31, జులై 2023, సోమవారం

ॐ శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్

 ॐ   శ్రీ శివ సహస్రనామ స్తోత్రమ్ 



                             శ్లోకం:33/150 


ప్రస్కందనో విభాగజ్ఞో 

హ్యతుల్యో యజ్ఞభాగవిత్ I  

సర్వవాస స్సర్వచారీ 

దుర్వాసా వాసవోఽమరః ॥ 33 ॥  


* ప్రస్కందః = శత్రువులను నశింపచేయువాడు, 

* విభాగజ్ఞః = యజ్ఞ భాగములు తెలిసినవాడు, 

* అతుల్యః = తనతో సమానుడు లేనివాడు, 

* యజ్ఞభాగవిత్ = యజ్ఞమునందలి భాగములు (ఆహ్వానములు) తెలిసినవాడు, 

* సర్వవాసః = సమస్తమును ధరించువాడు, 

* సర్వచారీ = సమస్త ప్రదేశములందు సంచరించువాడు, 

* దుర్వాసా = మేలిమి వస్త్రములు కాకపోయినా కూడా ధరించువాడు, 

* వాసవః = ఇంద్ర రూపుడు, 

* అమరః = మరణము లేనివాడు (దేవత). 


                    కొనసాగింపు ... 


https://youtu.be/L4DZ8-2KFH0 


                    =x=x=x= 


  — రామాయణం శర్మ 

           భద్రాచలం

కామెంట్‌లు లేవు: