🕉 మన గుడి : నెం 168
⚜ ఛత్తీస్‌గఢ్ : దంతేవాడ
⚜ శ్రీ దంతేశ్వరి ఆలయం
💠 దేవి పురాణం ప్రకారం ఈ ఆలయం భారత ఉపఖండంలోని 52 శక్తి పీఠాలలో (స్త్రీ శక్తి పీఠాలు) ఒకటిగా పరిగణించబడుతుంది.
ఈ ఆలయం దంతేవాడ జిల్లాలో, ఛత్తీస్‌గఢ్‌లోని జగదల్‌పూర్ తహసీల్‌కు నైరుతి దిశలో 80 కిమీ దూరంలో, శంకిని మరియు ధంకిని అనే పవిత్ర నదుల సంగమం వద్ద ఉంది.
'దంతేవాడ' అనే పదం 'దంతేశ్వరి దేవి' పేరు నుండి వచ్చింది.
💠 కాకతీయుల కాలంలో దంతేశ్వరి దేవి నెలకొని యున్న ఈ ప్రాంతం కనుక ఈ గ్రామానికి దంతెవాడ అని పేరు వచ్చింది. సాంప్రదాయకంగా ఈ దేవత బస్తర్ జిల్లా వాసులకు కులదైవం.
💠 ఈ 600 సంవత్సరాల పురాతన ఆలయంలో మా దంతేశ్వరిని
శక్తి యొక్క అవతారంగా పూజించబడే స్థానిక దేవత అని నమ్ముతారు
💠 ఇక్కడ సతీదేవి దంతం పడిపోయిందని, అందుకే దంతేశ్వరి ఆలయంగా వాడుకలోకి వచ్చిందని నమ్ముతారు.
🔅 ఆలయ చరిత్ర 🔅
💠 ఒకప్పుడు దక్షుడు బృహస్పతియాగం చేసినప్పుడు అందరినీ ఆహ్వానించాడు గాని కూతురినీ, అల్లుడినీ పిలవలేదు, ఎందుకంటే దక్షుని కుమార్తె సతీదేవి (దాక్షాయణి) తండ్రి మాటకు విరుద్ధంగా శివుడిని పెళ్ళాడింది. పుట్టింటివారు ప్రత్యేకంగా పిలవాలేమిటి? అని సతీదేవి, శివుడు వారించినా వినకుండా, ప్రమధగణాలను వెంటబెట్టుకొని యాగానికివెళ్ళింది గాని, అక్కడ అవమానానికి గురయ్యింది.
💠 తన తండ్రి దక్షుడు తనకూ, తన భర్త అయిన పరమశివునికి చేసిన అవమానాన్ని , ముఖ్యంగా శివనింద సహించలేక ఆమె యోగాగ్నిలో
దూకి తనను తాను ఆహుతి చేసుకుంది..
💠 విషయం తెలిసి ఆగ్రహించిన శివుడు తన ప్రమధగణాలతో మరియు తన ఆవేశ అంశతో ఉద్భవించిన వీరభద్రుడి ద్వారా యాగశాలను ధ్వంసం చేశాడు.
కాని సతీ వియోగ దుఃఖం తీరని శివుడు ఆమె మృతశరీరాన్ని అంటిపెట్టుకొని ఉండి తన జగద్రక్షణాకార్యాన్ని మానివేశాడు.
💠 దేవతల ప్రార్థనలు మన్నించి విష్ణువు సుదర్శన చక్రంతో ఆ దేహాన్ని ఖండాలుగా చేసి, శివుడిని కర్తవ్యోన్ముఖుడిని చేశాడు.
సతీదేవి శరీరభాగాలు పడిన స్థలాలు శక్తి పీఠాలుగా భక్తులకు, ముఖ్యంగా తంత్రసాధకులకు ఆరాధనా స్థలాలు అయినాయి.
ప్రతి శక్తి పీఠంలోను దాక్షాయణీ మాత భైరవుని (శివుని) తోడుగా దర్శనమిస్తుంది.
సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక ఈ పీఠంలో దేవతను " దంతేశ్వరి" అని పిలుస్తారు.
💠 ఈ ఆలయం దైవిక శక్తులను కలిగి ఉందని నమ్ముతారు.
ప్రతి సంవత్సరం దసరా సందర్భంగా, చుట్టుపక్కల గ్రామాలు మరియు అడవి నుండి వేలాది మంది గిరిజనులు అమ్మవారిని దర్శించుకోవడానికి ఇక్కడకు తరలివస్తారు
💠 దంతెవాడ గ్రామం జగదల్‌పూర్ కు నైఋతి భాగంలో ఉంది. ఈ ప్రాంతంలో శంకిని, ఢాకిని అనే పుణ్య నదులు ఉన్నాయి. ఈ రెండు నదులు వివిధ రంగులతో ఉంటాయి.
600 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ దేవాలయం భారత దేశంలో ప్రాచీన చారిత్రిక స్థలాలలో ఒకటి.
💠 దంతేశ్వరి ఆలయం 13వ మరియు 14వ శతాబ్దానికి మధ్య ఉన్నట్లు నమ్ముతారు. బస్తర్ మొదటి కాకతీయ రాజు అన్నందేవ్ వరంగల్ (ఆంధ్రప్రదేశ్) నుండి ఇక్కడికి వచ్చాడని చెబుతారు. చివరి కాకతీయ రాజు ప్రతాపరుద్రు 2 సోదరుడైన అన్నమరాజు, తన మేనల్లుడును బస్టర్ రాష్ట్రానికి తదుపరి రాజుగా చేసి, దట్టమైన అడవికి, వంశదేవతతో 'దండకారణ్య'కి వెళ్లి, దంతెవాడలోని ఒక ఆలయంలో అమ్మవారిని ప్రతిష్టించాడు.
💠 ఈ ఆలయాన్ని దక్షిణ భారత ఆలయ నిర్మాణ శైలిలో నిర్మించారు.
అమ్మవారి విగ్రహం మెరిసే నల్లరాతితో చెక్కబడి ఉంటుంది.
ఈ ఆలయంలో నాలుగు భాగాలు ఉన్నాయి. గర్భ గృహం,
మహా మండపం,
ముఖ్య మండపం మరియు సభా మండపం.
గర్భ గృహం మరియు మహా మండపం పూర్తిగా రాతితో నిర్మించబడ్డాయి.
ఆలయ ప్రవేశ ద్వారం ముందు గరుడ స్థంభం ఉంది.
💠 బస్తర్ దసరా వేడుకలకు 500 వందల సంవత్సరాల చరిత్ర ఉంది.
మహారాజ పురుషోత్తం దేవ్ పరిపాలన కాలంలో ఈ వేడుకలు ప్రారంభమైనట్లు చెబుతారు.
కాకతీయులే ఇక్కడ దంతేశ్వరీ దేవి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు కూడా కథనాలు వాడుకలో ఉన్నాయి.
💠 ఇక్కడ జరిగే 90 రోజుల వేడుకల్లో ముఖ్యంగా చెప్పుకోవలసింది చివరి పదిరోజుల గురించి.
ఆ పది రోజుల కాలంలో రాజు అధికారికంగా ప్రధానపూజారిగా మారుతాడు.
రాజరికాన్ని వదిలి పూర్తిగా దంతేశ్వరీ పూజలోనే గడుపుతాడు. పూజల సమయంలో రాజు ఉపవాస దీక్షను పాటిస్తాడు.
💠 ప్రతీ సంవత్సరం దసరా సందర్భంగా వేలాది గిరిజనులు వివిధ గ్రామాలు, అడవుల నుండి ఇచ్చటికి చేరి ఈ దేవతా విగ్రహాన్ని బయటకు తీసి పట్టణం చుట్టూ ఊరేగిస్తారు.
ప్రస్తుతం "బస్తర్ దసరా" పండగ అనేది ప్రాముఖ్యత గల పర్యాటకుల ఆకర్షణగా నిలిచింది. నవరాత్రి సందర్భంగా జ్యోతికలశాన్ని వెలిగించడం అనాదిగా వస్తున్న ఆచారం.
💠 ఇది చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని జగదల్‌పూర్ తెహసీల్ నుండి 80 కి.మీ దూరంలో గల దంతెవాడ వద్ద ఉంది.
దంతెవాడ లో రైల్వే స్టేషన్ ఉన్నది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి