*1808*
ఘనమగు వృక్షము నీడన
మననీడయు కానరాదు మనుషులకటులన్
ధనములు తలకెక్కినపుడు
తను బంధములగుపడవిల తప్పక సుజనా.
*భావం*:-- ఓ సుజనా! మహావృక్షం నీడలో మననీడకూడా మనకు కనబడదు(మాయమై పోతుంది). మనుషుల కు కూడా అలాగే డబ్బు తలకెక్కితే తన బంధుమిత్రులు కూడా కనబడరు.
*** *కొంపెల్ల శ్రీనివాస శర్మ*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి