23, ఆగస్టు 2020, ఆదివారం

చంద్రుడిని ఎందుకు చూడకూడదు

*గణేష చతుర్థి రోజున చంద్రుడిని ఎందుకు చూడకూడదు? పొరాపాటున చూస్తే ఏం చేయాలి?*_
వినాయ‌కుడు... విఘ్నేశ్వ‌రుడు... గ‌ణాధిప‌తి... గ‌ణ‌నాథుడు... ఇలా ఎన్నో పేర్లు గ‌ణేషుడికి ఉన్నాయి. ఏ పూజ చేసినా అందులో ముందుగా ప్రార్థించేది గ‌ణ‌ప‌తినే. ఎందుకంటే ఎలాంటి విఘ్నాలు (ఆటంకాలు) రాకుండా కాపాడుతాడ‌ని గ‌ణేషుడికి ముందుగా పూజ‌లు చేస్తారు. ఇక ఏటా వినాయ‌క చ‌వితి వ‌చ్చిందంటే చాలు పెద్ద ఎత్తున ఉత్స‌వాలు చేప‌డ‌తారు.
న‌వ‌రాత్రుల అనంత‌రం గ‌ణేషున్ని ఘ‌నంగా సాగ‌నంపుతూ నిమ‌జ్జ‌నం చేస్తారు. అయితే వినాయ‌క చ‌వితి రోజున గ‌ణేషుడికి పూజ చేయడంతోపాటు మ‌నం చేయ‌కూడ‌ని ప‌ని కూడా ఇంకోటి ఉంటుంది. అదేనండీ, చంద్రున్ని చూడ‌డం. చాలా మంది పండితులు, పెద్ద‌లు వినాయ‌క చ‌వితి రోజు చంద్రున్ని చూడ‌వ‌ద్ద‌ని, అలా చూస్తే నీలాప‌నింద‌ల పాలు కావ‌ల్సి వ‌స్తుంద‌ని చెబుతారు. అయితే దాని వెనుక ఉన్న అస‌లు క‌థేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

స‌ర్వ గ‌ణాల‌కు అధిప‌తిగా ఎవ‌రు ఉండాల‌నే విష‌యంపై దేవ‌త‌లంద‌రూ శివున్ని కోర‌గా, అప్పుడు శివుడు వినాయ‌కుడు, కుమార స్వామిల‌లో ఎవ‌రో ఒక‌రు గ‌ణాధిప‌తిగా ఉంటార‌ని, అందుకోసం వారిద్ద‌రికీ పోటీ పెడ‌తాన‌ని చెబుతాడు. ఈ క్ర‌మంలో వారిద్ద‌రినీ పిలిచి శివుడు ఏం చేయ‌మ‌ని చెబుతాడంటే, ముల్లోకాల్లో ఉన్న అన్ని న‌దులు, పుణ్య‌క్షేత్రాల్లో ఎవ‌రైతే ముందుగా స్నానం ఆచ‌రించి త‌మ‌ను చేరుకుంటారో వారికే గ‌ణాధిప‌త్యం వ‌స్తుంద‌ని శివుడు చెబుతాడు.

అప్పుడు కుమార‌స్వామి వెంట‌నే త‌న నెమ‌లి వాహ‌నంపై ముల్లోకాల‌ను చుట్టి రావ‌డానికి బ‌య‌ల్దేర‌తాడు. ఈ క్ర‌మంలో గ‌ణేషుడు ఎక్క‌డికి వెళ్ల‌కుండా త‌న త‌ల్లిదండ్రులైన శివ‌పార్వ‌తుల‌కు న‌మ‌స్కారం చేస్తూ 3 సార్లు వారి చుట్టూ తిరుగుతాడు. అలా తిరిగే క్ర‌మంలో గ‌ణేషుడు ప్ర‌తి సారి కుమార‌స్వామికి పుణ్య‌క్షేత్రాల్లో క‌నిపిస్తూనే ఉంటాడు.

దీంతో త‌ల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్ర‌ద‌క్షిణ చేయ‌గానే గ‌ణేషుడు ముల్లోకాల‌ను చుట్టి వ‌చ్చినట్టు అవుతుంది. ఈ క్ర‌మంలో కుమార‌స్వామి కన్నా గ‌ణేషుడే మొద‌ట వ‌చ్చిన‌ట్టు అవుతుంది. అప్పుడు శివుడు సంతోషించి గ‌ణేషున్నే స‌ర్వ గ‌ణాల‌కు అధిప‌తిని చేస్తాడు. అప్పుడు జ‌రిగిన విందులో ఏర్పాటు చేసిన అన్ని వంటకాల‌ను గ‌ణేషుడు సుష్టుగా తింటాడు.
దీని వ‌ల్ల త‌ల్లిదండ్రుల ఆశీర్వ‌చ‌నాలను తీసుకునే క్ర‌మంలో వంగిన‌ప్పుడు అత‌నికి ఇబ్బందిగా ఉంటుంది. స‌రిగ్గా న‌మ‌స్కారం చేయ‌లేక‌పోతాడు. అప్పుడు చంద్రుడు గ‌ణేషున్ని చూసి న‌వ్వుతాడు. దీంతో పార్వ‌తి ఆగ్ర‌హం చెంది చంద్రుడికి శాపం పెడుతుంది. చంద్రున్ని చూసిన వారంద‌రూ నీలాప‌నింద‌ల‌కు గురి కావ‌ల్సి వ‌స్తుంద‌ని అంటుంది.

ఎవ‌రైతే బాధ్రపద శుద్ధ చవితి (వినాయ‌క చ‌వితి) నాడు చంద్రున్ని చూస్తారో వారు నింద‌ల పాలు అవుతారు అని శాపాన్ని మారుస్తుంది. అప్ప‌టి నుంచి చ‌వితి రోజు చంద్రున్ని ఎవ‌రూ చూడ‌కూడ‌ద‌ని చెబుతూ వ‌స్తున్నారు.
అయితే ద్వాప‌ర యుగంలో శ్రీ‌కృష్ణుడు చ‌వితి నాడు ఆవు పాలు పిండుతుండ‌గా అందులో చంద్రుని ప్ర‌తిబింబం క‌నిపిస్తుంది. దీంతో తాను నింద‌ల పాలు కావల్సి వ‌స్తుంద‌ని కృష్ణుడు చింతిస్తుంటాడు.

అనుకున్న‌ట్టుగానే శ్యమంతకమణి అనే మ‌ణిని అప‌హ‌రించిన‌ట్టు అత‌ని మీద నింద ప‌డుతుంది. దీంతో ఎలాగో క‌ష్ట‌ప‌డి శ్రీ‌కృష్ణుడు ఆ మ‌ణిని తెచ్చి ఇచ్చి త‌న నింద‌ను పోగొట్టుకుంటాడు. అయితే ఆ సంఘ‌ట‌న జ‌రిగిన త‌రువాత శ్రీకృష్ణుడు ఇలా చెబుతాడు. ఎవరైతే వినాయ‌క చ‌వితి రోజు పూజ‌లు చేసి గ‌ణేషుడి ఆశీర్వ‌చ‌నాలు పొందుతారో వారికి చంద్రున్ని చూసినా ఏమీ అవ‌ద‌ని అంటాడు. అప్ప‌టి నుంచి చాలా మంది చ‌వితి రోజు వినాయ‌కున్ని క‌చ్చితంగా పూజించ‌డం మొద‌లు పెట్టారు. మరో పరిహారం కూడా ఉంది. చంద్ర దర్శనం చేసిన వారు దోషం పోవడానికి ఈ శ్లోకం చదివినా మంచిదని అంటున్నారు.

సింహ: ప్రసేన మవధీత్ సింహొజాంబవతా హత:
సుకుమారక మారోదీ: తవ హ్యోషస్స:మంతక:

యేషా బాలక మరోదీ:
తవ హియేషా శమతక:
**************

కామెంట్‌లు లేవు: