*నా అభిమాన కవిదిగ్గజం మహాకవి శ్రీ శ్రీ జయంతి సందర్భంగా...*
కరోన రోగపు
కరాళనృత్యం
కన్నుల ముందర
కథకళి చేస్తూ
కర్కషరోగపు
కబంధ హస్తం
కన్నూమిన్నూ
ఎరుగని జనులను
కబళించేస్తూ..
కాటికి తోస్తూ..
కాలచరిత్రను
ఖననం చేస్తూ
మహామహులకే
మరణాన్నిస్తూ
ధరాతలమ్మున
సర్వవ్యాప్తమై
మానవజాతిని
అగ్నిశిఖలకై
ఆహుతినిస్తూ..
ఆజ్యం పోస్తూ...
మృత్యుఘంటికల
మ్రోగించేస్తూ...
ఇలాతలంలో
జనావళంతా
ప్రమోదకాంక్షల
పరాకాష్టకై
ప్రమాదరేఖల
పరిధిని దాటి
భయకంపితులై
భయవిహ్వలులై
పరుగులు పరుగులు
పరుగులు తీస్తే.....
మనిషికి స్వాంతన
ఎక్కడ?ఎక్కడ??????
*....బోర్పట్ల విరాట్ స్వరూపాచార్య సిద్ధాంతి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి