మోక్షము సిద్ద వస్తువా లేక సాద్య వస్తువా
చాలామంది సాధకులను తొలచివేసే ప్రశ్న ఇది దీనిని గురియించి వివరంగా తెలుసుకుందాం. భక్తి మార్గంలో వుండే సాధకునికి నిరంతర భక్తి వలన ఒక విషయం అవగాహనకు వస్తుంది అదేమిటంటే భక్తికన్నా భిన్నంగా మరియు గొప్పగా మరేదో వున్నదని భావన ఆ భావన కలిగిన సాధకుడు మాత్రమే మోక్షం వైపు వెళ్లగలడు. అప్పుడు ఆలోచనలో పడతాడు ఆ ఆలోచన ఎలావుంటుందంటే ఏమిటి నేను నిత్యం ఈశ్వరునికి పూజ చేస్తున్నానే ఎలా చేస్తున్నాను శివలింగానికి జలంతో, పంచామృతాలతో అభిషేకం చేస్తున్నాను, పుష్పాలతో అలంకరిస్తూ ఆనందిస్తున్నానే ఇదేనా పరమార్ధం లేక ఇంకా వేరే ఏమైనా ఉన్నదా అనే మీమాంసలో పడతాడు. అప్పుడు మొదలౌతుంది తెలుసుకోవాలనే తృష్ణ వెంటనే ఉపనిషత్తుల వద్దకు వెళతాడు. ముందుగా ఆవిర్భవించినది తరిమ్పచేసేది అయినా " ఈశావాసోపనిషత్'" మొదటి మంత్రం చదివేసరికి తలా తిరిగిపోతుంది సాధకునికి ఎందుకంటె ఆ మంత్రం ఏమి చెప్పుతున్నదంటే
1. ఓం ఈశా వాస్య మిదగ్గ్ సర్వం యత్కించ జగత్యాం జగత్
తేన త్యక్తేన భుఞ్ఙీథా మాగృధః కస్యస్విద్ ధనం
అర్థం:
జగత్తులో ఏవేవైతే ఉన్నవో అన్నీ భగవంతుడై వున్నాయి. భగవంతుడు కానిది ఏదిలేదు ఇక్కడి సంపదలు, ధనము సర్వము కూడా భగవంతునివై వున్నాయి. అప్పుడు సాధకుని ఆలోచనలో కొత్త విషయాలు ఆవిశృభవిస్తాయి. నేను యెంత ముర్కుడిని నేను నీళ్లతో, పాలతో పంచేంద్రియాలతో ఈశ్వరుడి అభిషేకించానని అనుకుంటున్నానే, పూలతో భగవంతుని అలంకరించానని అనుకుంటున్నానే భగవంతుడు కానిది, భగవంతునిది కానిది ఏది లేదని కదా ఈ మంత్రము చెపుతున్నది. అట్టి తరి నేను నీళ్లు, పాలు, పంచామృతాలు ఎక్కడినుండి ఎవరివి తీసుకొని వచ్చాను. నేను నా ద్రవయంతో కొన్నాను అని సమాధానం చేసుకుంటే నాకు ద్రవయం ఎలావచ్చింది అనే ప్రశ్న ఉదయిస్తుంది. నేను కష్టపడ్డాను కాబట్టి అని సమాధాన పరచుకుంటాను. అప్పుడు మొదలవుతుంది అసలు ప్రశ్న నేను ఎవరును. ఈ జగత్తు మొత్తము ఈశ్వరుడే అయితే నేను ఈశ్వరునికన్నా బిన్నంగా ఎలావున్నాను. లేనుకదా అటువంటప్పుడు నేను కూడా ఈశ్వరుడినిలో అంతర్భాగం కదా మరి నేను కష్టపడటం ఏమిటి. అది ఎలా సాధ్యం. ఇటువంటి ఆలోచన సాధకుని మరొక మెట్టు ఎక్కిస్తుంది.
సాద్య వస్తువు: సామాజిక అర్ధంలో వస్తువు అంటే ఒక పదార్ధ నిర్మితమైనది అని పదార్ధము కానిది వస్తువు కాదు అని మనము అర్ధము చెప్పుకుంటాము. ఎవరైనా సాధకుడు సాద్య వస్తువు, సిద్ధవస్తువు అని నీవు అంటున్నావు కదా మోక్షము నీ దృష్టిలో వస్తువా అని ప్రశ్నించవచ్చు. అందులకు సందేహం లేదు. కానీ ఆధ్యాత్మిక అర్ధంలో వస్తువు అనే దానిని మనం ఎలా అర్ధం చేసుకోవాలంటే సాద్య వస్తువు అంటే సాధ్యం అనగా సాధనావల్ల లభించునది అని సిద్ధవస్తువు అంటే అది అంతకుముందే నీ వద్ద వున్నది కేవలము నీవు దానిని తెలుసుకోవటమే. మీ ప్రాంతంలో వర్షాలు పడటంలేదు అప్పుడు వరుణ యాగం చేశారు యాగ ఫలితంగా వెంటనే అక్కడ వర్షాలు పడ్డాయి అంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినది ఏమిటంటే వరుణ యాగం చేయటం అంటే వరుణ యాగము అనే ఒక కర్మ చేశారు వారికి కర్మ ఫలితంగా వర్షాలు పడ్డాయి. అంటే వర్షాలు పడతాము అనేది సాద్య వస్తువు. ఇదే విధంగా నీకుమార్తె వివాహం కాలేదు నీ మిత్రుడు సత్యనారాయణ వ్రతం చేయమని నిన్ను ప్రోత్సహించాడు. నీవు ఆ వ్రతాన్ని ఆచరించవు వ్రత ఫలితంగా నీ కుమార్తె వివాహం అయ్యింది ఇవ్వన్నీ సాద్య వస్తువులుగా ఆధ్యాత్మిక జ్ఞానులు అభివర్ణించారు.
సిద్ధవస్తువు.: సిద్ద వస్తువు అంటే సిద్ధంగా ఉన్నదానిని నీవు తెలుసుకోవటమే. తెలుసుకోవటమే కదా ఇందులో కష్టం యేమివున్నది అని నీవు అనుకోవచ్చు. కానీ అందులో కష్టంకాదు వున్నది అజ్ఞానం ఆ అజ్ఞానాన్ని పారద్రోలితే అప్పుడు నీకు ఆత్మ జ్ఞానం కలుగుతుంది. ఒక చిన్న ఉదాహరణతో దీనిని తెలుప ప్రయత్నిద్దాము.
నీవు వీధిలో ఏదో వస్తువు కొనటానికి వెళ్ళావు వస్తువును కొని దాని మూల్యం చెల్లించటానికి నీ జేబుచుసుకున్నావు అక్కడ నీ పర్సు కనిపించలేదు. వెంటనే నీకు ఇంట్లో నీవు పర్సు పెట్టుకున్న ప్యాంటు కాకుండా ఇంకొక ప్యాంటు వేసుకున్నట్లు మనస్సుకు తట్టింది. అప్పుడు ఏమిచేయాలా అని నీవు అనుకుంటున్నప్పుడు నీ మదిలో ఇంకొకటి స్ఫురణకు వచ్చింది నీకు బెల్టులోపల వుండే జేబులో కొంత ద్రవ్యాన్ని అత్యవసర పరిస్థితిలో ఉపయోగపడేటట్లు పెట్టుకునే అలవాటు వుంది. వెంటనే నీవు అక్కడ తడిమి చూసావు నీకు వంద నోట్లు తగిలాయి. బ్రతుకు జీవుడా అని ఆ డబ్బులు ఇచ్చి నీవు కొనుక్కున్న వస్తువుతో ఇంటికి వెళ్లవు. ఇక మోక్షంకుడా నీలోనే వుంది అది ఎలావుందంటే నీ బెల్టు క్రింద జేబులో వంద నోట్లు వున్నట్లుగా నీవు చేయవలసిందల్లా కేవలం దానిని గుర్తించటమే. అది యెట్లా వున్నది అనేది గుర్తించటానికి మనకు జ్ఞానం కావలి. జ్ఞానం మనకు శాస్త్రం నుండి లభ్యమవుతుంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి