25, జులై 2020, శనివారం

రుద్రచమకం లో #గణితరహస్యం:-

శ్రీ రుద్రం విశిష్టత :

#శతరుద్రీయం యజుర్వేదంలో భాగం. ఇది మరణాన్ని సహితం అధిగమించగల్గిన సాధనం. జన్మకు మృత్యువుకు అతీతంగా ఉండే తత్వాన్ని సూచిస్తుంది. మనిషిలో శ్వాస నింపేది మరల దానిని తీసుకుపోయేది కూడా ఆ పరమాత్మే నని తెలియజేస్తుంది. శ్రీ రుద్రాన్ని రుద్రాప్రస్న అని కూడా అంటారు. వేద మంత్రాలలో ఏంటో ఉత్కృష్టమైనది. శ్రీ రుద్రం రెండు భాగాలలో ఉంటుంది. "నమో" పదం వచ్చే మొదటి భాగం, యజుర్వేదంలో ౧౬వ అధ్యాయంలో ఉంటుంది. దీనిని #నమకం అంటారు. రెండవ భాగంలో "చమే" అన్న పదం మరల మరల రావటం వాళ్ళ దీనిని #చమకం అంటారు. ఇది ౧౮వ అధ్యాయంలోఉంది.

🙏చమకం నమకం చైవ పురుష సూక్తం తథైవ చ |
నిత్యం త్రయం ప్రాయునజనో బ్రహ్మలోకే మహియతే ||🙏

నమకం చమకం ఎవరైతే మూడు మార్లు పురుష సూక్తంతో ప్రతీ దినం చదువుతారో వాళ్లకు బ్రహ్మలోకం ప్రాప్తిస్తుంది.

చమకం విశిష్టత:
➖➖➖➖➖
నమకం చదివిన తర్వాత, భక్తుడు తనే శివ రూపంగా భావించి దేవదేవుడిని తనకు సర్వం ప్రసాదించమని ప్రార్ధన చేసేది చమకం. ఇది ప్రతీ ఒక్కరికి పనికి వచ్చేది. జ్ఞానం నుండి మోక్షం కలిగే మార్గములో ప్రతీ పనిని మనిషి ఆస్వాదించి, చివరకు అంతులేని ఆనందం కలగచేసే మంత్రం. సృష్టి కర్తకు ఒక ప్రాణి నుండి ఇంకో ప్రాణికి విభేదం లేడు. సమస్తం అతనినుంది ఉద్భవించినది కనుక, మోక్ష కాంక్ష దైవత్వమునకు సూచనే.

అనువాకం – 11:
పదకొండవ అనువాకంలో మానవ సరిసంఖ్యకానికి దైవ బేసి సంఖ్యకానికి అనుబంధం కుదరడానికి కావలసిన శక్తిని దీవేనని కోరుకునే ప్రార్ధన.
చమకం ఐహిక సుఖానేషణ నుండి మొదలయి మొక్షాన్వేషణకు దారిచూపిస్తుంది. దైవం ఆద్యంతమైనది. అదే భూమి, ఆకాశం, కాలం, పునః మరణం, పునః జననం అన్నింటికీ కారణం, అంతం అని చెప్తుంది..

పదకొండవ అనువాకము:
🙏🙏🙏🕉🕉🕉🙏🙏🙏

ఏకా’ చ మే తిస్రశ్చ’ మే పంచ’ చ మే సప్త చ’ మే నవ’ చ మ ఏకా’దశ చ మే త్రయోదశ చ మే పంచ’దశ చ మే సప్తద’శ చ మే నవ’దశ చ మ ఏక’విగ్ంశతిశ్చ మే త్రయో’విగ్ంశతిశ్చ మే పంచ’విగ్ంశతిశ్చ మే సప్త విగ్‍మ్’శతిశ్చ మే నవ’విగ్ంశతిశ్చ మ ఏక’త్రిగ్ంశచ్చ మే త్రయ’స్త్రిగ్ంశచ్చ మే చత’స్-రశ్చ మే‌உష్టౌ చ’ మే ద్వాద’శ చ మే షోడ’శ చ మే విగ్ంశతిశ్చ’ మే చతు’ర్విగ్ంశతిశ్చ మే‌உష్టావిగ్‍మ్’శతిశ్చ మే ద్వాత్రిగ్‍మ్’శచ్చ మే షట్-త్రిగ్‍మ్’శచ్చ మే చత్వారిగ్ంశచ్చ’ మే చతు’శ్-చత్వారిగ్ంశచ్చ మే‌உష్టాచ’త్వారిగ్ంశచ్చ మే వాజ’శ్చ ప్రసవశ్చా’పిజశ్చ క్రతు’శ్చ సువ’శ్చ మూర్ధా చ వ్యశ్ని’యశ్-చాంత్యాయనశ్-చాంత్య’శ్చ భౌవనశ్చ భువ’నశ్-చాధి’పతిశ్చ || 11 ||

ఓం ఇడా’ దేవహూర్-మను’ర్-యఙ్ఞనీర్-బృహస్పతి’రుక్థామదాని’ శగ్ంసిషద్-విశ్వే’-దేవాః సూ”క్తవాచః పృథి’విమాతర్మా మా’ హిగ్ంసీర్-మధు’ మనిష్యే మధు’ జనిష్యే మధు’ వక్ష్యామి మధు’ వదిష్యామి మధు’మతీం దేవేభ్యో వాచముద్యాసగ్ంశుశ్రూషేణ్యా”మ్ మనుష్యే”భ్యస్తం మా’ దేవా అ’వన్తు శోభాయై’ పితరో‌உను’మదన్తు ||

ఓం శాంతిః శాంతిః శాంతిః 

తాత్పర్యము :
🖋🖋🖋🖋🖋🖋🖋🖋

గర్భిణీలు అయిన గోవులు, గోవులు, దూడలు, ఒకటిన్నర, రెండు, రెండున్నర, మూడు, మూడున్నర, నాలుగు సంవత్సరములున్న గోవులు, ఎద్దులు, వీర్యమున్న ఎద్దులు, బాలింతలైన గోవులు, గొడ్లు అందుబాటులో ఉండుగాక. ఈ అగ్నిహోత్రములోని అగ్ని నాకు పూర్ణాయుష్షు, ఉచ్చ్వాశ నిశ్శ్వాసలు, ఆరోగ్యకరమైన కళ్ళు, చెవులు, మనసు, వాక్కు, ఆత్మను ఇచ్చు గాక. ఇటువంటి కార్యములు ఇంకా చేయుటకు శక్తిని ఇచ్చు గాక. ఒకటి, మూడు, ఐదు, ఏడు, తొమ్మిది, పదకొండు, పదమూడు, పదిహేను, పదిహేడు, పంతొమ్మిది, ఇరవై ఒకటి, ఇరవై మూడు, ఇరవై ఐదు, ఇరవై ఏడు, ఇరవై తొమ్మిది, ముప్ఫై ఒకటి, ముప్ఫై మూడు నాతో ఉండు గాక. నాలుగు, ఎనిమిది, పన్నెండు, పదహారు, ఇరవై, ఇరవై నాలుగు, ఇరవై ఎనిమిది, ముప్ఫై రెండు, ముప్ఫై ఆరు, నలభై, నలభై నలుగు, నలభై ఎనిమిది నాతో ఉండు గాక. ఆహారము, ధాన్యము, ధన్యోత్పత్తి, దాని వృద్ధి, అగ్నిహోత్రము నాతో ఉండు గాక. దీనికొరకు నేను పంచ భూతములను, దిక్పాలకులను నాయందు కరుణ చూపవలసినదిగా ప్రార్థిస్తున్నాను.

(ఇక్కడ చెప్పబడిన సంఖ్యలు సరి సంఖ్యలు భూలోక సంబంధమైనవి గా, బేసి సంఖ్యలు  దేవలోక సంబంధమైనవిగా వ్యాఖ్యానించ బడినది. ఇంకొక వ్యాఖ్యానం -  ఒక ప్రకృతి, మూడు గుణములు, పంచ భూతములు,  ఏడు ఇంద్రియములు, నవ రంధ్రములు...ఇలా ప్రతి ఒక సంఖ్య ఒక విశేషమైన ప్రాధాన్యత సంతరించు కొన్నట్లు)

1 (ఎకమేవాద్వితీయం బ్రహ్మ), 3 (3 లోకాలు, 3 గుణాలు), 5 (పంచ మహాభూతాలు), 7 (సప్తలోకాలు, సప్త పరిధులు, సప్త ఋషులు), 9 ( నవగ్రహాలు, నవవిధభక్తి, నవగ్రహాల అనుకూలం, నవరత్నాలు), 11 (పది ప్రాణాలు + సుషుమ్న, ఏకాదశ రుద్రులు) , 13 (దేవతలు, అక్షరాలు), 15(నాడులు, పక్షం రోజులు), 17 (అంగాలు), 19(ముఖ్య మూలికలు, మాండూక్య ఉపనిషత్ పరంగా ఒకరికున్న 19 ముఖాలు), 21 (యజ్ఞాలు), 23 (ఆరోగ్య దేవతలు), 25 (అప్సరసలు), 27 (నక్షత్రాలు, గంధర్వులు), 29 (విద్యుత్ దేవతలు), 31 (లోకాలు), 33 (దేవతలు)
అలాగే  4 (చతుర్విధ పురుషార్ధాలు, ౪ వేదాలు, 4 ఆశ్రమాలు), 8 (దిక్కులు, వేదాలు+ఉపవేదాలు), 12 (ఆదిత్యులు, నెలలు, రాశులు), 16 (దేవుని కళలు, చంద్రకళలు, , సిద్ధులు), 24 (గాయత్రి మంత్రం), 28 (విష్ణు అవతారాలు), 32 (అనుష్టుప్ ఛందస్సు), 36 (తంత్రాలు), 40 (ఇంద్రాశ్వాలు), 44 (త్రుష్టుప్), 48 (జగతి)

కామధేనువు దేవతలను ఆహ్వానించు గాక; మనువు కార్యము చేయు గాక.  బృహస్పతి మంత్రములు చదువు గాక. విశ్వ దేవుడు పధ్ధతి చెప్పు గాక. ఓ భూమాత! మాకు ఆటంకములు కలిగించకు. నేను ఎల్లప్పుడూ మంచి ఆలోచనలతో, సత్కార్యములు చేస్తూ, దేవతలకు ప్రీతికరమైన వస్తువులు తెచ్చి సమర్పిస్తాను. సజ్జనులారా! నేను ఈ విధంగా చేసినందు వలన ఆ దేవతలు, పితరులు నన్ను రక్షింతురు గాక.  

ఓం శాంతి శాంతి శాంతి 

ఇది కృష్ణ యజుర్వేదములోని, నాలుగవ కాండ, ఏడవ ప్రపాఠకములోనిది.

ఈ 11 వ అనువాకం లో ఒక #రహస్యం దాగి ఉంది ఇందులో వరుసగ సంస్కృతంలో అన్నీ బేసి సంఖ్యలే వస్తాయి ఈ అంకెలు ఒక క్రమ పద్ధతిలో వచ్చునవి కావు ఇవి #దేవసంఖ్యలు. కాని వాటి ముందు ఉండు సంఖ్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన ఒక క్రమ పద్ధతిలో గల #మనుష్యసంఖ్యలు( వరుసక్రమం లో వచ్చు సంఖ్యలు) కలుగుతాయి.

ఉదాహరణ కు అందులో (ఏకాచమే అనగా 1, త్రిసస్చమే అనగా 3, పంచచమే = 5 సప్తచమే 7, నవచమే 9, ఏకాదశచమే 11 ఇలా 1,3,5,7,9,11....బేసి సంఖ్యలే వస్తాయి ). 
కాని వాటి ముందు ఉండు సంఖ్య తో కూడి వర్గ మూలము లను అపాదించిన చో ఇగో ఇలా వస్తాయి....

ఏకాచమే అనగా ఒకటి =1, 
త్రిసస్చమే అనగా 3+1 = 4 కి వర్గమూలం =2,
పంచచమే = 5+4=9 కి వర్గమూలం = 3, 
సప్తచమే = 7+9=16 కి వర్గమూలం = 4, 
నవచమే = 9+16=25 కి వర్గ మూలం = 5, 
ఏకాదశచమే = 11+25 =36 కి వర్గ మూలం = 6, 
త్రయోదశచమే = 13 + 36 = 49 కి వర్గ మూలం = 7, 
పంచ దశచమే = 15 + 49 = 64 కి వర్గ మూలం = 8, 
సప్త దశచమే = 17 + 64 = 81 కి వర్గ మూలం = 9, 
నవ దశచమే = 19 + 81 = 100 కి వర్గ మూలం = 10,
ఏకవిగుం శతిస్చమే = 21 +100 = 121 కి వర్గ మూలం = 11, 
త్రయో వింశతి శ్చమే = 23 + 121 = 144 కి వర్గ మూలం = 12, 
పంచ వింశతి శ్చమే = 25 + 144 = 169 కి వర్గ మూలం = 13, 
సప వింశతి శ్చమే = 27+ 169 = 196 కి వర్గ మూలం = 14, 
నవ వింశతి శ్చమే = 29 + 196 = 225 కి వర్గ మూలం = 15, 
ఏక త్రింశతి శ్చమే = 31 + 225 = 256 కి వర్గ మూలం = 16, 
త్రయో త్రింశతి శ్చమే = 33 +256 = 289 కి వర్గ మూలం = 17, 
పంచ త్రింశతి శ్చమే = 35 + 289 = 324 కి వర్గ మూలం = 18, 
సప్త త్రింశతి శ్చమే = 37 + 324 = 361 కి వర్గ మూలం = 19, 
నవ త్రింశతి శ్చమే = 39 + 361 = 400 కి వర్గ మూలం = 20, 

కానీ దీనిలో ఎంతో గణిత జ్ఞానం కూడా నిక్షిప్తమై వున్నది.
ఒక్కసారి ఇచ్చిన వరుస చూడండి: 1,3,5,7,9,11,13,15,17,19,21,23,25,27,29,31,33 ( అన్నీ బేసి సంఖ్యలు)
దీన్ని arithmetic progression అని అంటాము గణిత భాషలో.

శ్రీపాద శ్రీవల్లభ స్వామి చరిత్రలో గ్రంధకర్త దీనిలో ఒక విషయం గమనించారు:
1+3 = 2**2 (4)
1+3+5 = 3**2 (9)
1+3+5+7 = 4**2 (16)
ఇలాగ
1+3+5+7+9+11+13+15+17+19+21+23+25+27+29+31+33 = 17**2 ( 289)
అదే విధంగా తరువాత వచ్చే సిరీస్ చూడండి
4,8,12,16,20,24,28,32,36,40,44. ఇది  పై  సిరీస్ నుండి ఉద్భవించిన వైనం చూడండి
1+3 = 4
3+5 = 8
5+7 =12
ఈ విధంగా 23+25 = 48
ఇది కూడా arithmetic progression కానీ దీన్ని derivative series అని అన్వయించవచ్చు.

🙏Gödel, Escher, Bach: 📒An Eternal Golden Braid, GEB అని ఒక పుస్తకం patterns కు, ఆర్ట్ కు, 🎶సంగీతానికి, 😇మానవ మేధస్సుకు సంబంధం వివరించాడు. దాని ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకున్న ఇటువంటి సిరీస్ పరంగా ఎలా మారుతుందో, అటువంటి pattern వలన మానవ మేధస్సు ఎలా ద్విగుణీకృతము అవుతుందో చెప్పబడి వుంది.

ఇంతే కాదు మన లక్షణాలను నిరూపించాగలిగే  మానవ DNA కు సంబంధించి 33,000 mitochondrial basepairs ని ఈ 1-33 ప్రాతినిధ్యం వహిస్తుంది అని , 4-48 chromosomes ను నిరూపిస్తాయని అంటారు. (మానవులకు - 44 సాధారణ chromosomes, 2 సెక్స్ chromosomes ), కానీ #hominidae(great apes) లు అందరికీ 48 chromosomes ఉంటాయని వైజ్ఞానిక శాస్త్రం.
కొంతమంది పూర్వులకు ఇటువంటి DNA వివరాలు ఎలా తెలియవచ్చు అని అడగవచ్చు, కానీ ఒక్కసారి మన చరిత్ర చదివితే తెలుసుతుంది. అగస్త్య, వసిష్ఠ మహర్షులు #కుంభ_సంభవులు. అంటే ఈ రోజుల్లో మనం చెప్పుకుంటున్న టెస్ట్ ట్యూబ్ బేబీస్. అంతే కాదు ఎన్నో పురాణాలలో ఎందరివో ఇటువంటి పుట్ట్టుకలు వివరింపబడి వుంటాయి. మనమింకా పరిశోధిస్తే మరిన్ని వివరాలు బయల్పడతాయి. దేవుని దయ వలన మనలోని జిజ్ఞాసులు మరి కొందరు ఈ తీరులో పరిశోధనలు చేసి మరిన్ని వివరాలు వెలుగులోకి తీసుకు వస్తారని ఆశిద్దాం.

రుద్ర చమకము లో ఈ 11 వ అనువాకము సృష్టి పరమాణు రహస్యము. 

#కణాదమహర్షి సిద్ధాంతము:-

 ఈ సమస్త సృష్టి అణు, పరమాణు సూక్ష్మ కణ స్వరూపమని వాటి లో గల సంఖ్యా భేదము అనుసరించి వివిధ ధాతువులు యేర్పడినవి అని.

 శివ తత్వము ఈ సృష్టి లోని, పరమాణు స్వరూపం.

 శివోహం శివోహం శివోహం,...

కామెంట్‌లు లేవు: