23, ఆగస్టు 2020, ఆదివారం

# శివామృతలహరి శతకంలోని ఒక పద్యం;

మ||

అనవద్యంబగు హేమపాత్రమున నిత్యంబిష్టమృష్టాన్నముల్
తినగాజాలినవాడు నయ్యును మహాదేవుండు భిక్షాన్నమున్
పునుకన్ కోరి భుజించేటేల?ప్రభు డెప్డున్ పాలితుల్ పొందు తు
ప్టిని ముష్టింగొని పుష్టిగాంచు గనుకన్ శ్రీ సిద్దలింగేశ్వరా

(భూతత్త్వం)

భావం : పాలకుడైన రాజుకు నిజమైన పుష్టిని చేకూర్చి పదికాలాలపాటు పదవిలో నిల్పగలిగేది రాచరికపు హంగులు మృష్టాన్నములు కావు, తన పాలనలో ప్రజలు సుఖసంతోషాలతో తృప్తిగా వున్నారా అనేది ముఖ్యం. వారి తృప్తియే ప్రభువునకు పుష్టి.
అందుకే విశ్వేశుడైన శివుడు - "మృష్టాన్నములు మాని పాలితుల భక్తి ప్రపత్తులను బిచ్చంగా గొని పుష్ఠిని చేకూర్చుకోవా”లని ప్రభువులకు సందేశం అందజేస్తాడు భిక్షాన్నం తినడం ద్వారా
***************

కామెంట్‌లు లేవు: