ప్రాణాలు కాపాడే తద్దినం చారు!!!
అనంతసాహితి -ఆయుర్వేదం పంచమవేదం-007
‘‘చారుగా చారుగా చారుగా‘‘ అని ఒకరంటే మరొకరు ‘‘జారుగా జారుగా జారుగా‘‘ అని అంటారు. ఈ ‘‘రెంటికీ‘‘ మూలం ఒకటే. దాన్ని చారు అని కొందరు అంటే రసం అని కొందరు అంటారు. ఇందులో మొదటి దానికి అర్థం అందంగా చారు కాచారుగదా? అని అర్థం. గురుదేవులు ఆంధ్రవ్యాస ఏలూరిపాటి అనంతరామయ్యగారు ప్రతి రోజు తమ భోజనంలో చారు తీసుకునే వారు. ఏదో మొక్కుబడిగా కాకుండా పెరుగన్నం ముందు మొత్తం కంచంలో దాదాపు 200ఎం ఎల్ వచ్చే విధంగా అన్నంలో కలిపి త్రాగేవారు.
తెలుగువారి చారులో తమిళ కర్ణాటకవారి రసంలో అనేక ఆయుర్వేద రహస్యాలున్నాయి. చారు తయారు చేయడంలో వాడే ప్రతి పదార్థం అద్భుతమైన పోషక విలువలు, వనమూలికలు, ఔషథాలు ఉన్నాయి. చారులో ప్రధానమైనవి చింతపండు, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, కరివేపాకు, శొంఠి లేదా అల్లం, మిరపకాయలు (కన్నా కారం మంచిది), మెంతులు (ఆడవారికి చక్కెర వ్యాథి మంచిది), టమోటా, బెల్లం, (వెల్లుల్లి) పోపు సామాన్లు. అతిముఖ్యంగా పసుపు వేసి దీన్ని బాగా మరిగిస్తారు. ఇవేకాక చాలా సంప్రదాయభేదాలతో భారతదేశం మొత్తం చారు అనే రసం ఉంటుంది.
రసం తీసుకోవడంలో కూడా అనేక సంప్రదాయాలున్నాయి. కర్ణాటకవారు రసాన్ని ఎపిటైజర్ గా (అంటే ఆంగ్లేయులు త్రాగే సూప్ మాదిరిగా, ఆకలి, అరుగుదల ప్రేరేపించే రసాయనంగా) భోజన ప్రారంభంలో తీసుకుంటారు. తెలుగువారు అరవం వాళ్ళు పెరుగు లేదా మజ్జికకు ముందు తీసుకుంటారు. ఎవరు ఎలా తీసుకున్నా చారు ప్రయోజనం మాత్రం అన్నం జీర్ణం కావడంలో ముఖ్యపాత్ర పోషించడమే కాక సుఖంగా టాయిలెట్ కి వెళ్ళడానికి ఉపయోగిస్తుంది. రోజు 200 ఎం ఎల్ తీసుకుంటే పైల్స్ రావు.
కనుకనే దీన్ని సరదాగా ‘‘జారుగా జారుగా జారుగా‘‘ అంటారు.
నేటి కరోనా సమయంలో ఇది అతిముఖ్యమైన ఆహారం అవుతోంది.
ఇంటిల్లిపాదీ ప్రతి రోజూ రసం తయారు చేసుకొని అన్నంలో కలుపి కనీసం 200 ఎం ఎల్ రెండు పూట్లా మజ్జిగకు ముందు తింటే కరోనా దరి చేరదు. లేదా పానీయంగా తీసుకోవచ్చు. ఇందులో ముఖ్యమైన ధాతువుల మూడు. అవే మిరియాలు, శొంఠి, పొడుగు మిరియాలు (పిప్పలి). ఇవి మూడూ ఆయుర్వేదం కొన్నివేల ఏళ్ళ క్రితం అతిముఖ్యమైన ఆహార చూర్ణంగా చెప్పింది. దీన్ని ప్రతి రోజూ రెండు చిటికెలు తేనెలో కలిపి (కారంగా ఉంటుంది కనుక) తీసుకుంటే అగ్ని మాంద్యం ఉండదని చెప్పింది.
సమస్త రోగాలకూ మూల కారణం అజీర్తి. కనుకనే నేటి ఆంగ్ల వైద్యులు కూడా ఆయుర్వేదాన్ని కాపీ కొట్టి పొద్దున్నే టాయిలెట్ కి వెళ్ళారా అని అడుగుతున్నారు. పొద్దున్నే టాయిలెట్ రాకపోతే అది రోగగ్రస్త శరీరానికి చిహ్నం. జీర్ణం కాని ఆహారం మరిన్ని రోగాలు సృష్టిస్తుంది. అన్నం జీర్ణం అవ్వాలంటే ఒంట్లో అగ్ని అనే వైశ్వానరాగ్ని ఉండాలి. ఇది ఉంటే అన్నం జీర్ణం అవుతుంది. కనుక ఈ వైశ్వానరాగ్నిని రగిలించే త్రికటు అనే మిరియాలు, శొంఠి, పిప్పలి ఉపయోగిస్తారు. ఇది కేవలం అగ్నిమాంద్యం తొలగించమే కాకుండా ఇది రగిల్చిన అగ్ని కఫనాశిని అవుతుందని అనేక ఇతర ప్రయోజనాలు కూడా ఉన్నాయని ఆయుర్వేదం చెబుతోంది. ముఖ్యంగా కరోనా కలిగించే కఫం అనే శ్లేష్మం అనే వ్యాథులను ఇది అరికట్టి శ్వాసకోశ వ్యాథులు రాకుండా చేస్తుంది. ఈ రెండు కారణాల వలనా భారత ప్రభుత్వ ప్రత్యామ్నాయ వైద్యాభివృద్ధి సంస్థ అనే ఆయుష్ కేంద్రం త్రికటు వాడమని తన ఆరోగ్యజాగ్రత్తల్లో బుద్ధి చెడిపోని క్రితం చెప్పింది.
చాలా ఆశ్చర్యకరమైన అంశం ఒకటి ఇక్కడ చెప్పాలి. పితృదేవతా రహస్యాల్లో చారు ఒక భాగం. పారణ విధానంలో బ్రాహ్మణులను పిలిచి అన్నం వండి పెట్టే ప్రత్యాబ్దికాలు అనే తద్దినాలలో తప్పకుండా చారు పెడతారు. అయితే కేవలం లెక్కకోసం శాస్త్రం కోసం మాత్రమే వండుతూ అశ్రద్ధ చేసేవారు ‘‘తద్దినం చారు‘‘ పెట్టి ఇన్ని నీళ్ళలో పోపుపెట్టి చింతపండు వేసి పసుపు వేసి ఇష్టం లేని తద్దినాలు పెడతారు. దాన్ని రెండు చుక్కల వడ్డన ప్రారంభంలో వేస్తారు.
కానీ ఇందులో మహారోగ్యరహస్యం ఉంది.
పితృకార్యంలో తప్పనిసరిగా గారెలు వండుతారు. ఈ గారెలను మినుములు అనే మాషధాన్యంతో తయారు చేస్తారు. ఈ మినుములు మాంసం కన్నా అనేక రెట్లు బలవంతమైన ఆహారం. బ్రాహ్మణులు మాంసం తినకపోయినా వారు మహాబలవంతులుగా ఉండడానికి కారణం ఈ మినుములే. ఇది మాంసం మాదిరిగా తేలిగ్గా అరగదు. కనుక భోక్తలు గారెలను చారులో నానవేసి స్వీకరిస్తారు. చారులో ఉండే ధాతువుల వల్ల గారెలు సులభంగా జీర్ణం అవుతాయి. ఇవేగారెలు పొట్టుతో పాటు కొందరు తెలివైన వారు వాడతారు. తిరుపతి వడల్లో కూడా పొట్టు ఉంచే తయారు చేస్తారు. మినపప్పులోని దోష గుణం పోగొట్టే రహస్యం పొట్టులో ఉంది. అందులో ఫైబర్ ఉంటుంది. ఈ రహస్యాలు తెలిసిన కర్ణాటక, తమిళనాడు హోటళ్ళవారు రసం ఇడ్లీ, రసం గారెలు పేరుతో సొమ్ము చేసుకుంటున్నారు. కనుక ఈ రసం ఇడ్లీ గారెల వెనుక వేలాది ఏళ్ళ ఆయుర్వేద రహస్యం ఉంది.
కరోనా సమయంలో ప్రతి ఒక్కరూ ఈ త్రికటును పైన చెప్పిన విధంగా చారులా తయారు చేసుకుని ప్రతి ఒక్కరూ కనీసం 200 ఎం ఎల్ అన్నంలో కలుపి తింటే వారిని ఏ రోగం దరిచేరలేదు. త్రికటును ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు లేదా పతంజలి ఆయుర్వేద దుకాణాల్లో సులభంగా ఒక నలుగురు వ్యక్తుల కుటుంబానికి ఒక రోజుకు సరిపడా చిన్ని చిన్న పాకెట్లలో ఇస్తున్నారు. ఇది కేవలం 14 రూపాయల ధరలో ఉంది. లేదా నెలకు సరిపడా డబ్బాల్లో కూడా బైద్యనాథ్, శ్రీశ్రీ, జండూ, హిమాలయ ఆయుర్వేద ఉత్పత్తి సంస్థలు అందిస్తున్నాయి. లేదా పచారీ దుకాణాల్లో శొంఠి, మిరియాలు, పిప్పలి అనే లాంగ్ పెప్పర్ సమపాళ్ళలో గ్రైండ్ చేసి వాడవచ్చు. నేడు ఆయుర్వేద మందులు అన్నీ అవుట్ ఆఫ్ స్టాక్ అయ్యాయి.
పాదాలపై పడినా అమ్మల గోడు పట్టించుకోని ఆంగ్లవైద్యరాక్షసులకు వ్యతిరేకంగా ఆయుర్వేద ప్రచారంలో భాగంగా మేము ఈ త్రికటు శివామృత ప్రసాదంగా ఇస్తున్నాము. మా ఆశ్రమానికి వచ్చిన వారికి ఒక పాకెట్ త్రికటు ఇచ్చి రసం చేసుకుని ఇంటిల్లిపాదీ తీసుకోవడం ప్రారంభించమని కోరుతున్నాము. లేదా తేనెలో రెండు చిటికెలు వేసుకొని తీసుకోమని కోరుతున్నాము. ఇది ఆరోగ్యదానం వంటిది. ప్రతి ఒక్కరూ ఈ విధంగా త్రికటూ చూర్ణం పొట్లాన్ని బహుమతిగా అందరికీ ఇవ్వడం లేదా ఆత్మీయులు వచ్చినప్పుడు టమోటా, కొత్తిమీర, తులసి, బెల్లంతో సూప్ మాదిరి తయారు చేసి ఇవ్వడం చేయండి. దీని వలన ఆరోగ్యదానం చేసివారు అయి ఆయుర్వేదప్రదాత అయిన వైద్యనాథేశ్వరుడైన జ్యోతిర్లింగేశ్వరుని కటాక్షం కలుగుతుంది.
మానవత్వంలేని రాహుకేతుగ్రస్త రాక్షస వైద్యులను (వైద్యులు శస్త్రచికిత్స కారులు కావాలంటే జాతకాల్లో రాహుకేతువులు ముఖ్యం) సేవించడం కన్నా అశ్వగంధ ఒకబిళ్ళ (లేదా ఒక చెంచాడు చూర్ణం), తులసి ఘనవటి బిళ్ళ ఒకటి (లేదా పది నుంచీ ఇరవై దళాలు), తిప్పతీగ అనే గిల్లోయ్ ఘనవటి బిళ్ళ ఒకటి, నాలుగు చుక్కల నువ్వుల నూనె ముక్కులో వేసుకుంటే కరోనా రానేరాదు. ఇది మేము చెప్పడం లేదు. పంచమ వేదం ఆయుర్వేదం చెబుతోంది. నమ్మిచెడిన వారులేరు. నమ్మక చెడతారు. అయినా మేము చెప్పక మానం. విన్నవారు రోజుకు 5 రూపాయలతో నిశ్చింతగా ఉంటారు. లేని వారు 20 లక్షలు తక్కువ కాకుండా ఖర్చుపెట్టుకొని ఆంగ్లమరణశయ్య చేరుకుంటున్నారు.
కరోనా సమయంలో మరిన్ని ఆయుర్వేదఆరోగ్య రహస్యాలు ముందు ముందు తెలుసుకుందాం.
స్వామీ అనంతానంద
అనంతసాహితి ఆశ్రమం
హైదరాబాద్, గుంటూరు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి