23, ఆగస్టు 2020, ఆదివారం

*మనుచరిత్ర* *ప్రబంధపరిచయం* 3

అరుణాస్పదపురం లో ఉండే ప్రవరాఖ్యుడు ప్రొద్దుటే భగవన్నామ స్మరణతో నిద్రలేస్తాడు.
వరణా నదిలో స్నానంచేస్తాడు.
 ఆ ఊరిలోని ప్రజలు అందరూ అతన్ని చూసి మెచ్చుకుంటారు.
 ప్రవరాఖ్యుడి కి బోలెడన్ని మాన్యాలున్నాయి. అవి బాగా పండుతాయి.
పాడి పంటలు సమృద్ధిగా ఉన్నాయి. అతడు ఎవరిని దేహి అని  యాచించడు. అంతే కాదు ఎవరైనా ఏదైనా ఇచ్చెదమన్న పుచ్చుకోడు.  ఎవరైనా ఏదైనా ఇచ్చినచో  పుచ్చుకోవటం అంటే వారి పాపమును మనము తీసుకునుట  అనే భావన అతనిది.
. వారి ఇంటిలో నిరతాన్నదానము జరుగును.
పగలు లేదు, అర్ధరాత్రి అని లేదు. అతనికి పుణ్యక్షేత్రములు చూచి రావాలని ఒక ఆశ.
తీర్థయాత్రికులను మిక్కిలి గౌరవించును.
వారిని వారు సేవించిన  తీర్థములను గురించి అడుగుచుండును..
ఒకప్పుడు వారి ఇంటికి ఒక సిద్ధుడు వచ్చినాడు. రుద్రాక్ష పోగులు, అతడొక చిత్రముగా ఉన్నాడు. మనదేశంలో ఒక ధర్మం కలదు. *అభ్యాగత స్వయం విష్ణుః* అని అనగా అతిధి స్వయముగా విష్ణువు అని అర్థము.
అనగా ఇంటికి వచ్చిన అతిధిని విష్ణువుని చూచినట్లు చూడవలయును అని అర్థం.
ప్రవరుడు అతనిని అట్లే చూసినాడు. ప్రవరుడు అతనిని గౌరవించి ఆతిథ్యం ఇచ్చి, అయ్యా! "మీరు ఏఏ దేశములకు వెళ్ళినారు?
ఏమేమి చూచినారు? అని అడిగెను". అతడు తాను చూచిన దేశములను అన్నింటిని చెప్పినాడు.
ఇచ్చట దేశం లో ఉన్న ప్రసిద్ధ క్షేత్రముల పేర్లు కలవు.
సిద్ధుడు ప్రసిద్ధ తీర్థముల, క్షేత్రముల, పేర్లన్నీ చెప్పగా, ప్రవరాఖ్యునకు
 ఒక అనుమానం వచ్చింది.
ఆ సిద్ధుని వయస్సు చిన్నది.
సొరకాయలు కోరుచున్నాడు అనుకుని, "స్వామి మీ వయసు ఇంత చిన్నది కదా! ఇవన్నియు మీరు ఎట్లు చూచితిరి"? అని అడుగగా
ఆ సిద్ధుడుఇట్లన్నాడు "మా దగ్గర పాద లేపనం అని ఒక మందు ఉన్నది. దానిని కాళ్లకుపూసికొన్నచో  ఆకాశమునందు సూర్యుని గుఱ్ఱములు
ఎంత తొందరగా  పోగు లో మేము అంత తొందరగా పోవుదము."
అని చెప్పినాడు.
ఆ మాట విన్న ప్రవరుడి కి మనసు నిలవలేదు.  స్వామి మీ శిష్యుడిని మీరు రక్షించాలి. నాకు తీర్థయాత్ర ఫలము మీరిప్పించాలి.  అని పట్టుబట్టాడు.
ఆ సిద్ధుడు ఇతని కాళ్ళకు ఆ మందు రాసినాడు. ఇంకేమున్నది హిమాలయము చూచుటకు వెళ్ళినాడు  ప్రవరాఖ్యుడు. 

*హిమాలయ పర్వత శోభలు*

ప్రవరాఖ్యుడు వెళ్ళినాడు. హిమాలయ పర్వతములు చూచినాడు.
అక్కడ నదులు కొండలమీద ప్రవహించే సెలయేళ్లు ఆ సెలయేళ్ల చప్పుడులు మద్దెలలు మ్రోగించి నట్లు ఉన్నది .
నెమళ్లు నృత్యము చేయుచున్నవి ఏనుగులు ఎచ్చటబడిన అచ్చటనే తిరుగుతచున్నవి.
 అచ్చట  బదరీ వనము ఉన్నది. పూర్వము  ఆ బదరీ వనములో నరనారాయణులు తిరిగినారు.
ప్రవరుడు అవి అన్నియు చూచినాడు. ఏనుగులు, పులులు, అడవిపందులు, మనుబిళ్ళు, ఎలుగు గొడ్లు,  ఓహో!
ఆ అడవి ఎంత అందముగా వున్నది. భగీరథుడు అచ్చటనే తపము చేసినాడు. గంగ అచ్చటనే భూమికి దిగినది.  అక్కడనే పార్వతి శివుని పెళ్లి ఆడినది.  అచ్చటనే శివుడు మన్మధుని దహించి నాడు.
అరరే! ఎన్ని అందములు. ఎన్ని అందమైన స్థలములు.
అసలు ఈ హిమవత్పర్వతమే ఎన్ని కథలకు పుట్టినిల్లు!
ఈ కొండ యొక్క గొప్పదనమును ఎవరు చెప్పగలుగుదురు?
పాపం ప్రవరాఖ్యుడు అవి అన్నియు చూచుచుండగా అతనికి వేళ తెలియలేదు మధ్యాహ్నమయింది ఆకలి అవుతుంది రేపు వచ్చి చూతములే అనుకున్నాడు.
 తీరా చూడగా కాళ్లకు రాసిన పాద లేపనము కరిగిపోయినది. అడుగుతీసి అడుగు వేయదమన్న కాలు రానిదే. ఇంకేమున్నది ఇంకేమున్నది భయము పుట్టినది. దుఃఖము కలిగినది. ఇట్లనుకున్నాడు
 అరే మా ఊరు ఎక్కడ? ఈ మంచుకొండ ఎక్కడ? నేనుమూర్ఖుడను కాకపోయినచో, ఇక్కడికి వత్తున్నా?ఎన్ని పుణ్యక్షేత్రాలు లేవు?
కాశీకి పోరాదా? గయకు పోరాదా? ద్వారకకు పోరాదా?
నా తల్లిదండ్రులు  ఏమగుదురు?
నా భార్యఏమగును?
నా శిష్యులు
ఏమగుదురు?
ఏ పుణ్యాత్ములైన నన్ను ఇంటికి చేర్చగలరా?
అని దుఃఖించుచునే ఉన్నాడు. నడుచుచునే
ఉన్నాడు..


రేపటి కోసం ఇంకా ఉంది.....  డాక్టర్ నిభాపూడి సుబ్బరాజు
***************

కామెంట్‌లు లేవు: