24, ఆగస్టు 2020, సోమవారం

*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*

*అష్టమ స్కంధము - పదునారవ అధ్యాయము*

*పయోవ్రతమును ఆచరింపుమని కశ్యపమహర్షి అదితికి ఉపదేశించుట*

*ఓం నమో భగవతే వాసుదేవాయ*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*16.41 (నలుబది ఒకటవ శ్లోకము)*

*నివేదితం తద్భక్తాయ దద్యాద్భుంజీత వా స్వయమ్|*

*దత్త్వాఽఽచమనమర్చిత్వా తాంబూలం చ నివేదయేత్॥6936॥*

ఆ నైవేద్య ప్రసాదమును భగవద్భక్తులకు పంచవలెను. లేదా, స్వయముగా భుజింపవలెను. పిమ్మట శ్రీహరికి ఆచమనమిచ్చి పూజించి తాంబూలమును సమర్పింపవలెను.

*16.42 (నలుబది రెండవ శ్లోకము)*

*థజపేదష్టోత్తరశతం స్తువీత స్తుతిభిః ప్రభుమ్|*

*కృత్వా ప్రదక్షిణం భూమౌ ప్రణమేద్దండవన్ముదా॥6937॥*

అనంతరము ద్వాదశాక్షరీ మంత్రమును నూట ఎనిమిదిసార్లు జపింపవలెను. పిదప స్తోత్రముల ద్వారా భగవంతుని స్తుతింపవలెను. ప్రదక్షిణపూర్వకముగా భక్తితో సాష్టాంగ నమస్కారములను చేయవలెను.

*16.43 (నలుబది మూడవ శ్లోకము)*

*కృత్వా శిరసి తచ్ఛేషాం దేవముద్వాసయేత్తతః|*

*ద్వ్యవరాన్ భోజయేద్విప్రాన్ పాయసేన యథోచితమ్॥6938॥*

నిర్మాల్యమును శిరస్సున ధరించిన పిమ్మట, ఆ స్వామికి ఉద్వాసన చెప్పవలెను. కనీసము ఇద్దరు బ్రాహ్మణులకు  యథోచితముగా పాయసముతో భోజనము చేయింపవలెను.

*16.44 (నలుబదినాలుగవ శ్లోకము)*

*భుంజీత తైరనుజ్ఞాతః శేషం సేష్టః సభాజితైః|*

*బ్రహ్మచార్యథ తద్రాత్ర్యాం శ్వోభూతే ప్రథమేఽహని॥6939॥*

*16.45 (నలుబది ఐదవ శ్లోకము)*

*స్నాతః శుచిర్యథోక్తేన విధినా సుసమాహితః|*

*పయసా స్నాపయిత్వార్చేద్యావద్వ్రతసమాపనమ్॥6940॥*

ఆ బ్రాహ్మణుని దక్షిణ మొదలగు వాటితో సత్కరింపవలెను. పిదప, వారి యాజ్ఞతో తన బంధుమిత్రులతో గూడి మిగిలిన ప్రసాదమును గ్రహింపవలెను. ఆ రాత్రి బ్రహ్మచర్యమును పాటించి, మరుసటి దినమున ప్రాతఃకాలముననే స్నానాదులను ఆచరించి, శుచియై పూర్వోక్త విధానముతో ఏకాగ్ర చిత్తముతో భగవంతుని ఆరాధింపవలెను. ఈ విధముగా వ్రతము ముగియువరకు పాలతో భగవంతుని అభిషేకించుచు పూజింపవలెను.

*16.46 (నలుబది ఆరవ శ్లోకము)*

*పయోభక్షో వ్రతమిదం చరేద్విష్ణ్వర్చనాదృతః|*

*పూర్వవజ్జుహుయాదగ్నిం బ్రాహ్మణాంశ్చాపి భోజయేత్॥6941॥*

సాధకుడు ఈ విధముగా భగవంతుని ఆదరముగా సేవించి, కేవలము పాలను మాత్రమే ఆరగించుచు ఈ పయోవ్రతమును ఆచరింపవలెను. ప్రతిదినము హోమమును, బ్రాహ్మణ భోజనమును జరుపవలెను.

*16.47 (నలుబది ఏడవ శ్లోకము)*

*ఏవం త్వహరహః కుర్యాద్ద్వాదశాహం పయోవ్రతః|*

*హరేరారాధనం హోమమర్హణం ద్విజతర్పణమ్॥6942॥*

ఇట్లు పన్నెండు దినములు పయోవ్రతమును ఆచరించుచు ప్రతిదినము భగవదారాధన, హోమము, పూజ చేయవలెను. అట్లే బ్రాహ్మలను భుజింప జేయవలెను.

*16.48 (నలుబది ఎనిమిదవ శ్లోకము)*

*ప్రతిపద్దినమారభ్య యావచ్ఛుక్లత్రయోదశీ|*

*బ్రహ్మచర్యమధఃస్వప్నం స్నానం త్రిషవణం చరేత్॥6943॥*

ఫాల్గుణ శుద్ధ పాడ్యమి మొదలుకొని త్రయోదశివరకు బ్రహ్మచర్యవ్రతమును పాటింపవలెను. నేలపై పరుండవలెను. ప్రతిదినము మూడుసార్లు స్నానము చేయుచుండవలెను.

*16.49 (నలుబది తొమ్మిదవ శ్లోకము)*

*వర్జయేదసదాలాపం భోగానుచ్చావచాంస్తథా|*

*అహింస్రః సర్వభూతానాం వాసుదేవపరాయణః॥6944॥*

అసత్యము పలుకరాదు. పాపపు పలుకులు మాట్లాడరాదు. పాపులతో మాట్లాడరాదు. అన్ని విధములైన భోగములను వర్జింపవలెను. ఏ ప్రాణికిని ఎట్టి అపకారమును చేయరాదు. భగవదారాధనయందే నిరతుడై యుండవలెను.

*16.50 (ఏబదియవ శ్లోకము)*

*త్రయోదశ్యామథో విష్ణోః స్నపనం పంచకైర్విభోః|*

*కారయేచ్ఛాస్త్రదృష్టేన విధినా విధికోవిదైః॥6945॥*

త్రయోదశినాడు శాస్త్రవిధులను తెలిసిన వారి ద్వారా శ్రీమహావిష్ణువునకు శాస్త్రోక్తముగా పంచామృతములతో (పాలు, పెరుగు, నేయి, శర్కర, తేనె) అభిషేకము చేయింపవలెను.

(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి అష్టమస్కంధములోని పదునారవ అధ్యాయము ఇంకను కొనసాగును)

🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుఫ🙏🙏

*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319
******************

కామెంట్‌లు లేవు: