23, ఆగస్టు 2020, ఆదివారం

అశ్వ మేధం



. అశ్వ రూపంలో ఏదైతే శక్తి కలదో అనగా గుఱ్ఱం చైతన్యం వలననే వేగ శక్తి ప్రేరేపిత మగును.కావ్యాలలోగాని పురాణయితిహాసములలోగాని జీవ హింస చేయుట లేదు.శక్తిని మధించుట అనగా ద్విగుణీకృతము చేయుట యఙ్ఞమని. అశ్వ అనగా కేతువు శక్తి విషు విష్ణు శక్తిని మేధ మధించుట మనస్సుచేత. మనో రూప శబ్దములు పూర్వక మంత్ర ములతో హవిస్సుగా మార్చుట.శబ్దమునకు మనస్సు ముఖ్యం. అంతే కాని గుఱ్ఱములను చంపుట కాదు. సూక్మమైన తత్వం గ్రహించాలి. అందుకే జప హోమ దాన తత్పరాదులు అని. ప్రతీ దానికి నియమిత కాలపరిమితి కలదు అగ్నిని సూర్యోదయం తరువాతనే హవిస్సు తర్పణాలు జపం చేయాలి. దేనికైనా సూర్యోదయం తరువాతనే దానం కూడా ప్రత్యక్ష సాక్షీభూతంగా సూర్య శక్తి. అగ్ని సంబంధించిన కార్యములు సమస్తం పచనం చేయుట కూడా వంట చేయుట రాత్రి నిషేధం. అది పాశ్చాశ్చ్యుల అనగా రాక్షస ప్రవృత్తి. వేదములను రక్షించి నది విష్ణువు. యఙ్ఞం ఫలం స్వీకరించిన విషు లక్షణము. విష్ణు తత్వం తెలియుటకై యఙ్ఞం చేయుట. మనం కూడా నిత్యజీవితంలో యఙ్ఞం చేయుచున్నాము దేహ రక్షణకు. ప్రకృతి కూడా మనకు తెలియకుండానే యఙ్ఞం చేసి ప్రకృతి ద్వారా జీవో ధ్ధరణ చేయుచున్నది. కాల పురుషుడు ఆగుటకై లేదు. నిరంతరాయంగా చక్రం తిరుగుతూనే వున్నది. జనన మరణాలు సహజంగా జరుగుతూనే యున్నవి వారి వారి కర్మ ఫలానుసారంగా.
  1. *****************

కామెంట్‌లు లేవు: