. *🌹ఓం శ్రీ గురుభ్యోనమః🌹*
. *శ్రీరస్తు - శుభమస్తు - అవిఘ్నమస్తు*
*సోమవారం, సెప్టెంబర్ 04, 2023*
*శ్రీ శాలివాహన శకం: 1945*
*శ్రీ శోభకృత్ నామ సంవత్సరం*
*దక్షిణాయనం - వర్ష ఋతువు*
*నిజ శ్రావణ మాసం - బహుళ పక్షం*
*తిధి* : *పంచమి రా9.54* వరకు
. *🌹రాశి ఫలాలు🌹*
*మేషం*
పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. గృహమున సొంత ఆలోచనలు అమలు చేస్తారు. దైవదర్శనం చేసుకుంటారు వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.
---------------------------------------
*వృషభం*
బంధువులతో అకారణ మాట పట్టింపులు ఉంటాయి. విలువైన పత్రాల విషయంలో జాగ్రత్త వహించాలి. కుటుంబ పెద్దల ఆరోగ్యసమస్యలు చికాకు పరుస్తాయి. ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.
---------------------------------------
*మిధునం*
బంధుమిత్రులతో శుభకార్యాలలో పాల్గొంటారు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలు చర్చిస్తారు. సమాజంలో పరపతి పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.
---------------------------------------
*కర్కాటకం*
సమాజంలో ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కీలక వ్యవహారాలలో పెద్దలు సలహాలు తీసుకుని ముందుకు సాగుతారు. ప్రత్యర్థులు మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. వ్యాపారస్తులకు ఆశించిన లాభాలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుకుంటారు.
---------------------------------------
*సింహం*
ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి. ఆరోగ్య విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. ముఖ్యమైన పనులలో అవరోధాలు తప్పవు. కుటుంబసభ్యులతో ఊహించని వివాదాలు నెలకొంటాయి. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగాలు పని ఒత్తిడి అధికమవుతుంది.
---------------------------------------
*కన్య*
ఆర్థిక వ్యవహారాలు సామాన్యంగా సాగుతాయి. బంధువులతో మాటపట్టింపులు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన శిరో బాధలు తప్పవు. వ్యాపారాలు మందగిస్తాయి. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో అధికారుల నుండి ఒత్తిడి పెరుగుతుంది. సంతానం విద్యా విషయాలలో దృష్టి సారించడం మంచిది.
---------------------------------------
*తుల*
సన్నిహితుల నుండి సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారస్థులకు నూతన పెట్టుబడులు అందుకుంటారు. సోదరుల నుంచి శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాదిస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు. విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.
---------------------------------------
*వృశ్చికం*
భూ సంబంధిత క్రయవిక్రయాలలో ఆశించిన లాభాలు పొందుతారు. బంధు మిత్రుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి. ఉద్యోగాలలో అధికారులతో చర్చలు అనుకూలిస్తాయి. మిత్రులతో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించినట్టు అవకాశాలు లభిస్తాయి.
---------------------------------------
*ధనస్సు*
స్థిరస్తి ఒప్పందాలు వాయిదా పడతాయి. చేపట్టిన పనులలో అవాంతరాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. సన్నిహితుల మీ మాటతో విబేదిస్తారు. ఉద్యోగాలలో ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని రంగాల వారికి సమస్యలు తప్పవు.
---------------------------------------
*మకరం*
చేపట్టిన పనులలో కష్టానికి తగ్గ ఫలితం కనిపించదు. బంధు మిత్రులతో మాటపట్టింపులు కలుగుతాయి. ఆరోగ్యసమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేస్తారు. ఉద్యోగాలలో గందరగోళ పరిస్థితులుంటాయి. నిరుద్యోగుల యత్నాలు నిరాశ కలిగిస్తాయి.
---------------------------------------
*కుంభం*
భూవివాదాల పరిష్కారమౌతాయి. వ్యాపారమునకు నూతన పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో నూతనోత్సాహంకాలు అందుతాయి. కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. చిన్ననాటి మిత్రులతో దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
---------------------------------------
*మీనం*
చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. ఇంటా బయట బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. విద్యార్థుల విదేశీ యత్నాలు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో వివాదాలు కలుగుతాయి. వ్యాపారమున భాగస్థుల తో వివాదాలు కలుగుతాయి. ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
*సేకరణ:- శ్రీ కె వి రమణ మూర్తిగారి వాట్సాప్ పోస్ట్.*
🎄🌲🪻🎄🌲🪻🎄🌲🪻🎄
👉 *అహింసా పరమో ధర్మః - ధర్మ హింసా తథైవ చ !!*
👉 *ధర్మో రక్షతి రక్షితః - వృక్షో రక్షతి రక్షితః*
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
*ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు,*🙏🏻
*లోకాసమస్తా సుఖినోభవంతు,*🙏🏻
*సర్వేజనాః సుఖినోభవంతు,*🙏🏻
🐄 *గోమాత రక్షణ వేదమాత పోషణ మనందరి బాధ్యత*🙏🏻
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి