21, డిసెంబర్ 2023, గురువారం

శ్రీ దేవీ భాగవతం

 శ్రీ దేవీ భాగవతం


.శ్రీగణేశాయనమః.శ్రీసరస్వత్యైనమః శ్రీగురుదత్తాత్రేయపరబ్రహ్మణేనమః

శ్లో)వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయవిష్ణవే|

నమోవైబ్రహ్మనిధయే వాసిష్ఠాయనమోనమః||

శ్లో)నారాయణంనమస్కృత్య నరంచైవ నరోత్తమం|

దేవీంసరస్వతీం వ్యాసం తతోజయముదీరయేత్||


శ్లో)సృష్టౌ యా సర్గరూపా జగదవనవిధౌ పాలినీ యా చ రౌద్రీ

సంహారే చాపి యస్యా జగదిదమఖిలం క్రీడనం యా పరాఖ్యా |

పశ్యంతీ మధ్యమాథో తదను భగవతీ వైఖరీవర్ణరూపా

సాస్మద్వాచం ప్రసన్నా విధి హరి గిరిశారాధితాలంకరోతు||


శ్లో)కాత్యాయనిమహామాయే భవాని భువనేశ్వరి |

సంసారసాగరోమగ్నం మాముద్ధరకృపామయే||

బ్రహ్మ విష్ణు శివారాధ్యే ప్రసీదజగదంబికే|

మనోఽభిలషితందేవివరందేహినమోఽస్తుతే||


ఇటువంటి

మహాపాపం నీ రాజ్యంలో, నీ సమక్షంలో నీ కోసం జరగడమా దేశంలో జరిగే పాపాలన్నింటా

ఆరవవంతు రాజుకు సంక్రమిస్తుంది తెలుసా? అందుకనే రాజుగారు పనిబూని తన రాజ్యంలో పాపాలు

జరక్కుండా చూసుకోవాలి అనడం. పుత్ర విక్రయాన్ని నువ్వు నిషేధించవలసింది పోయి నీకోసమే

ప్రోత్సహిస్తావా ? సూర్యవంశంలో పుట్టావు. త్రిశంకుడికి తనయుడివి. ఇది నీకు తగునా ? ఆర్యుడిపై

ఆవార్యుడిగా ప్రవర్తిస్తావా ?

-

దేశమధ్యే చ యః కశ్చిత్పాపకర్మ సమాచరేత్ |

షష్టాంశస్తస్య పాపస్య రాజా భుంక్తేవ సంశయః ॥


విషేధనీయో రాజ్ఞాసా పాపం కర్తుం సముద్యతః ।

న నిషిద్ధస్త్యయా కస్మాత్ పుత్రం విక్రేతుముద్యతః

.

సూర్యవంశే సముత్పన్నః త్రిశంకుతనయః శుభః |

ఆర్యస్య్తమనార్యవత్కర్మ కర్తుమిచ్చసి పార్థివ||


మహారాజా ! నేను రావడం మంచిదే అయ్యింది. నామాట విను. ఈ విప్రనందనుణ్ణి విడిచి పెట్టించు.

నీ ఆరోగ్యం కుదుటపరిచే పూచీ నాది. నీ తండ్రి చండాలత్వం తొలగించి సశరీరంగా స్వర్గానికి పంపించాను.

గుర్తుందా ? దానికి నువ్వెంతో పొంగిపోయావు. ఆ సంతోషానికి ఫలంగానైనా నా మాట విను. చూడు, ఈ

పసిబాలుడు ఎలా విలపిస్తున్నాడో. ప్రాణభయంతో వణికిపోతున్నాడు. వెంటనే విడిచిపెట్టించు. ఇది నా

అభ్యర్థన. నా యాచన. కాదన్నావనుకో అదొక పెద్దదోషమవుతుంది. యజ్ఞ సమయంలో (వేదవేత్తలు)

ఎవరు ఏది అడిగినా కాదనకుండా ఇవ్వాలి. లేకపోతే మహాపాపమే. సందేహం లేదు.


ప్రార్థితం సర్వధా దేయం యజ్ఞేఽస్మిన్ నృపసత్తమ |

అన్యథా పాపమేవ స్యాత్ తవ రాజన్నసంశయః

కామెంట్‌లు లేవు: