25, జులై 2020, శనివారం

శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ

 శ్రీమాత్రేనమః 

620వ నామ మంత్రము 25.7.2020

ఓం ఐం హ్రీం శ్రీం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః🙏🙏🙏అనేక బ్రహ్మాండ సముదాయములకు సృష్టికారకురాలై, జనయిత్రియైన జగన్మాతకు నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి అనేకకోటిబ్రహ్మాండ జననీ యను పదకొండక్షరముల నామ మంత్రమును ఓం ఐం హ్రీం శ్రీం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః అని ఉచ్చరించుచూ ఆ మహాతల్లిని అత్యంత భక్తిప్రపత్తులతో ఉపాసించు సాధకునికి సృష్టి, సృష్టికి కారణభూతురాలైన జగన్మాతను ప్రసన్నం చేసుకోవడానికీ కావలసిన ఏకాగ్రత లభించి నిరంతర సాధనతో  బ్రహ్మతత్త్వాన్ని అర్థంచేసుకుని శాశ్వతమైన పరంధామమునకు మార్గము లభించి తరించును🌻🌻🌻అనేకకోటి బ్రహ్మాండముల  సృష్టికి కారణభూతురాలు పరమేశ్వరియే. ఆ తల్లి పరబ్రహ్మస్వరూపిణి. మనము నివసించు ఈ విశ్వము, సూర్యుడు, చంద్రుడు, త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, ప్రజాపతులు, దిక్పాలకులు, గ్రహములు, తారలు మొదలైన సమస్త జీవవస్తు జాలముతో కనిపించే బ్రహ్మాండము, ఇలాంటి బ్రహ్మాండము లెన్నిటినో ఉద్భవం, విలీనం చేయడం, సృష్టి, ప్రళయాల మధ్య జరుగుతూనే ఉంటుంది. ఈ బ్రహ్మాండములకు బీజప్రాయముగా ఉండునదే శ్రీమాత అనబడును. యతో వా ఇ మాని భూతాని జాయంతే (శ్రుతి). బ్రహ్మాండమునకు, అండాండమునకు వ్యత్యాసము లేనిదైనందున శ్రీమాత జనని అని భావించవలయుసు. అనంతకోటి భూత సముదాయములకును బీజ కారణమైనందున ప్రళయకాలములో తన గర్భములో ధరించి ఉండుటచేతనే అనేక కోటి బ్రహ్మాండజనని అని జగన్మాత  స్తుతింప బడుచున్నది🌺🌺🌺అటువంటి జనయిత్రికి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం అనేకకోటిబ్రహ్మాండ జనన్యై నమః అని అనవలెను🌻🌻🌻🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ

43వ నామ మంత్రము 25.7.2020

ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః🙏🙏🙏తాబేలు పృష్ఠ (వీపు) భాగము కంటెను సుందరమైన మీగాళ్ళు (పాదాగ్రములు)  కలిగి యలరారు తల్లికి నమస్కారము🌹🌹🌹శ్రీలలితా సహస్ర నామావళి యందలి  కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితా  యను పండ్రెండక్షరముల (ద్వాదశాక్షరీ) నామ మంత్రమును  ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని ఉచ్చరించుచూ ఆ  అఖిలాండేశ్వరిని అత్యంత భక్తి ప్రపత్తులతో ఆరాధించు సాధకులను ఎప్పుడైనా, ఎన్నిసార్లైనా ఉద్దరించి సమస్త భౌతిక సుఖసంతోషములను లభింపజేసి, జీవితమంతా ఆధ్యాత్మికచింతనతో ప్రవర్తింపజేసి తరింజేయును🌻🌻🌻కూర్మపృష్ఠ (తాబేటి వీపును) జయిష్ణు (జయించు స్వభావముగల) ప్రపద (ముంగాలు అనగా పాదాగ్రము) కూడినది - కలిగియున్నది🌺🌺🌺ఈ పండ్రెండక్షరముల నామ మంత్రమును  ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని ఆపకుండా ఉచ్చరించ వలెను. ఏ పరిస్థితిలోనూ కూర్మపృష్ఠా అని ఆపి   చదవకూడదు...ఇంతకన్నా వివరించి చెప్పకూడదు..🌸🌸🌸తాబేటి వీపున కంటె ప్రశస్తముగా, సుందరమై ఒప్పారే పాదోపరిభాగములతో శ్రీమాత అలరారుచున్నది. అమ్మవారి పాదములు మోక్షప్రదములు. నాలుగు వేదాలకు సంబంధమైన నాలుగు వాక్యాలైన అహం బ్రహ్మాస్మి, తత్త్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మా బ్రహ్మ, ఈ నాలుగు మహావాక్యాలు అమ్మవారి పాదాలను ప్రస్తుతించే వేదాలకు చెందినవి🙏🙏🙏అమృత మథనసమయంలో శ్రీమహావిష్ణువు ఆదికూర్మమై తన పృష్ఠభాగముతో మందరగిరిని క్షీరసాగరములోనికి క్రుంగకుండా ఉద్ధరించెను. అటువంటి బహు సుందరమైన ఆ ఆది కూర్మము యొక్క పృష్ఠభాగముకంటెను శ్రీమాత పాదాగ్రములు సుందరమై, అత్యంత మృదుత్వంతో అలరారు చున్నవని  ఈ నామ మంత్రములోని భావము🌹🌹🌹అంత శ్రేష్ఠమైన జగన్మాత పాదములు ఆశ్రితులకు అమృతపదముసు కలిగిస్తాయి, మోక్షదాయకములై పాపకూపములో పడకుండా ఉద్ధరిస్తాయి🌹🌹🌹అటువంటి శ్రీమాత పాదపద్మములపై దృష్టి నిలిపి నమస్కరించునపుడు ఓం ఐం హ్రీం శ్రీం కూర్మపృష్ఠజయిష్ణుప్రపదాన్వితాయై  నమః అని అనవలెను🌻🌻🌻🌹🌹ఈ వ్యాఖ్యానము శ్రీవిద్యోపాసకులు, కుండలినీ యోగ సిద్ధులు, లలితాంబిక తపోవన సంస్థాపకులు, శ్రీమళయాళస్వామి మఠాధిపతులు పూజ్యపాద శ్రీశ్రీశ్రీ రామేశ్వరానందగిరి స్వాములవారి అనుగ్రహముతో, వారి విరచితమైన శ్రీలలితా సహస్రనామ తత్త్వ విచారణ  అను గ్రంథమునుండి, వారికి పాదాభివందనమాచరించుచూ సహకారముగా స్వీకరించడమైనది🙏🙏🔱నేడు శని (స్థిర) వారము🔱🔱🔱ఆ తిరుమలగిరి వాసుడైన శ్రీనివాసుని స్మరించు శుభదినము🌹🌹🌹శ్రీనివాసుని కరుణ అందరిపై ప్రసరించి అందరికీ శుభములు కలగుగాక🌻🌻🌻 ఓం నమో వేంకటేశాయ🕉🕉🕉🕉🕉🕉🕉🕉 🕉️🌹🌹🌹🌹🌹మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు
పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం చరవాణి  7702090319🕉

కామెంట్‌లు లేవు: