25, జులై 2020, శనివారం

నాగచంద్రేశ్వర దేవాలయానికి ప్రత్యేక ప్రాశస్త్యం నాగపంచమి ' నాడు తెరవబడుతుంది.

మహాకాళ దేవుని మహా నగరం.. ఉజ్జయిని. ఈ నగరానికి దేవాలయాల నగరంగా మరో పేరుంది. ఈ నగరంలో వీధికి ఒక దేవాలయాన్ని మీరు కనుగొనవచ్చు.

కానీ నాగచంద్రేశ్వర దేవాలయానికి ప్రత్యేక ప్రాశస్త్యం ఉన్నది.

 మహాకాళేశ్వర దేవాలయానికి క్షేత్ర భాగాన కొలువైన ఈ దేవాలయం సంవత్సరానికి ఒకసారి అదీ ' #నాగపంచమి ' నాడు తెరవబడుతుంది.

సర్పాధిపతిగా పిలువబడే తక్షకుని విగ్రహాన్ని నాగపంచమి నాడు కొలిచేందుకు వేల సంఖ్యలో భక్తులు ఈ దేవాలయానికి విచ్చేస్తారు.

 నాగరాజైన తక్షకుని కరుణా కటాక్ష వీక్షణాల కోసం సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు ఇక్కడకు వస్తారు.

 దేవాలయం లోపలిభాగంలో, విఘ్నేశ్నర పార్వతీ సమేత ఈశ్వరుని భారీ విగ్రహం కొలువై ఉంటుంది. పరమశివుని విగ్రహం సర్పతల్పంపై ప్రతిష్టించబడి ఉంటుంది.

సాధారణంగా మహావిష్ణువు సర్పతల్పంపై పరుండి కనిపిస్తాడు కానీ అందుకు భిన్నంగా ప్రపంచంలో ఏ దేవాలయంలో లేని రీతిలో ఇక్కడి దేవాలయంలో బోళాశంకరుడు సర్పతల్పంపై ఉంటాడు.

విగ్రహ రూపంలోని శంకర మహాదేవుడు భుజంపైన మరియు మెడ చుట్టూ సర్పాలను ధరించి ఉంటాడు.

సర్పాధిపతి తక్షకుడు పరమశివుని ప్రసన్నం చేసుకునేందుకు ఘోరమైన తపస్సు చేసాడు. తక్షకుని తపస్సుకు సంతసించిన మహాశివుడు చిరంజీవిగా వర్ధిల్లమని వరమిచ్చాడు. ఆనాటి నుంచి తక్షకుడు మహాశివుని చెంతనే ఉండిపోయాడని చెప్పబడింది.'

ఇతిహాసాల విశ్వాసం
ఇది చాలా పురాతనమైన దేవాలయం.

పర్మర్ వంశానికి చెందిన భోజరాజు ఈ దేవాలయాన్ని 1050వ సంవత్సరంలో పునరుద్ధరించాడని ఒక విశ్వాసం. అనంతరం 1732వ సంవత్సరంలో, మహాకాళ దేవాలయంతో ఈ దేవాలయానికి రాణాజీ సింధియా నూత్న వైభవాన్ని తెచ్చారు.

ఈ దేవాలయంలో పూజలు చేసిన వారికి సర్వ సర్పదోషాలు తొలగిపోతాయని చెప్పబడింది. 'నాగపంచమి' నాడు లక్షలాదిగా భక్తులు ఈ దేవాలయాన్ని
సందర్శించడం వెనుక ఇది కూడా ఒక కారణం కావచ్చు.

సేకరణ

కామెంట్‌లు లేవు: