23, ఆగస్టు 2020, ఆదివారం

మహారాజు యుధిష్ఠిరుడు గొప్ప నీతికోవిదుడు,

మహారాజు యుధిష్ఠిరుడు గొప్ప విద్యావంతుడు, నీతికోవిదుడు, ధర్మయర్మాలు తెలిసినవాడు మాత్రమే కాదు. అద్భుతమైన సమతాద్రుక్పథం కలవాడు. ఒకప్పటి సంఘటన ఇది. పాండవులు వనంలో ఉండగా - ఒక బ్రాహ్మణుడు తన అరణిని, మథించే కర్రను ఒక చెట్టు కొమ్మ కు వ్రేలాడగట్టాడు. (యఙ్ఞవిధికి వలయు అగ్ని ని స్రుష్ఠించుటకు శాస్త నిర్దిష్టములైన రెండు కర్రలను తెచ్చి ఒకదానితో ఒకటి ఒరపిడిపెడతారు. అందు ఒకదానిని ఆరణి అని, రెండవ దానిని మంథనకాష్టము అని అంటారు.) ఆ సమయంలో ఎక్కడనుండియో ఒక లేడి వచ్చి తన కొమ్మును తీట తీర్చుకొనుటకు ఆ కర్రలకు రాచికోవడం మొదలు పెట్టింది. అప్పుడు ఆ కర్రలు దాని కొమ్ము ల లో ఇరుక్కొనిపోయాయి. ఆ కర్రలతో అది పారిపోయింది. ఆ కర్రలు లేకపోవుట చేత తన యఙ్ఞవిధికి అవరోధం కలుగునని ఎంచి ఆ బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వెళ్లి తన ఆరణిని, మంథనకాష్టము ను తెచ్చి ఇమ్మని ప్రార్ధించాడు. అప్పుడు ధర్మరాజు తన సోదరులను నలుగురు ని తీసుకుని ఆ లేడి వెనుక పరుగులు పెట్టాడు. కానీ ఆ మ్రుగము చూస్తుండగానే కనుచూపుకు అందనంత దూరం పోయింది. పరుగులు పెట్టి పాండవులు దాహం వేసింది. అన్న అనుమతి ని తీసుకుని నకులుడు నీటిని వెదకడానికి వెళ్ళగా అతనికి దగ్గర లోనే ఒక జలాశయం కనపడింది. అతడు దానిని సమీపించి నీరు త్రాగబోతుండగా "ఆగు! ముందు నా ప్రశ్నలకు సమాధానం చెప్పు. అనంతరం నీరు సేవించు" అన్న ఆకాశవాణి వినిపించింది. అయినా దాహం ఎక్కువగా ఉండడంతో ఆ వాణిని లెక్క చేయకుండా నీరు త్రాగుడు. వెంటనే అతడు నిర్జీవుడై నేలమీద కూలిపోయాడు. అతని వెనుక ధర్మరాజు, సహదేవుడు ని, అర్జునుడు ని, భీమసేనుడు ని కూడా పంపాడు. వారి ముగ్గురు కి కూడా అదే గతి పట్టింది. ఆఖరికి ధర్మరాజు కూడా ఆ జలాశయం దగ్గర కు వచ్చాడు. అతడు నిశ్చేష్ఠుడై పడియున్న తన నలుగురు సోదరులను చూశాడు. అతనికి కూడా ఆ ఆకాశవాణి వినిపించింది. అంతలో అతనికి విశాలకాయుడైన యక్షుడు కనిపించేడు. నా ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా నీరు త్రాగినందువలన నీ సోదరులు కు ఈ దురవస్థ పట్టింది. నువ్వు కూడా వీరివలే అనధికారచేష్ఠకు పాల్పడితే ప్రాణాలు కోల్పోవలసి వస్తుంది అని ఆ యక్షుడు హెచ్చరించాడు. అప్పుడు ధర్మనందనుడు ఆ యక్చుని ప్రశ్నలకు సమాధానం చెప్పుటకు సిద్ధమయ్యాడు. యక్షుడు అడిగిన అన్ని ప్రశ్నలకు అన్నిటికీ క్రమంగా సముచితరీతిని సమాధానం లు చెప్పాడు. అప్పుడు యక్షుడు ప్రసన్నత చెంది రాజేంద్రా! నీ సోదరులలో ఎవర్ని బ్రతికించుమన్న వానిని బ్రదికించెదను. ఎవరిని బ్రతికించ మందువు? అని ధర్మరాజు అడిగాడు. ధర్మరాజు నకులుడు ని సజీవంగా చూడగోరాడు. కారణం ఏమని యక్షుడు అడిగాడు. అందులకు ధర్మరాజు - మహాత్మా! నా తండ్రి కి కుంతి, మాద్రి అను ఇద్దరు భార్యలు ఉన్నారు. నా దృష్టిలో వారు ఇద్దరు నూ సమాన స్థితిలోనివారే. కుంతి కుమారునిగా నేను ఎలా సజీవంగా ఉన్నానో, అలాగే మాద్రి కుమారుడు కూడా ఒకడు సజీవుడు కావాలి అన్నది నా ఆకాంక్ష. ఆ కారణంగా భీముడి ని అర్జునుడు ని కాదని నకులుడు ని సజీవుడు గా ఉండాలని భావిస్తున్నాను అని బదులిచ్చాడు. యుధిష్ఠిరుని బుద్ధి కుశలతను, ధర్మనిష్ఠ ను పరీక్చించడం కోసమే స్వయంగా ధర్మదేవుడు ఈ లీలను సాగించేడు. ధర్మనందనుని సమతాద్రుక్పథం ను చూసి ఎంతయో సంతోషించి తన నిజరూపాన్ని చూపించాడు. అతని నలుగురు సోదరులను కూడా బ్రతికించాడు. అంతేకాకుండా తానే లేడి రూపము న వచ్చి బ్రాహ్మణుని మంథనకాష్టము ను కూడా అతనికి ఇచ్చి వేశాడు. యుధిష్ఠిరుడు ఆ మంథనకాష్టము ను తీసుకుని వెళ్లి ఆ బ్రాహ్మణుని కి ఇచ్చాడు.,... సేకరణ

కామెంట్‌లు లేవు: