4, సెప్టెంబర్ 2023, సోమవారం

పో త న కవి తా వై భ వం!!


పో త న కవి తా వై భ వం!!


*రచన:-శ్రీ జంధ్యాల పాపయ్యశాస్త్రి గారు:--*


ఎండిన మ్రోడులే కిసలయించెనొ! యేకశిలాపురమ్ములో

బండలు పుల్కరించెనొ ! అపార ముదమ్మున తెల్గుతల్లికిన్‌

గుండెలు పొంగిపోయి కనుగొల్కులు నిండెనొ ! 

పచ్చి పైరులే

పండెనొ ! 

జాలువారిన భవత్‌ కవితామృత భక్తిచారలన్‌ !


 భీష్మునిపైకి కుప్పించి లంఘించు గోపాల కృష్ణుని కుండలాల కాంతి

కరిరాజు మొరవెట్ట పరువెత్తు కరివేల్పు

ముడివీడి మూపు పై పడిన జుట్టు

సమరమ్ము గావించు సత్య కన్నుల నుండి

వెడలు ప్రేమ క్రోధ వీక్షణములు

కొసరి చల్దులు మెక్కు గొల్ల పిల్లల వ్రేళ్ళ సందు మాగాయ పచ్చడి పసందు


ఎటుల కనుగొంటివయ్య ! నీ కెవరు చెప్పి

 రయ్య ! యే రాత్రి కలగంటివయ్య ! రంగు

కుంచెతో దిద్ది తీర్చి  చిత్రించినావు !!

సహజ పాండితి కిది నిదర్శనమటయ్య !!


ముద్దులుగార- భాగవతమున్‌ రచియించుచు, పంచదారలో

నద్దితివేమొ గంటము 

మహా కవి శేఖర ! మధ్య మధ్య నట్లద్దక వట్టి గంటమున నట్టిట్టు గీచిన, తాటియాకులో

పద్దెములందు - ఈ మధుర భావము లెచ్చటనుండి వచ్చురా!


*సేకరణ: శ్రీ చొప్పకట్ల సత్యనారాయణ గారి వాట్సాప్ పోస్ట్.* 

🙏🙏🙏🌷🌷👏👏👏👏

కామెంట్‌లు లేవు: