నువ్వు ఏమి చేస్తుంటావు?
1989లో ఒకరోజు సాయింత్రం ఆరు గంటలప్పుడు కంచి శ్రీమఠంలో కూర్చుని స్వామివారు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. పూర్వం కాంచీపురానికి తహసీల్దార్ గా పనిచేసిన మా పెద్దన్న తిరు. సుందరం, నేను మరియు అదనపు జిల్లాధికారి(అసిస్టెంట్ కలెక్టర్) స్వామివారి దర్శనం కోసం కూర్చుని ఉన్నాము. ఈ సంఘటన జరిగినప్పుడు మా అన్నయ్య తిరనల్వేలి జిల్లా కార్యాలయంలో బలహీన వర్గాల సంక్షేమాధికారిగా విధులు నిర్వహించేవాడు. అతను స్వామివారి దర్శనం ముగించుకొని ఆ రాత్రికే చెన్నై వెళ్ళిపోవాలి.
భక్తులందరూ ఒక్కొక్కరిగా ముందుకు వెళ్ళి స్వామికి నమస్కరించారు. మా వంతు రాగానే మేమూ స్వామివారికి సాష్టాంగం చేసి నిలబడ్డాము. స్వామివారు నవ్వుతూ, “వెళ్ళడానికి చాలా ఆత్రంగా ఉన్నారే? కొద్దిసేపు ఉండండి” అని ఆదేశించారు. స్వామివారి ఆదేశానికి కట్టుబడి మేము అక్కడే కూర్చున్నాము. స్వామివారి చేతులుపైకెత్తి, దర్శాననికి వచ్చిన దాదాపు ముప్పైమందిని కూర్చుండమని సైగ చేశారు.
స్వామివారు మొత్తం గుంపుని పలుసార్లు చూసి భక్తితో మూలగా కూర్చున్న ఒక వ్యక్తిపై పడ్డాయి. స్వామివారు అతనితో మాట్లాడగా అతను లేచి నిలబడ్డాడు. అతను చొక్కా తీసి పంచెపైన నడుము చుట్టూ కట్టుకున్నాడు.
“నీ పేరు?” అని అడిగారు స్వామివారు. ”మురుగేశన్” అని వినయంగా చెప్పాడు. ”ఏం చేస్తుంటావు?”
“వ్యవసాయం సామి”
“ప్రపంచానికి అన్నం పెడుతున్నావన్నమాట” అని చిన్నగా నవ్వి, కూచోమన్నట్టుగా సైగచేశారు. అతను కూర్చున్నాడు.
స్వామివారి కళ్ళు మరలా వెతకనారంభించాయి ఈసారి ఇంకొక భక్తుణ్ణి అడిగారు. అతను లేచి నిలబడి తన పేరు మునుస్వామి అని వెల్లోర్ లో రెవిన్యూ ఇన్ స్పెక్టర్ గా పనిచేస్తున్నానని చెప్పాడు.
“నువ్వు ప్రజలకు ఎలా సేవ చేస్తావు?” అని అడిగారు.
”నేను ప్రజలుకోరిన ప్రకారం భూయజమాన్య పత్రాలు, ఇంటి స్థాలాల హక్కు పత్రాలు వంటివి జారీ చేస్తుంటాను పెరియవ”
వెంటనే స్వామివారు నావైపు చూసి “ఇప్పుడు ఏ పదవిలో ఉన్నావు?” అని అడిగారు.
నాకు కాళ్ళుచేతులు అడడంలేదు. ఎందుకంటే, తమిళనాడు కంజ్యూమర్ ఫెడరేషన్ కి సహాయక తహసిల్దార్ గా చేస్తున్నాను. TASMAC(Tamil Nadu State Marketing Corporation)లో నా పని ప్రభుత్వ గోడౌన్ నుండి మద్యం చిల్లర వర్తకులకు వివిధ రకాలైన మద్యం అమ్మడం. ఇది ప్రజాసేవగా ఎలా చెప్పుకోను?
కాస్త సందేహిస్తూనే స్వామివారికి, “TASMACలో డిప్యుటి తహసిల్దార్ గా చేస్తున్నాను” అని చెప్పాను. ఆందోళనతో చమటలు పడుతున్నాయి. కాని స్వామివారి నా ఉద్యోగం గురించి ఎక్కువగా అడగలేదు.
బ్రతుకుజీవుడా అని కూర్చున్నాను.
తరువాత మా అన్నయ్యని అడిగారు. అతను లేచి స్వామివారికి తాను అసిస్టెంట్ కలెక్టరుగా ఉచిత విద్య, బలహీన వర్గాలవారికి ఆహారము, ఉపాధి కల్పన, అర్హులకు కుట్టుమిషన్లు, ఇస్త్రీపెట్టెల పంపిణీ వంటివి చేస్తుంటాను అని చెప్పాడు.
అది విన్నతరువాత స్వామివారు ఇలా చెప్పారు, “ఇక్కడ ఉన్నవారిలో ప్రజలకు మేలుచేసే రెవెన్యూ అధికారి, సహాయ తహసిల్దార్, సహాయ కలెక్టరు వంటివారు ఉన్నారు. మనకు ఇంకేం కావాలి?” అని ఒక ఆకర్షణీయమైన నవ్వు నవ్వారు.
కాని నాకు మరలా స్వామివారి కళ్ళు నాపై పడొచ్చు అని గుండెదడగా ఉంది. ప్రజలకు హానిచేసే నా ఉద్యోగం గురించి స్వామివారికి ఎలా చెప్పగలను? నా మనసులోనే స్వామివారిని వేడుకున్నాను, “స్వామి గత మూడేళ్ళుగా నేను ఈ అధికారంలో ఉన్నాను. నాకు ఇక ఉండాలని లేదు. నాకు ఈ పనినుండి విముక్తి కల్పించండి”. కరుణావరుణాలయులైన మహాస్వామివారు నా ఉద్యోగం గురించి అడిగి నన్ను ఇబ్బందికి గురి చెయ్యలేదు.
ఈ సంఘటన జరిగిన కొన్ని వారాల్లోనే అక్కడి నుండి బదిలీ అయ్యి కలెక్టర్ కార్యాలయంలో డిప్యుటి తహసిల్దార్ గా చేరాను. బదిలీ ఉత్తర్వులు ఇచ్చినది ప్రభుత్వమే అయినా, అవి వచ్చేలా చేసినది మాత్రం స్వామివారే అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
--- ఇరసు, చెన్నై-61. మహాపెరియవళ్ – దరిశన అనుభవంగళ్ 2
అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।
టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.
t.me/paramacharyavaibhavam
#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి