23, ఆగస్టు 2020, ఆదివారం

Extra Corporeal Membrane Oxygenation therapy.

అనగా, శరీరం లోపల ఉండి గుండె ఊపిరితిత్తులు చేసే పనిని రోగి శరీరం వెలుపల ఉంచిన ఒక యంత్రంతో చేయించే చికిత్సా విధానము

రోగి ఊపిరితీసుకోగలిగినా తగినంత ఆక్సిజన్ శరీరానికి అందకపోతే అప్పుడు ఆక్సిజన్ ను గొట్టాలద్వారా అందిస్తారు.

ఒక వేళ రోగి తనంత తాను ఊపిరి తీసకోలేక పోతే వెంటిలేటర్ అమరుస్తారు. వెంటిలేటర్ పెట్టినప్పటికీ ఊపిరి తిత్తులు పని తీరు బాగుండక పోతే అప్పుడు రోగి తనంత తాను ఊపిరితీసుకునే వరకూ ECMO థెరపీద్వారా శ్వాస అందేలా చేస్తారు.

విషమ స్ఠితిలో ఉన్న కోవిడ్ 19 రొగుల పరిస్థితి ECMO వైద్య సాయం చేయడం ద్వారా వారి ఆరోగ్యం మెరుగు పడుతుంది.
Critically Ill COVID-19 Patient Better After ECMO Treatment

ఆ మిషన్ పని చేయించడానికీ, అనారోగ్యవంతుడిని  గమనించడానికి డాక్టర్లు, టెక్నికల్ మరియూ నర్సింగ్ స్టాఫ్ అవసరమవుతారు.

ఎంతటి తీవ్ర అనారోగ్య స్థాయికి చేరుకున్న రోగికైనా చికిత్స అందించగలిగే మెరుగైన సదుపాయాలున్న, వసతులున్స ఆరొగ్యశాలలు, డాక్టర్లు, టెక్నీషియన్లు, నర్సులు  దేశమంతటా  ఉంటే, వైద్యం కోసం దూర ప్రాంతాలకు దేశాలకు వెళ్ళనవసరం ఉండదు.
*********************

కామెంట్‌లు లేవు: