11, జులై 2021, ఆదివారం

శ్రీ వారాహి నవరాత్రులు

 _*నేటి నుండి శ్రీ వారాహి నవరాత్రులు ప్రారంభం*_


🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉


*ఆషాఢమాసం - శ్రీ వారాహి నవరాత్రి* 



*ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి ఆషాఢ శుద్ధ నవమి వరకు గల తిథుల రాత్రి సమయంలో వారాహీ అమ్మవారిని పూజిస్తారు. వీటిని గుప్తనవరాత్రులు అంటారు.* 


*అమ్మవారి వైభవం*


మనకు శ్రీ విద్యా సంప్రదాయంలో గల నాలుగు ముఖ్య నవరాత్రులలో ఆషాఢంలో వచ్చే వారాహి నవరాత్రి ఒకటి. వారాహి దేవి లలితా పరాభట్టారిక యొక్క సేనాని..లలిత యొక్క రధ , గజ , తురగ , సైన్య బలాలు అన్నీ వారాహి యొక్క ఆధీనంలో ఉంటాయి.  అందుకే ఆవిడను దండనాథ అన్నారు.


లలితా పరమేశ్వరి యొక్క ఐదు పుష్పబాణాల నుంచి ఉద్భవించిన శక్తుల వరాహ ముఖంతో ఆవిర్భవించిన శక్తి శ్రీ మహా వారాహీ దేవి.  లలితా దేవి సైన్యానికి ఆమె సర్వ సైన్యాధ్యక్షురాలు.  ఆమెకు ప్రత్యేక రథం ఉంది  దానిపేరు కిరి చక్రం.  ఆ రథాన్ని 1000 వరాహాలు లాగుతాయి , రథసారథి పేరు స్థంభిని దేవి.  ఆమె రథంలో దేవతా గణమంతా కొలువై ఉంటుంది. ముఖ్యంగా ఆయుర్వేద మూలపురుషుడైన ధన్వంతరీ , మరియు దేవవైధ్యులైన అశ్విని దేవతలు. 


*కిరిచక్ర రథారూఢ దండనాథా పురస్కృతా |*

*జ్వాలామాలిని కాక్షిప్త వహ్నిప్రాకార మధ్యగా || 27 ||*


*భండసైన్య వధోద్యుక్త శక్తి విక్రమహర్షితా |*

*నిత్యా పరాక్రమాటోప నిరీక్షణ సముత్సుకా || 28 ||*


*భండపుత్ర వధోద్యుక్త బాలావిక్రమ నందితా |*

*మంత్రిణ్యంబా విరచిత విషంగ వధతోషితా || 29 ||*

*విశుక్ర ప్రాణహరణ వారాహీ వీర్యనందితా |*


అంటూ లలితా సహస్రనామాల్లో హయగ్రీవ , అగస్త్యులు ఈ అమ్మవారి గురించే చెప్పుకున్నారు.  విశుక్రుడిని ఈ తల్లి హతమార్చింది.  ఈ అమ్మవారిని ఆజ్ఞా చక్రంలో ధ్యానిస్తారు.


వారాహీ అమ్మవారు అంటే భూదేవి. హిరణ్యాక్షుడు భూదేవిని జలాల్లోకి తీసుకువెళ్ళినప్పుడు , శ్రీ మహావిష్ణువు వరాహరూపంలో అవతరించి , వాడిని సంహరించి , భూదేవిని రక్షిస్తాడు.  స్వామి మీద ప్రేమతో అప్పుడు అమ్మవారు వారాహీ రూపం తీసుకుందని , అందువలన ఈమె వరాహస్వామి యొక్క స్త్రీ రూపమని కొన్ని ధ్యానశ్లోకాల్లో కనిపిస్తుంది. అంటే వారాహీ అమ్మవారు అంటే ఎవరో కాదు సర్వసంపదలను ఇచ్చే శ్రీ మహాలక్ష్మీ అందుకే శ్రీ లక్ష్మీ సహస్రనామ స్తోత్రంలో వారాహీ ధరణీ ధ్రువా అని కనిపిస్తుంది. కాబట్టి ఈ అమ్మవారిని పూజిస్తే వరహాస్వామి లాగే అన్ని కోరికలను నెరవేర్చుతుంది. భూతగాదాలను నివారిస్తుంది , లేదా పరిష్కరిస్తుంది. 


అమ్మ స్వరూపాన్ని గమనిస్తే వరాహ ముఖంతో , అష్ట భుజాలతో , శంఖ , చక్ర , హల(నాగలి), ముసల(రోకలి), పాశ , అంకుశ , వరద , అభయ హస్తాలతో ప్రకాశిస్తూ మనకు దర్శనం ఇస్తుంది.   ఇది మహావారాహి (బృహద్వారాహి) యొక్క స్వరూపం.  ఇంకా లఘువారాహి , స్వప్నవారాహి , ధూమ్రవారాహి , కిరాతవారాహిగా అమ్మ ఉపాసకుల పూజలు అందుకుంటుంది.


అమ్మవారి చిత్రాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే , ఆవిడ హలము (నాగలి), ముసలము (రోకలి) ధరించి కనిపిస్తుంది. నాగలిని భూమిని దున్నడానికి ఉపయోగిస్తే , రోకలిని ధాన్యం దంచడానికి వాడతారు. దీనిబట్టి అమ్మవారు సస్యదేవత అని గ్రహించాలి. అంటే పాడిపంటలను సమృద్ధిగా ఇచ్చే కల్పవల్లీ శ్రీ వారాహీ మాత.  అందుకే అమ్మవారిని ఆషాఢ మాసంలో పూజించమన్నారు. నిజానికి రైతు గోఆధారిత వ్యవసాయం ద్వారా భూమిని శుద్ధి చేసి , సాగు చేస్తే అది కూడా ఒక రకమైన వారాహీ ఉపాసనే అవుతుంది. ఎందుకంటే వారాహీ అంటే ఎవరో కాదు సాక్షాత్తు భూమాత. 


పరాశక్తిలోని సౌమ్యం శ్యామల అయితే , ఉగ్రం వారాహి.   శ్రీ విద్యా గద్యంలో *"అహంకార స్వరూప దండనాథా సంసేవితే, బుద్ధి స్వరూప మంత్రిణ్యుపసేవితే"*  అని లలితను కీర్తిస్తారు.   దేవీ కవచంలో *"ఆయూ రక్షతు వారాహి"* అన్నట్టు.   ఈ తల్లి ప్రాణ సంరక్షిణి.   ఆజ్ఞాచక్రం ఆవిడ నివాసం


ప్రకృతి పరంగా చూసినట్లైతే   ఈ సమయంలో వర్షం కురుస్తుంది    రైతులు భూమిలో విత్తనాలు చల్లడానికి తయారవుతారు.  దేశం ధాన్యంతో సుభిక్షంగా ఉండాలని ధాన్యలక్ష్మీ స్వరూపమైన వారాహిని ప్రార్థన చేయడం జరుగుతుంది.



వారాహీ అమ్మవారిని చూసి ఉగ్రదేవతగా భ్రమపడతారు కొందరు.  కానీ వారాహీ చాలా శాంతస్వరూపిణి.  వెంటనే అనుగ్రహిస్తుంది , కరుణారస మూర్తి అని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి. వారాహీ అమ్మవారిని స్మరిస్తే శత్రు నాశనం జరుగుతుంది , అంటే వ్యక్తిలో ఉన్న అంతఃశ్శత్రువులైన కామం , క్రోధం , లోభం , మోహం , మదం , మాత్సర్యం , అహంకారం , అజ్ఞానం నశిస్తాయి. అంతఃశ్శత్రువులను జయించినవాడికి బయట శత్రువులు ఉండరు లేదా కనిపించరు , అంత విశాలమైన దృష్టి అతడికి కలుగుతుంది. అలాంటి దివ్యస్థాయిని ప్రసాదిస్తుంది వారాహీ మాత.


*1. ఓం శ్రీం హ్రీం క్లీం వరాహై మమ వాక్మే ప్రవేశయా వాకు పాలితాయ ||*

*మమ మాతా వరాహి మమ దారిద్ర్యం నాశాయ నాశాయ హుం భట ||*


*2. ఓం శత్రు శంకరి సంకటహరణీ మమ మాత్రే హ్రీం దుం వం సర్వారిష్టం నివారాయ నివారాయ హుం భట్ ||*


*3. ఓం క్లీం వారాహి హ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం సిద్ధి స్వరూపిణి శ్రీం ధనవశంకరి ధనం వర్షాయా వర్షాయా స్వాహా ||*


*4. ఓం శ్రీం పంచమి సర్వసిద్ధి మాతా మమ గృహామి ధనం ధన్యాం సమృద్ధిం దేహి దేహి నమః ||*



*5. ఓం హ్రీం భయానకరీ అతి భయంకరి ఆశ్చర్యా భయంకరీ సర్వ జన భయంకరీ ||*

*సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పావతు మే సదా ||*

*సర్వ భూత ప్రేత పిశాచ భయంకరీ సర్వ భయం నివారాయ శాంతిర్ పాదుమే సదా ||*


అమ్మ ఉగ్రంగా కనబడినప్పటికి  బిడ్డలను కంటికి రెప్పలా కాపాడే కన్నతల్లి. ముఖ్య ప్రాణ రక్షిణి.


*హయగ్రీవ స్వామి అగస్త్యులవారికి చెప్పిన వారాహి నామములు*



☘  పంచమి                   

☘  దండనాథా                                                     

☘  సంకేతా

☘  సమయేశ్వరి

☘  సమయ సంకేతా

☘  వారాహి

☘  పోత్రిణి

☘  వార్తాళి

☘  శివా

☘  ఆజ్ఞా చక్రేశ్వరి

☘  అరిఘ్ని



*దేశం సుభిక్షంగా ఉండాలని...మనమంతా చల్లగా ఉండాలని...ధర్మం వైపు మనం నడవాలని...అమ్మ మహావారాహి పాదాలను పట్టి ప్రార్దనచేద్దాం*


*ధూర్తానామతి దూరా వార్తాశేషావలగ్న కమనీయా* 

*ఆర్తాళీ శుభదాత్రీ వార్తాళీ భవతు వాంఛితార్థాయ*


*సర్వం శ్రీవారాహి(దండిని) చారణారవిందార్పణమస్తు ||*

కామెంట్‌లు లేవు: