4, సెప్టెంబర్ 2023, సోమవారం

*🌹సౌందర్యలహరి🌹* *శ్లోకం - 13*

 🌹🌹🌹🌹🌷🌷🌷🌹🌹🌹🌹

🌹🌹🍃🍃🌹🌹🍃🍃🌹🌹

          *🌹సౌందర్యలహరి🌹*


*శ్లోకం - 13*

🌷🪷🌷🪷🌷🪷🌷🪷🌷🪷


*నరం వర్షీయాంసం నయనవిరసం నర్మసు జడం*

*తవాపాంగాలోకే పతిత మనుధావన్తి శతశః |*

*గలద్వేణీబంధాః కుచకలశ విస్రస్త సిచయాః*

*హఠత్తృట్యత్ కాంచో విగళిత దుకూలా యువతయః ||*


అమ్మా నీ కరుణా కటాక్ష వీక్షణాలు పడితే ఎంత పనికిమాలినవాడైనా సమర్ధుడుగా మారతాడని ఈ శ్లోకం అర్థం. ఇక్కడ శంకరులు స్థిరః, స్థాణుః అని నామాలున్న జడుడైన(ఆత్మారాముడైన) శివుని పై ఆరోపించి చమత్కారంగా చెప్పారు ఈ అద్భుతమైన శ్లోకం.


నరం వర్షీయాంసం = వయస్సుచేత వృద్ధుడు (అనాదియైనవాడు)


నయనవిరసం = కంటి చూపుకు కూడా బాగాలేనివాడు (విరూపాక్షుడు కదా!)


నర్మసు జడం = సరసానికి, రసజ్ఞతకు జడుడు.ఇలాంటి వాడిని అమ్మవారు,


మనుధావంతి శతశః = తన కరుణాపూరితమైన చూపులు ప్రసరింపచేయగానే,ఆయన ఎంత ఆకర్షణీయంగా అవుతాడంటే,దేవతా స్త్రీలు ఆయనను చూసి,


గలద్వేణీబంధాః = జుట్టు ముడులు విడిపోతూ ఉండగా


యోగపరంగా రుద్రగ్రంథి విభేదిని, భ్రూమధ్యంలోని ఆజ్ఞాచక్రము నుండి సహస్రారపద్మమునకు చేర్చునది.కేశపాశములు ఉండే స్థానము.


కుచకలశ విస్రస్త సిచయాః = వక్షములపై కల వస్త్రములు ముడులు తొలగిపోయి


విష్ణుగ్రంధి విభేదిని, హృదయస్థానములో కల అనాహతము నుండి విశుద్ధిచక్రమునకు చేర్చునది.


హఠాత్తృట్యత్ కాంచో = నడుముకు చుట్టిన  వస్త్రము ముడి ఊడిపోయి


బ్రహ్మగ్రంధి విభేదిని, మూలాధారము నుండి నాభి వెనక కల మణిపూరమునకు చేర్చునది.ఈ గ్రంధులు విడిపోగానే సాధకుడు జీవన్ముక్తుడవుతాడు.


విగళిత దుకూలా = వస్త్రములు ఊడిపోయి 

కృష్ణుని వేణుగానం విన్న గోపికలవలె తనువులు మరచి ఆకర్షితులవుతున్నారు అని భావం.


అమ్మవారి చూపు పడగానే ప్రపంచంలోని శక్తులన్నీ ఆమెకి దాసానుదాసులవుతారని గ్రహించాలి.


            🙏🏻 *శ్రీమాత్రే నమః*🙏🏻


*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*

🌺🌹🌺🌹🌺🌹🌺🌹🌺🌹

కామెంట్‌లు లేవు: