1, సెప్టెంబర్ 2024, ఆదివారం

దేవాలయాలు - పూజలు 28*

 *దేవాలయాలు - పూజలు 28*


సభ్యులకు నమస్కారములు 


*స్వస్తి*

ప్రాతః సంధ్యా కాలం నుండి దైవ ఆరాధనా, నివేదనా కార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలతో బాటు ఆశీర్వచనాలు కూడా అందించిన అర్చక స్వాములు, స్వామి వారు విశ్రమించు వేళ, ఆ దినము తాను నిర్వహించిన కార్యక్రమాలలో ఏవైనా లోటు పాట్లు జరిగి ఉంటే క్షమించమని వేడుకొనుట సంప్రదాయము. 

*ఉపచారాపదేశేన కృతాన హర హర్మయా, అపచారాన్ ఇమాన్ సర్వాన్ క్షమస్య పురుషోత్తమ!*.

అర్థం :- స్వామీ, నీకు ఉపచారము మరియు పూజలు చేసే కోరికతో ప్రతి రోజూ నేను తెలిసియో, తెల్వకో చేసిన అపరాధములను మన్నించి క్షమించ గలవు. గృహాలలో అవుతే  పూజల ముగింపు సందర్భంగా  యాజ్ఞీకులవారు  దిగువ శ్లోకం  పఠిస్తారు.

*శ్లో! మంత్ర హీనం క్రియా హీనం భక్తి హీనం సురేశ్వర  యాత్పూజితం మయాదేవా పరిపూర్ణం తదస్తుతే*. 


అర్చక స్వాములు  ప్రతినిత్యం *దాసస్య దాసోహం, భృత్యస్య భృత్యోహం* అను భావనతో భగవంతుని ఆశ్రయించి పూజలు నిర్వహిస్తారు కాబట్టి అర్చక స్వాములు భగవత్ కృపకు పాత్రులవుతారు.  తమిళ సంప్రదాయంలో కూడా ఒక వాక్యమున్నది *ఏత్తువార్ తమ్ మన తుళ్ళాన్*

  అర్థం:- స్తోత్రము, పరిచర్యలు  చేయువారి యొక్క మనస్సులలో నుండువాడు అంటే భగవంతుడు, భగవంతుడు కరుణిస్తాడు. స్వస్తి మంత్రమునకు ముందు అర్చక స్వాముల వారు  భగవంతునికి  వినయ విధేయతలతో, ప్రణామపూర్వకంగా శిరస్సు వంచి  తన పరిచయమిస్తాడు. తన నామ ధేయం పలుకుతూ.... *త్వద్ భృత్య భృత్య పరిచారిక భ్రుత్యభృత్య భృత్యస్య భృత్య ఇతి స్మర లోకనాయకా*.


పూజలు ముగిసినవి, ఇక సెలవు అని అర్చక స్వాముల వారు దేవాలయం తలుపులు మూయడానికి  ముందు భగవత్ ఆజ్ఞ పొందుతాడు, ఆ తదుపరి తలుపులు మూస్తాడు. 

స్వస్తి మంత్రం 

*ఓం సర్వేషాం స్వస్తిర్భవతు, సర్వేషాం పూర్ణం భవతు,   సర్వేషాం మంగళం భవతు,  సర్వే సంతు సుఖినః, సర్వే సంతు నిరామయః, సర్వే భద్రాని పశ్యంతు  మా కశ్చిత్ దుఃఖ వాగ్భవేత్, లోకాఃసమస్తాః సుఖినోభవంతు,  సర్వే జనాః సుఖినోభవంతు, సమస్త సన్మంగళాని భవంతు, ఓం శాంతిః శాంతిః శాంతిః*.


ప్రాతః  సంధ్యా మరియు సాయం సంధ్యా సమయాన  నిర్వహింపబడు దేవాలయ పూజలు స్వస్తి మంత్రంతో సంపూర్ణం. 


*ధర్మాత్ తస్మా ద్దర్మో పరోభవేత్*. శుక్ర నీతి వాక్యము. 

అర్థము :-  ధర్మము ఆచరించని వారికి ఏలాగు సుఖం మరియు శాంతి లభించదు. కనుక, కనీసం తన సుఖం, శాంతి మరియు క్షేమం కొరకైనా ప్రతి మనుజుడు  హైందవ సంప్రదాయం బోధించిన ధర్మం ఆచరించాలి. *ప్రతి దినం గృహాలలో మరియు దేవాలయాలలో తప్పనిసరిగా భగవంతుడిని ఆరాధించాలి*.


*మరియొక విషయము*

సాక్షాత్ శంకర భగవానుని స్వరూపమైన ఆది శంకరాచార్యుల వారి సందేశము జ్ఞాపక ముంచుకుందాము. 

*అవినయమపనయ విష్ణో దమయ మనః, శమయ  విషయమృగతృష్ణామ్, భూతదయాం విస్తారయ, తారయ సంసారసాగరతః*.

అర్థం:- ఈశ్వరా! నాలోని *అవినయాన్ని తొలగించు*, నా మనస్సును ఒక చోట నిలిచేటట్లు చూడు. ప్రాపంచిక విషయాలనెడి ఎండమావుల మీద ఆశను తొలగించు, 

 *భూత దయను* *పరోపకార బుద్ధి* పెంపొందించుము, 

ఈ సంసార సాగరాన్ని దాటించుమయ్యా.


ధన్యవాదములు.

*(సశేషం)*

కామెంట్‌లు లేవు: