23, ఆగస్టు 2020, ఆదివారం

*మనుచరిత్ర---2*

తెలుగులో పంచ కావ్యాలు ఉన్నవి.
 సంస్కృత భాష లో కూడా పంచకావ్యాలు ఉన్నాయి. ఇందులో  కాళిదాసు రాసిన గ్రంథాలు మూడు. 
1.రఘువంశము 
2.కుమారసంభవము  3.మేఘసందేశము  4.భారవి రాసిన కావ్యం పేరు కిరాతార్జునీయము. 5.మాఘుడు రాసిన కావ్యం పేరు శిశుపాలవధ.

మొదటి కొన్ని వందల ఏళ్ళ జరుగగా సంస్కృత
భాషకున్నంత
మర్యాద మనతెలుగు భాషకు కూడా వచ్చెను.
మన తెలుగు భాషలో కూడా అంతటి మహాకవులు పుట్టిరి. అందుచేత మన భాషలో కూడా పంచకావ్యాలు బయలుదేరినవి. వానిలో
1.అల్లసాని పెద్దన మనుచరిత్రము.
2.రామరాజ
భూషణుడు
రాసిన
వసుచరిత్రము.  3.ఆముక్తమాల్యద
 ఈ గ్రంథమును శ్రీకృష్ణదేవరాయల వారే రాసిరి. 
4.తెనాలి రామకృష్ణ కవి రాసిన పాండురంగ
మహాత్మ్యము.5.శృంగార నైషధము
ఈ గ్రంథం రాసిన ఆయన పేరు శ్రీనాథమహాకవి
 పై నాలుగుగ్రంథములు
స్వతంత్రములు.
 ఈ నైషధము మాత్రము అనువాదం. సంస్కృతములో శ్రీహర్షుడు అన్నా గొప్ప కవికలడు. ఆయన నైషధమను
గొప్ప కావ్యము వ్రాసెను. మన తెలుగులోని పంచ కావ్యములు ఒకటైనా శృంగారనైషధము హర్షుడు సంస్కృతంలో రాసిన నైషధమునకు  తెలుగు  అనువాదమని చెప్పవచ్చును.

ప్రస్తుత మన కావ్యము పేరు *మనుచరిత్రము*. మనకు పూర్వము మనవులున్నారు . కాలమున్నది.
కాలమునకు గుర్తులున్నవి. ఇది 2020 . ఇది పాశ్చాత్యుల లెక్క. మన భారతీయ లెక్క వేరు.
శార్వరీ నామ సంవత్సరం, శ్రావణమాసం, బహుళపక్షం, మంగళవారం
ఈ లెక్క మన దేశంలో ఇంకా మాసిపోలేదు.
ఒక సంవత్సరం తర్వాత మరొక సంవత్సరం వచ్చుచుండును మనకు ఇటువంటివి 60 సంవత్సరాలు కలవు. 
అవితిరిగి
తిరిగివచ్చుచుండునుదీని కంటే పెద్ద  కొలత ఉన్నది. దాని పేరు యుగము. కలియుగం. మరియు పెద్ద కొలత ఉన్నది దాని పేరు మన్వంతరము. అనగా ఒక మనువు కొన్ని యుగములు రాజ్యముచేయును. మనుస్మృతి అని ఉన్నది కదా దాని పేరు అందరును
వినిఉండవచ్చు .దాని ప్రకారం భారతదేశంలో ప్రజలు చాలామంది నడుచుచుందురు.
ఇదివైవస్వత మన్వంతరము. ఇటువంటి మనువులు 14 మంది వారిలో ఒకాయన పేరు స్వారోచిషుడు.
ఈ పెద్దన్న గారు వ్రాసిన ఈ మనుచరిత్రము ఆ స్వారోచిషమనువు యొక్క కథ.
ఇది చాలా అందమైన కథ. పెద్దన్న గారు కూడా ఆ కథను అంత అందముగా
రాసినారు.
 అనగా అనగా ఒక ఊరు ఉన్నది.
ఆఊరి పేరు *అరుణాస్పదపురం.  ఊరి పక్కనే ఒక నది ఉన్నది. దాని పేరు *వరణ* వారణాసి అన్న పేరు విన్నాము కదా.
అది కాశీ పట్టణమునకు పేరు. *వరణ-అసి* అనే రెండు నదులున్నవి. ఆ రెండు నదుల మధ్యనున్న పట్టణం వారణాసి. మన *అరుణాస్పదపురం* వరణ ఒడ్డున ఉన్నది   అది పెద్ద నగరం. 
ఆ ఊరిలోని మేడలు  చాలా ఎత్తయినవి.  ఆఊరిలో  నాలుగు కులముల వారు  ఉన్నారు.
ఏ కులానికి
ఆ కులం లో  అఖండులున్నారు.
వారి ముందు  దేవతలు కూడా నిలువలేరు. అన్నిటికన్నా గొప్ప ఏమనగా ఆ ఊరిలో భోగమువాళ్లు కలరు.
వారు నాట్య విద్యలో నేర్పరులు . ఆ ఊరిలో ప్రవరుడు అను  ఒక బ్రాహ్మణుడు కలడు. చాలా అందగాడు  అతనికి చిన్నప్పుడే తల్లిదండ్రులు పెళ్లి చేసిరి.. . . ..

 ఇంకాఉంది...
డాక్టర్ నిభాపూడి సుబ్బరాజు
***************

కామెంట్‌లు లేవు: