పునరపి జననం పునరపి మరణం :-
కర్మ ఫలం ను మూడు విధాలుగా చెబుతారు. అనేక జన్మ ల నుండి పెరిగిన కర్మ జాలమును సంచిత కర్మము నుండి ఈ జన్మము నందు అనుభవించ వలసిన కర్మ ను ప్రారబ్ధం అని, ఈ జన్మ మందు చేయబడి ముందు జన్మముల యందు అనుభవించ వలసిన కర్మ ను ఆగామి అని చెబుతారు
చేసిన ఏ పని వ్రధాపోదు. ప్రతి పనికి మంచో, చెడో ఫలితం ఉంటుంది. ఆ ఫలితాన్ని మానవుడు అనుభవించక తప్పదు. కొన్ని ఫలితాలను అప్పటి కప్పుడే అనుభవిస్తాడు. కొన్ని కర్మల ఫలితాలు ఈ జన్మ లో అనుభవించ లేక పోవచ్చును. మనిషి మరణించినా కర్మ ఫలం నశించదు. అది జీవాత్మను వాసనా రూపంలో అంటిపెట్టుకుని కొనసాగుతూనే ఉంటుంది.
అందుచేత అనేక జన్మలలో అనుభవానికి రాకుండా మిగిలిపోయిన సంచిత కర్మఫలం విధిగా జీవుడిని, మరొక జన్మ ఎత్తేటట్టు చేస్తుంది. ఈ జన్మ మొదలు అయిన దగ్గర నుండి శరీరాన్ని విడిచి పెట్టేవరకూ అనుభవించిన కర్మను ప్రారబ్ధం అంటారు. ఈ ప్రారబ్ద కర్మను ఎవ్వరూ తప్పించలేరు. ఈ జన్మలో జీవుడు కొన్ని కర్మలు చేస్తాడు. ఆ కర్మఫలాలో కొన్ని అనుభవించాక ఇంకా కొన్ని మిగిలిపోయి పెద్ద పెద్ద గుట్టలు గా పెరిగిపోతాయి. వాటిని అనుభవించడానికి మరొక జన్మ ఎత్తవలసి ఉంటుంది. పాత కర్మల అనుభవాలు తరిగిపోతూంటే, కొత్తవి పెరిగిపోతూంటాయి. అదొక నిరంతర చక్రం దానికి ఆది, అంతం లేదు. అందుకే మానవుడు జనన, మరణ పరంపర అనే చక్రం లో పడి తిరుగుతూ ఉంటాడు. అదే కర్మ సిద్ధాంతం. కర్మ ఫలం అనుల్లంఘనీయం. సత్కర్మలు వల్ల ఉత్తమ గతులు, దుష్కర్మ వల్ల అధమ గతులు ప్రాప్తిస్తాయి. ఏ కర్మ అయినా పునహ్ పునర్జన్మల కు కారణం అవుతుంది. సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి