ఏకం సత్. ఉన్నది వకటే అన్నప్పుడు యీ విశ్వంలో పదార్ధం లేక శక్తిని లేక అయస్కాంత చలన శక్తియా? దీనిని లెక్కింప శక్తి కొలమానం అశ్వ చలన శక్తి యని. అయిన సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం. ఏక చక్ర రధం రూఢం సూర్యశక్తియని తెలియుచున్నది. ఏక చక్ర అనగా వకే వృత్తాకరంగా వున్న సమస్తం శక్తి రెండుగా రాహు కేతు తత్వ శక్తిగా మారి అపై ఐదు రంగులుగల గాయత్రీ రంగులైన ముక్తా విద్రుమ, హేమ నీల ధవళ రూపమై ఆపై గ్రహ శక్తి అది రూప గుణ లక్షణముగా మారు చున్నది. ఏడు రంగుల ఏడు గ్రహముల శక్తిగా మారు చున్నది. అది విబ్జాయర్ అని ఆధునికుల విషయం. సప్త సప్త మహా సప్త యని సప్త ద్వీప పరివృత్తమై యున్న శక్తిని కొలుచుట సాధ్యమా. పరిశీలన చేసిన అది అనంత మని పరిమాణ రూపం లేనిదని అదే వ్యాప్తంగా విషు విష్ణు తత్వ మని తెలియుచున్నది. ఏడు గ్రహముల శక్తికి మూలం రాహు కేతు మూలమైన శక్తియే.మూల శక్తి లక్షణము తెలియుట అసాధ్యం. మహా సౌర నిర్ణయం కూడా రాహువు తత్వం తెలియక కేతు తత్వమే మూలమని భాసయత్ ప్రకాశించిన తరువాతనే తెలిసినది. అదియును అసంపూర్ణమే.ప్రకాశవంతవంతమైన తరువాతనే పదార్ధరూపం. జీవునికి చైతన్యరూప జీవునిగా దేహ సంబంధమైనదని తెలియుట వక్క మానవునికే తప్ప యితర జీవ జాలము లకు తెలియదు. అదియే ప్ర ఙ్ఞానమని తెలియును. ఉత్తమమైనది మానవ జన్మయే. మరలా అది వచ్చునో రాదో.వచ్చినా పురుషుడు పురుషుడుగా వచ్చుట అసంభవం స్ర్రీ స్త్రీగా వచ్చుట కూడా అసంభవం. దీనికి సాధనయే మూలం. అసలు జీవుడుగా ధరించకుండుటకు సాధన తప్ప వేరు మార్గం లేదు. తస్మాత్ జాగృత జాగ్రతః ఎల్లప్పుడు జాగ్రత్తగా వుండుట కుదరదు. మాయవలన. మాయనుండి వచ్చుటవలన మాయ గానే వెడలుట సృష్టి ధర్మం. దీనికి అతీతముగా వెడలుటయే మెూక్షమని, తిరిగి రాకుండుటయే యని తెలియుట. దీనినే పునరావృత్తి రహితయని లలితా సహస్రం తెలుపు చున్నది. తెలుసుకుంటూ నే వుందాం. ఆచరిస్తూ నే వుందాం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి