#ఆదివారం_పవిత్రదినం!!
🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼🌼
*ఆదివారం నాడు ఏం చేయకూడదో చెప్పిన శాస్త్రాల లోని శ్లోకాలు...!!
అమిషం మధుపానం చ యః కరోతి రవేర్దినే |
సప్తజన్మ భవేద్రోగీ జన్మ జన్మ దరిద్రతా ||
స్త్రీ తైల మధుమాంసాని
యే త్యజంతి రవేర్దినే |
న వ్యాధి శోక దారిద్ర్యం ,
సూర్యలోకం స గచ్చతి ||
తాత్పర్యం:
మాంసం తినడం..! మద్యం తాగడం..!
స్త్రీతో సాంగత్యం..! క్షవరం చేసుకోవటం..!
తలకు నూనె పెట్టుకోవడం..!
ఇలాంటివి ఆదివారం నాడు నిషేధించారు!!
కానీ ఈ పనులన్నీ మనం ఆదివారమే చేస్తున్నాం..!! ఈ కర్మలు చేసినవాడు జన్మ జన్మలకు దరిద్రుడు అవుతాడు అని నొక్కి చెప్పారు మన పెద్దలు... !! దారిద్ర్యం అంటే డబ్బు లేకపోవడం ఒక్కటే కాదు.. ఆనారోగ్యం కూడా..!!
ఇలాంటి పవిత్రమైన రోజు తాగుబోతులకి, తిండిపోతులకి ఇష్టమైన రోజు అయింది..!!
మన సనాతన ధర్మంలో పురాణ ఇతిహాసాల్లో ఏ రోజుకి ఇవ్వని ప్రాధాన్యత ఆదివారానికి ఇచ్చారు..!!
ఎందుకంటే.. అనాదిగా మన వాళ్ళందరూ సూర్యోపాసకులు.. సూర్యుణ్ని ఆరాధించే సంస్కృతి మన భారతీయ హైందవ సంస్కృతి..!! సూర్యుడు మనకు కనిపించే ప్రత్యక్షదైవం..!!
అందుకే మనకొచ్చే ముఖ్యమైన పండుగలన్నీ కూడా సౌరమానం అంటే సూర్యుని ఆధారం గానే వస్తాయి..!!
ప్రాతః కాలంలో నిద్రలేచి సూర్య నమస్కారాలు, సంధ్యా వందనాలు లాంటి సనాతన సాంప్రదాయ కర్మలు సూర్యుణ్ని ఆరాధించే పద్దతిలో ముఖ్యమైనవి..!!
ఇలాంటి ఆదివారం మనకి చాలా పవిత్రమైన రోజు.. అలాంటి ఆదివారాన్ని వీకెండ్ పేరుతో ఆదివారం సెలవు అనే పేరుతో అపవిత్రం పాలు చేశారు..!! చేస్తున్నాము..!!
మనది భిన్నత్వంలో ఏకత్వం అనే సంస్కృతి అందరికీ తెలుసు ...ఎన్ని ఆచారాలు, సంస్కృతులు భిన్నంగా ఉన్న మన అందరిది హిందూ ధర్మమే అనే ఏకత్వాన్ని తెలిపేది మన హైందవ సంస్కృతి...!!
అది చూసి తట్టుకోలేక బ్రిటీషు వాడు (Thomas Babington Macaulay, ఈ నీచుడు గురించి ఎంత చెప్పినా తక్కువే) ప్రయోగించిన బ్రహ్మాస్త్రమే ఆదివారం సెలవు.. మన హిందువులే మన సంస్కృతిని నాశనం చేసేలా చేశారు..!! ఆదివారం నాడు చర్చిలు కలకలలాడతాయి.! మన హిందూ దేవాలయాలు వెలవెల బోతాయి.!!
పూర్వకాలంలో వృత్తి పనులు చేసుకునే వారు అమావాస్యను సెలవు దినంగా పాటించేవారు.! ఇప్పటికీ కొన్ని దుకాణాల వారు అమావాస్య నాడు తెరువరు.!
మన హిందువులు ఆదివారాన్ని పరమ పవిత్రంగా భావించే వారు.. ఆరోజు జీవహింస చేసి మాంసాన్ని తినేవారు కాదు.. మధ్యాన్ని తాగేవారు కాదు..!!
కానీ ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయ్యింది!!
ఆదివారమొస్తే సెలవు దినం కదా అని మద్యాహ్నం 12 గంటల దాకా పడుకునే వారున్నారు.! ఇప్పటికైనా కళ్ళు తెరవండి.! విదేశీ సంస్కృతిని విడనాడండి.! #స్వదేశీ_సాంప్రదాయాలను పాటించండి..!!
యోగ చేయండి.! ప్రాణాయామం చేయండి.! #సూర్య_నమస్కారాలు చేయండి.! #సూర్యోపాసన చేయండి.!! ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొందండి..!!
ఈ పోస్టు కొందరు సోదరులకు ఉత్సాహాన్ని మరియు కొందరికి నిరుత్సాహాన్ని ఇచ్చి ఉంటుంది..!! కానీ దీన్ని పాటించడానికి ప్రయత్నించండి..!!
ఒకేసారి అన్నీ మార్పులు సాధ్యపడకపోవచ్చు కానీ క్రమ క్రమముగా ఒక్కొక్కటి మార్చుకుంటూ పోతే కొన్ని సంవత్సరాలకు అన్నీ మార్పులు చేసుకోవచ్చు
ఆదివారం సెలవు ఉండటం అనేది అతి పెద్ద కారణం కావచ్చు అనుకుంటా.
ఈ విషయం పై బాగా చర్చ జరగాలి
మార్పు రావాలి
స్వస్తి..!!
#హిందూ_ధర్మం_వర్థిల్లాలి..!! #జయహో_భారత్..!!
🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥🔥
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి