....
ఆ రాత్రి రామచంద్రుడు సీతతో కలసి హోమముచేసి మిగిలిని హవిస్సు భక్షించి నారాయణుని ధ్యానిస్తూ అత్యంత మనోహరంగా అలంకరించిన మహావిష్ణువు ఆలయప్రాంగణంలో పరచిన దర్భలమీద సీతతో కూడ శయనించాడు!
.
నాల్గవ ఝాముననే మేల్కొని మరల యదావిధిగా చేయవలసిన కార్యక్రమములన్నీ చేసి ప్రశాంతచిత్తుడైవున్నాడు.
.
నగరం అంతా పౌరులు అలంకరించి శ్రీరామభిషేక ఘడియలకోసం ఎదురు చూస్తున్నారు. వీధులలో జనఘోష సముద్రఘోషను తలపిస్తున్నది..
.
పుట్టినప్పటినుండీ కైక తో కలిసిపెరిగిన దాసి ఒకతి ! ఆవిడ పేరు మంథర ఆ రోజు రాజప్రసాదము పైకి ఎక్కింది! మంథరకు కోలాహలంగా ఉండి చక్కగా అలంకరింపబడిన రాజవీధులు కనపడ్డాయి! జనులందరూ తలస్నానం చేసి కొత్తబట్టలు ధరించి ఉన్నారు .ఎటు చూసిన మంగళ వాయిద్యాల హోరు ,వేదఘోష, మంత్రపఠనం ,అశ్వములజోరు,గజములహుషారు ఎవరి ముఖంలో చూసినా సంతోషం ! కనపడ్డాయి !
.
అటుకళ్లు తిప్పిచూసింది కౌసల్యమందిరం ముందు జనులు బారులు తీరి ఉన్నారు అక్కడ సమృద్ధిగా దానధర్మాలు జరుగుతున్నాయి! .
.
తన ప్రక్కనే వున్న మరొక దాదిని అడిగింది ఏమిటి నగరంలో ఈ రోజు పండుగవాతావరణం ఉన్నదేమిటి? అని .
.
అప్పుడు ఆ దాది ఇలా చెప్పింది ," నేడు రామునికి పట్టాభిషేకం" .
.
ఆమాటలు ఒక్కసారి మంథరచెవిన పడగానే భృకుటి ముడివడింది కళ్ళలో ఎర్రజీరలువచ్చి రుసరుసలాడుతూ విసవిసా మెట్లుదిగి ,అప్పటికింకా నిద్రలేవని కైకను తట్టి లేపింది!
.
పైపైకి ఆపదలు వచ్చి పడుతున్నా ఇంత తెలివితక్కువగా ఇంకా నిద్రపోతున్నావా ! మూఢురాలా లే ! నిద్దురలే !
.
ఉత్తిష్ఠ మూఢే కిం శేషే భయం త్వామభివర్తతే!..
.
భర్తప్రేమకు నేనే ఎక్కువపాత్రురాలినని మురిసిపోతుంటావుగా ఇప్పుడేం జరిగిందో చూడు!
.
నీ సౌభాగ్యం మండి నట్లే ఉంది ! అది ఎండాకాలంలో ఎండిపోయిన నది!.
.
ఏమయ్యిందే నీకు ఇవ్వాళ? ఇట్లా గావుకేకలు పెడుతున్నావు?
అని అడిగింది కైక..
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
*****************
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి