపదే ప్రాధాన్యలో
సంస్కరణ సూర్యోదయ నీరీక్షణ..
భావదాస్యాల ఉగ్రభూతాల
మారణహోమంలో..
జీసస్ పరిశుధ్ద సోత్రాలు..
రాముని రాతి శిల్పాలతో ప్రార్ధనలు..
అల్లా అపరప్రేమఆలాపల్లో
కుభేరవైభవం ప్రక్కన కుచేల నాగరికత ప్రగతి..
సమైక్య జీవనం..వాట్సాఫ్
ఫేస్ బుక్ సందేశాల్లో..
కాల పురుగుల ఫబ్ జీగేమ్
కార్పొరేట్ మొసలి ధనార్జన
చదువులు సంక్షోబాలు
రక్షణరాజకీయాల ..
గ్లోబలీకరణ భావకాలుష్యకాసారాల్లో..
మైళ్లదూరం మనుషులు
దగ్గరవుతూ..
మనసులు సమాచార కల్పనలో.. విసంగజీవులవుతూ
టెక్నాలజీ వ్యక్తి కేంద్ర విలాసాలకు.. పునరాతిజననం..
జన్మిస్తూనే తనకుతాను కోల్పోవడం..
మేడే స్ఫూర్తితో నేడే సంఘటిత మవుదాం..
కుంకుమ రేకుల కాంతుల
మనలో నింపుకొని పయణమవుదాం..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి