23, ఆగస్టు 2020, ఆదివారం

విజ్ఞ్యానం -సామాజిక జీవనం

విజ్ఞానము మనల్ని ఎక్కడి నుండి ఎక్కడికి తెచ్చిందో చూడండి..!!*

ప్రకృతిని, పర్యావరణాన్ని కాపాడకుండా మన ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఘోరమైన పరిస్థితిలు సంభవిస్తాయి. ఇప్పటి నుండే ప్రతి ఒక్కరూ రసాయనాలు వాడకుండా ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పండించిన అన్ని రకాల ఆహార ధాన్యాలను, కూరగాయలు, పండ్లు మొదలగునవి  తింటుంటే భవిష్యత్తులో ఎన్ని రకాల వైరస్లు వచ్చిన తట్టుకునే శక్తి ప్రతి ఒక్కరికి కలుగుతుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది తద్వారా ఆరోగ్యంగా ఉండగలుగుతాము ఇది ప్రతి పౌరుడు తెలుసుకోవలసిన ముఖ్యవిషయాలు.

👉మొదట : బావులలో నీరు త్రాగి వందేళ్ళు బ్రతికేవారు.
👉ఇప్పుడు : ఫిల్టర్ నీరు త్రాగుతూ 40 యేళ్ళకే ముసలి వాళ్ళం అయిపోతున్నాము.

👉మొదట : నూనె  గింజలు గానుగ ఆడించిన నూనె తిని వృధాప్యములోనూ గట్టిగా వుండేవారు.
👉ఇప్పుడు : డబల్ ఫిల్టర్ రిఫైండ్ ఆయిల్ తింటూ కూడా చిన్న వయసులోనె   హృదయాఘాతానికి గురి అవుతున్నాము.

👉మొదట : రాళ్ళ ఉప్పును సేవించినా ఆరోగ్యవంతులుగా వుండేవారు.
👉ఇప్పుడు : అయోడిన్ ఉప్పు సేవిస్తున్నా హై బీ.పి &  బీ.పి తో బ్రతుకుతున్నాము.

👉మొదట : వేప పుల్లలు, బొగ్గు, ఉప్పుతో పల్లు తోమి 80 సంవత్సారాలలో కూడా చెరుకుగడలు చీల్చుకుని తినేవారు.
👉ఇప్పుడు : కోల్గేట్ తో పల్లుతోముతూ కూడా డెంటిస్ట్ దగ్గరకు పరుగెత్తుతాం.

👉మొదట : నాడి పట్టుకుని రోగం ఏంటో చెప్పేసేవారు.
👉ఇప్పుడు : అన్ని స్కానింగ్లు చేసి కూడా రోగం ఏంటో చెప్పలేక పోతున్నారు.

👉మొదట : 7 - 8 మందికి జన్మనిచ్చిన తల్లి తన 80 వ యేట కూడ పొలం పనులు సునాయాసంగా చేసేది.
👉ఇప్పుడు : మొదటి నెల నుండి వైద్యల పర్యవేక్షణలో వున్నా ఆపరేషన్ తోనే పిల్లలు పుడుతున్నారు.

👉మొదట : బెల్లం పిండి వంటలను కడుపు నిండా తినేవారు.
👉ఇప్పుడు : తినక ముందే షుగర్ వచ్చేసి వుంటుంది.

👉మొదట : వృద్దులకు కూడా కీళ్ళ నొప్పులు వుండేవి కావు.
👉ఇప్పుడు : యవ్వన దశ నుండే కీళ్ళ జబ్బులు, నడుం నొప్పులు మొదలు అయిపోతున్నాయి.

చివరగా..!!
ఇది విజ్ఞానపు యుగమా లేక అజ్ఞానపు యుగమో తెలియడం లేదు. విధి విచిత్రము కాకపోతే, విజ్ఞానాన్ని సక్రమంగా వినియోగించి నప్పుడే అందరికీ మంచి జరుగుతుంది లేకపోతే నష్టం జరుగుతుంది..

ఈ విష్యం దయచేసి అన్యధా భావించవద్దు ఎవరు.
*************************

కామెంట్‌లు లేవు: