24, ఆగస్టు 2020, సోమవారం

బ్రహ్మచారులకు సద్యశ్శౌచం

బ్రహ్మచారులకు సద్యశ్శౌచం :-* బ్రహ్మచారి అంటే ఎవరు? ఈ ధర్మశాస్త్రమందు బ్రహ్మచారిని గూర్చి *ఆదిష్టి* పదం వాడబడింది. అదిష్టి అంటే బ్రహ్మచారిగా వ్రతనియమాలను పాటిస్తూ ఆచార్యులు ఉపనయన మందుఉపదేశించిన *బ్రహ్మచార్యసి, ఆపోశాన, కర్మకురు, మాదివాస్వాప్సీః, భిక్షాచర్యంచర*
ఇట్లాంటి నియమాలనాచరిస్తూ, గురుకులవాసం చేసేవాడు బ్రహ్మచారి. ఇట్లాంటి వానికి ఆశౌచమందు సద్యశ్శౌచం అంటే స్నానంతో శుద్ధి. ఇట్టివాడు
ఆచార్యం స్వముపాధ్యాయం పితరం మాతరం గురుం!
నిర్భృత్యతువ్రతీప్రేతం సమ్రతేన నయుజ్యతే!
మాతామహ మాతులం తత్పత్నా చానపత్యకే!
ప్రతీ సంస్కురుతేయస్తు ప్రతలోపో జాతస్యహి”!!

ఆచార్యులకు, తనకు విద్యాదాతయైన ఉపాధ్యాయునకు, తల్లిదండ్రి గురువు వీరికి ప్రేతకార్యం చేస్తే వ్రతభంగం లేదు. తల్లి యొక్క తండ్రికి, మేనమామకు ఆయన భార్యకు సంతానం లేనిచో వారికిన్ని దహనం సంస్కారం చేస్తే వ్రత లోపం రాదు. పైన తెల్పిన వారందరికీ దహన సంస్కారాలు చేసిన తన యింట భోజనం చేయకూడదు. ఎందుకంటే మరణం వల్ల వ్యక్తులకే కాదు ఆ యింటికిన్ని ఆశౌచముంటుంది కనుక భోజనం కూడదు. *పతతియత్తస్మాత్ ప్రేతాన్నం నాత్ర భక్షయేత్* ప్రేతాన్నం తింటే తాను పతితుడౌతాడు. *అన్యత్రభోజనం కుర్యాత్ న చతైస్సహ సంవిశేత్* వేరే ఇంట్లో భుజించవచ్చు. కాని ఆశౌచం కలవారితో కలిసి నిద్రించకూడదు. కలిసి కూడా తిరుగొద్దు

*ఏకాహమశుచిర్ భూత్వా ద్వితీయేహాని శుద్ధ్యతి* ఆ ఒక్కరోజు అశుచిగ ఉండి రెండవరోజు శుద్ధి పొందుతాడు. ఇదంతా మను, భృగు, యాజ్ఞవల్క్యుడు తెల్పిన విషయాలు. ఇక తన తండ్రికి- *బ్రహ్మచారీ యదాకుర్యాత్ పిండ నిర్వాపణం పితుః | తావత్కాలంతదాశౌచం తతస్సాత్వావిశుద్ధ్యతి* తల్లికిగాని తండ్రికిగాని ఉదకదాన పిండప్రదానాదులు చేసినపుడే ఆశౌచము. తర్వాత స్నానం చేస్తే శుద్ధుడౌతాడు

*పాలివారు మరణిస్తే ఆశౌచవిధానమెట్టిది* అనగా తన బ్రహ్మచర్య వ్రతం నియమంలో ఉంటే బ్రహ్మచర్య వ్రతం పూర్తయిన తర్వాత సమావర్తనం అనగా స్నాతకం చేసుకున్న తర్వాత సపిండులకు ఉదకదానాదులిచ్చి త్రిరాత్రాశౌచం పట్టాలి.
*శతకం టీక*:- కృచ్చ, చాంద్రాయణ, వేదపారాయణ, బ్రహ్మచర్య, వివాహ, యజ్ఞాది సమాప్తి పర్యదా ఆశౌచకాలమధ్యేస్యాత్ తదాశేషమాశౌచ మనుష్టేయం | యస్యాశౌచకాలాదూర్ధ్వ పరిసమాప్తి స్యాత్ తదా మరణవిషయే అతిక్రాంతమాశౌచమనుష్ఠేయం,!!

మను:-“అతి క్రాంతే దశా హేచత్రిరాత్ర మశుచిర్భవేత్ | అతోప్రతినాంజ్ఞాతి
మరణే సతి సంవత్సరాదూర్ంవ్రత సమాప్తిశ్చేత్ సద్యశాచమేతి"

మనుః!!

కృచ్ఛ చాంద్రాయణ వ్రతం నున్నవారు, వేదపారాయణ, బ్రహ్మచర్య వ్రతంలో నున్నవారు, వివాహవిధిలో నున్నవారు, యజ్ఞయాగాది క్రతువుల్లో నున్నవారు ఆశౌచమధ్యలో ఉన్నట్లైతే ఇది పూర్తియైన తర్వాత మిగిలిన రోజులాశౌచము పట్టవలెను. ఒకవేళ ఆశౌచము పూర్తి (10 రోజులు దాటినచో) అయ్యేవరకు దీక్ష ముగియనిచో అతిక్రాంతాశౌచము పట్టవలెను. అనగా మూడురోజుల ఆశౌచము. పైన నాల్గవరోజు శుద్ధియగుదురు. దీక్ష పరిసమాప్తి
అయ్యేవరకు పాలివాడు మరణించి సంవత్సరము దాటినచో అప్పుడు దీక్ష పూర్తి అయినట్లైతే సద్యశ్శౌచమే! స్నానంతో శుద్ధి.
*సంకలనం:-గొడవర్తి సంపత్కుమార్ అప్పలాచార్యులు*
**********************

కామెంట్‌లు లేవు: