4, సెప్టెంబర్ 2023, సోమవారం

బసవ పురాణం ౼ 22 వ భాగము...!!

 🎻🌹🙏బసవ పురాణం ౼

22 వ భాగము...!!


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿


🌸అది విని కల్యాణ కటక ప్రజలందరూ గజ గజ వణికిపోయారు. మిగిలిన భక్తులంతా తలొక దిక్కుకూ చెదిరిపోయారు. బిజ్జలుని తర్వాత పట్టం కోసం వారసులు తమలో తాము కలహించుకొని నశించారు. 


🌿గుర్రాల తోకల వెంట నిప్పులు రాలాయి. ఏనుగులూ ఏనుగులూ కొట్టుకొని చచ్చాయి. ఎవరో శత్రువులొచ్చారని భ్రమపడి బిజ్జలుని మంత్రులూ సైన్యమూ తమలో తామే కొట్టుకొని మరణించారు. 


🌸ఈ విధంగా బసవని శాపం సత్యమయిందా అన్నట్లు కల్యాణ నగరం పాడుబడ్డదిబసవన్న ఈ వార్తలన్నీ విన్నాడు. కూడల సంగమేశ్వరానికి చేరుకున్నాడు. 


🌿అక్కడ తన గురువు సంగమ దేవుణ్ణి చూచాడు. తండ్రీ నీ యాజ్ఞతో భూమి మీదికి వచ్చి చేయవలసిన పనులన్నీ చేశాను. ఇంక నన్ను నీలోనే విశ్రాంతి తీసుకోని అని ప్రార్థించాడు. 


🌸సంగమ దేవుడు బసవణ్ణి దీవించి తన ప్రసాదం తినిపించి కొడుకును కౌగిలించుకున్నాడు. ఇరువురూ గర్భగుడిలోకి పోయారు. అంతే సంగమదేవుడూ కన్పడలేదు. 


🌿బసవన్నా కన్పడలేదు. ఇద్దరూ లింగంలో అదృశ్యమైనారు.ఆ క్షణమే దివి నుండి పూల వానలు కురిశాయి. భక్తులంతా జయజయధ్వానాలు చేశారు. గాలి నుండి సుడిగాలి పుట్టి మళ్లీ గాలి లోపలే కలిసిపోతుంది. 


🌸అలలు సముద్రంలో నుండే పుట్టి తిరిగి సముద్రంలోనే కలిసిపోతాయి. మెరుపుతీగ గగనంలో పుట్టి తిరిగి గగనంలోనే సమసిపోతుంది. 


🌸నీరు మేఘాలుగా మారి వర్షమై, వర్షం మళ్లీ సముద్రపు నీటిలోనే కలిసిపోతుంది. అలాగే బసవయ్యా భక్తజనోద్ధరణ కోసం నీవు సంగమేశ్వరుని నుండి వచ్చి తిరిగి ఆయనలోనే కలిశావు.


🌿పూవూ, తావీ విడదీయరానట్లు నీవూ, శివుడూ ఒక్కటే అని మాదిరాజయ్య, మాచిదేవుడు మొదలైన సమస్త భక్తులూ బసవణ్ణి స్తుతించారు. 


🌸బసవన్న ప్రసాదించిన సద్భక్తి భావంతో వారంతా తన్మయులై శివానంద సాగరంలో ఓలలాడారుప్రథమాధ్యాయము సమాప్తము


🌷ద్వితీయాధ్యాయము


🌿ముగ్ధ సంగయ్య కథకల్యాణ కటకంలో ముగ్ధ సంగయ్య అనే భక్తుడున్నాడు. అతడు ప్రపంచ జ్ఞానం లేని అమాయకుడు. 


🌸కొంత మంది వేశ్యల ఇంటికి పోతుంటే చూచి అది కూడా రాత్రి చేసే శివపూజలో ఒక భాగమనుకొని తానూ వేశ్య ఇంటికి పోతానని చెప్పాడు బసవన్నకు. 


🌿బసవన్న చిరునవ్వు నవ్వి ముగ్ధ సంగనికి సర్వాలంకారాలు చేయించి పంపాడు. సంగడు ఒక వేశ్య ఇంటికి పోయాడు. ఆమె సంగణ్ణి ఆదరంతో ఆహ్వానించి అర్ఘ్య పాద్యాదులిచ్చింది. 


🌸ముగ్ధ సంగడు జీవితంలో ఎన్నడూ వేశ్యలను చూచి ఎరుగడు. అందుకని ఆమెను చూచి ‘విభూతి పూసుకో శివ పూజ మొదలుపెడదాము’ అన్నాడు- ఆమె ఎవరో యోగినిగా భావించిమేము పచ్చ విభూతి పూస్తాము.


🌿ఇది మా సంప్రదాయం అని పసుపును చూపించిందామె నవ్విరుద్రాక్షల దండ ఏదీ? అని అడిగాడు ముగ్ధ సంగయ్య. మేము పాల సముద్రంలో పుట్టిన తెల్ల రుద్రాక్షలు వాడుతాము అని తన ముత్యాల దండ చూపింది.


🌸యోగీశ్వరీ! నీ జటాజూటమేదీ?’ అన్నాడు సంగయ్య.సగం శివ పూజా ప్రసాద కుసుమాల కోసం ఉంచి మిగిలిన సగమూ జడలుగా అల్లాను అని తన వాలుజడలను చూపింది 


🌿వేశ్య!కచ్చడం కట్టావా?అని అడిగాడు సంగయ్య.కచ్చడమేమిటి? ఇదుగో సర్వాంగ కచ్చడం అని తన చీరె చూపింది వేశ్య!మీసంప్రదాయమేమిటి? మీ గురువెవరు?’ అని ప్రశ్నించాడు సంగయ్య.


🌸మాది గౌరీ సంప్రదాయం. శివుడు తపస్సు చేసేటప్పుడుహిమాలయాలలో పార్వతి శివుణ్ణి గెల్చిందే ఆమె సంప్రదాయమిది. శక్తి స్వరూపిణి అయిన జగదేక సుందరి మాకు గురువు అని చెప్పింది వేశ్య.


🌿ముగ్ధ సంగడు ఇదంతా నిజమేనని నమ్మాడు. ఆమె పడక గది పూజా మందిరమనుకున్నాడు.హంసతూలికాతల్పం, శివ సింహాసనమని భావించాడు. 


🌸అక్కడి నృత్య, వాద్య, కేళికలన్నీ పూజాక్రమం కాబోలుననుకున్నాడు. మరునాడు వచ్చి అందరికీ ‘రాత్రి నేనొక వింత యోగినిని చూచాను. అలాంటి యోగిని ఎక్కడా లేదు


🌿అని చెప్పగా విని అంతా నవ్వి ముగ్ధ సంగయ్యను ఆటలు పట్టించారు.

రుద్ర పశుపతి కథపూర్వం రుద్ర పశుపతి అనే ముగ్ధ భక్తుడొకడు ఉండేవాడు. 


🌿ఒకనాడు ఆయన ఆదిపురాణం వింటున్నాడు. పౌరాణికుడు క్షీర సాగర మథన కధ చెపుతూ శివుని హలాహల భక్షణ వృత్తాంతం చెప్పాడు. రుద్ర పశుపతి అది విన్నాడు. 


🌸విని ఏమిటి శివుడు విషం తిన్నాడా?’ అని నిలుచున్న పాటనే నేలపై పడి ఏడ్వసాగాడు. ‘విస్వెశ్వరా! నిన్ను దేవ దానవులు ఇర్వురూ కలిసి వెఱ్ఱివాణ్ణి చేశారు. 


🌿లేకుంటే ఎవరైనా విషం తాగుతారా? అయ్యో ఇంక నాకు దిక్కెవరు? గౌరవమ్మా! సగం దేహమై వున్నా నీవైనా చెప్పలేకపోయావా? ప్రమథులారా! వీరభద్రుడా! ఏం చేస్తున్నారు మీరంతా?..

( సశేషం )..🚩🌞🙏🌹🎻


🌸🌿🌸🌿🌸🌿🌸🌿🌸🌿

కామెంట్‌లు లేవు: