31, జులై 2023, సోమవారం

బీహార్ : సూరజ్‌పూర్, నలంద

 🕉 మన గుడి : 







⚜ బీహార్ : సూరజ్‌పూర్, నలంద


⚜ సూర్య కుండ్



💠 బీహార్ ని పండుగల దేశం

అంటారు. పండుగలు పౌరాణిక కాలం నుండి బిహారీ నాగరికతలో చేర్చబడ్డాయి. వివిధ నాగరికత, మతం మరియు సంస్కృతికి చెందిన ప్రజలు రాష్ట్రంలోని పవిత్ర భూమిలో నివసిస్తున్నారు, దీని కారణంగా ఈ ఉపవాసాలు మరియు పండుగల ప్రాముఖ్యత మరింత పెరుగుతుంది. 

ఈ బీహార్ గడ్డపై అడుగడుగునా ఇలాంటి పౌరాణిక మఠాలు, దేవాలయాలు ఎన్నో ఉన్నాయి. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు వస్తుంటారు. నలంద జిల్లాలోని  ఉన్న చారిత్రాత్మక సూర్య దేవాలయం అటువంటి దేవాలయాలలో ఒకటి. భాస్కరునికి అర్హ్యం ఇచ్చే సంప్రదాయం ఇక్కడి నుంచే

ప్రారంభమైందని ప్రతీతి.


💠 ఈ ఆలయం ద్వాపర కాలం నాటిదని

చెబుతారు. సూర్య భగవానుడి ప్రత్యేక ఆరాధన అయిన  " ఛత్ పూజ "ఈ ఆలయం నుండి ప్రారంభమైందని నమ్ముతారు.

సూర్యారాధన బీహార్‌లో ఛత్ పూజగా కొనసాగుతోంది.  


💠 ఈ ఆలయంలో నల్లరాతి మూర్తులు పురాతనమైనవి.  

సూర్య నారాయణ మూర్తిలతో పాటు, శివలింగాలు, ఆదిత్య, పార్వతి మరియు కాల భైరవ మూర్తి వంటి అనేక మూర్తులు ఉన్నాయి.


💠 ద్వాపర కాలంలో శ్రీకృష్ణుడు పాండవులతో కలిసి ఇక్కడి రాజగిరికి వచ్చినప్పుడు, అతను ఈ ఆలయానికి చేరుకుని, భాస్కరుడిని పూజించాడని ఆలయచరిత్ర.

ఇది కాకుండా మగధ చక్రవర్తి  జరాసంధుడు కూడా ఇక్కడ సూర్య భగవానునికి పూజలు  చేశారు. పై కారణాలు వల్ల ఈ ఆలయ ఖ్యాతి దేశంలోని నలుమూలలకు వ్యాపించింది. 


💠 ఈ సూర్య దేవాలయం బీహార్‌లోని నలందా సమీపంలోని సూరజ్‌పూర్ బరాగావ్‌లో ఉన్న పురాతన హిందూ దేవాలయం. 

ఇది భారతదేశంలోని 12 సూర్యధాములలో ఒకటి మరియు నలందలో సందర్శించవలసిన ప్రసిద్ధ ప్రదేశాలలో ఒకటి.


💠 ఈ ఆలయంలో అనేక బౌద్ధ దేవతలతో పాటు చాలా అందమైన హిందూ దేవతల విగ్రహాలు ఉన్నాయి. అన్ని విగ్రహాలలో అత్యంత ఆకర్షణీయమైనది పార్వతీ దేవి యొక్క 5 అడుగుల ఎత్తైన విగ్రహం. 


💠 వైశాఖ మరియు కార్తీక మాసాలలో సంవత్సరానికి రెండుసార్లు ఇక్కడ జరిగే 'ఛత్ పూజ' వేడుకకు ఈ ఆలయం బాగా ప్రసిద్ధి చెందింది. చాట్ పూజలో భాగంగా ఈ ఆలయంలో ప్రసాదం ఇక్కడి చెరువు నీటి నుండి తయారుచేయబడును


💠 ఇక్కడి సూర్యుని చెరువులో స్నానం చేసి, ఆలయంలోని భాస్కరుడిని పూజించడం వల్ల కుష్టువ్యాధితో పాటు నయం కాని అనేక వ్యాధులు నయమవుతాయని ప్రజల నమ్మకం.


⚜ స్థల పురాణం ⚜


💠 దుర్వాస మహర్షి  శ్రీకృష్ణుడిని కలవడానికి ద్వారకకు వెళ్లాడు. ఆ సమయంలో శ్రీకృష్ణుడు రుక్మణితో కలిసి తోటలో నడుస్తూ ఉన్నాడు. ఇంతలో శ్రీకృష్ణుని కొడుకు సాంబుడు అకస్మాత్తుగా ఏదో నవ్వాడు. మహర్షి దుర్వాసుడు అతని నవ్వును  వెక్కిరింపుగా అర్థం చేసుకున్నాడు. 

అప్పుడు సాంబుడుకి కుష్ఠురోగం వస్తుందని శపించాడు. దీని తరువాత, శ్రీ కృష్ణుడు ఆ  కుష్టు వ్యాధి నివారణకు సూర్య భగవానుని ఆరాధన చేసి ఇక్కడి సూర్య కుండంలో స్నానం చేయమని ఆదేశించాడు.

అలాగే సూర్య రాశిని వెతకమని ఆదేశించాడు


💠 శ్రీకృష్ణుడి ఆదేశం మేరకు సాంబుడు 49 రోజుల పాటు పూజలు చేశాడు, శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు, సాంబుడు సూర్యుని రాశిని వెతకడానికి బయలుదేరాడు. దారిలో దాహం వేసింది. దీని తరువాత, సేవకుడికి నీరు తీసుకురావాలని ఆదేశించాడు.

దట్టమైన అరణ్యం వల్ల చాలా దూరం వరకు నీరు దొరకడం లేదు. ఒక చోట గొయ్యిలో నీరు కనిపించింది, అది కూడా మురికిగా ఉంది. సేవకుడు ఆ గుంటలోంచి నీళ్ళు తెచ్చి రాజుకి ఇచ్చాడు. రాజు మొదట నీళ్లతో కాళ్లు చేతులు కడుక్కొన్నాడు. ఆ తర్వాత ఆ నీటితో దాహం తీర్చుకున్నాడు. నీళ్లు తాగిన వెంటనే అతని శరీరంలో మార్పులు కనిపించాయి. ఆ తర్వాత అక్కడే ఉంటూ నీళ్లు తాగుతూనే ఉన్నారు. 

49 రోజుల పాటు సూర్యుడిని నిరంతరం పూజించారు. దీని తరువాత అతను శాపం నుండి విముక్తి పొందాడు.

శ్రీకృష్ణుడి కొడుకు అయిన సాంబుడు ఈ ఆలయాన్ని నిర్మించారు.


💠 ఇంకో స్థల పురాణం ప్రకారం, 

ఒకసారి శ్రీకృష్ణుని కుమారుడైన సాంబుడిని చూసి గోపికలు శ్రీకృష్ణునిగా పొరబడ్డారు. 

సాంబుడు తన గుర్తింపును గోపికలకు వెల్లడించలేదు మరియు గోపికలతో కాలక్షేపాలలో పాల్గొన్నాడు. ఈ సమాచారం తెలుసుకున్న శ్రీకృష్ణుడు కోపంతో తన కుమారుడైన సాంబుని కుష్టు వ్యాధిగ్రస్తుడు శపించాడు . అతని శాపం కారణంగా సాంబుడు కుష్ఠురోగి అయ్యాడు. 


💠 సాంబుడు శ్రీ కృష్ణుడిని శాపవిమోచనం  కోసం ప్రార్థించినప్పుడు, శ్రీ కృష్ణుడు 12 సూర్య దేవాలయాలను నిర్మించమని కోరాడు. వాటిలో ఈ సూర్య దేవాలయం ఒకటి అని నమ్ముతారు.


💠 ఇక్కడ ఉన్న సరస్సులో కనీసం 5 ఆదివారాలు స్నానం చేస్తే కుష్టు వ్యాధి నుండి విముక్తి లభిస్తుందని కూడా ఒక నమ్మకం. 


💠 ఈ ఆలయం దేశంలోని 12 ప్రసిద్ధ సూర్య దేవాలయాలలో ఒకటి అంటారు. 1934లో వచ్చిన భయంకరమైన భూకంపం వల్ల ఈ ఆలయం దెబ్బతిన్నదని చెబుతారు. ఆ తర్వాత ఈ ఆలయాన్ని మళ్లీ మరమ్మతులు చేశారు.


💠 బిహార్ రాష్ట్రంలో ఎక్కడా వేడి నీటి సూర్య కుండ్ లేకపోవడం పెద్ద విషయం. ఈ కొలను మాత్రమే వేడి నీటి కొలను రూపంలో ఉంటుంది.


💠 దూరం (నలంద రైల్వే స్టేషన్ నుండి): 4 కి.మీ

కామెంట్‌లు లేవు: