1, సెప్టెంబర్ 2024, ఆదివారం

తెలంగాణకు రెడ్ అలర్ట్*

 *🔊తెలంగాణకు రెడ్ అలర్ట్*


*🔶జారీచేసిన వాతావరణ శాఖ*


*🔷మరో 2 రోజులు భారీ వర్షాలు*


*🔶కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్*


*🔷అప్రమత్తంగా ఉండాలని ఆదేశం*


*🔶హైదరాబాద్ లో ఎల్లుండి స్కూళ్లకు సెలవు*


*🍥దిశ, హైదరాబాద్ బ్యూరో: తెలంగాణకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 48 గంటలు పాటు తెలంగాణలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. ముఖ్యంగా *భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్లగొండ, నాగర్ కర్నూల్, వనపర్తి జోగులాంబ గద్వాల జిల్లాలకు ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది*. కాగా ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా శుక్రవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఇవాళ సాయంత్రం వాయు గుండంగా మారింది. అది ఇవాళ అర్థరాత్రి కలింగపట్నం దగ్గర తీరం దాటనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ సమయంలో తీరం వెంబడి 45-65 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని చెప్పారు. *హైదరాబాద్ నగరంలో రాబోయే రెండు రోజులు భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ రెడ్ ఎలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి అధికారులను ఆదేశించారు. ముందు జాగ్రత్త చర్యగా సోమవారం హైద్రాబాద్ జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు ఆయన తెలిపారు.*

కామెంట్‌లు లేవు: