తెలుగు భాష
కొంత కాలం తరువాత మరుగున పడి పోకుండా
అభివృద్ధికి చర్యలు
1.. అందరూ తెలుగు భాషని గౌరవంగా చూసుకోవాలి.
2.. ప్రతి ఇంటిలోనూ తెలుగులో మాట్లాడుకోవాలి
3.అది అలవాటుగా ఉండాలి
4.. ఆ దిశగా కార్యచరణాలు చేపట్టాలి
5.. మన తెలుగు భాష అంటే ఎందుకు అంత చులకన?
6.. మన తెలుగు భాషని మనమే వాడుక భాషగా వాడకపోతే
వేరే ప్రాతం వాళ్ళ ఎందుకు ఆసక్తి చూపుతారు.
7.. ముందుగా రెండు రాష్ట్రాల ప్రజలు మేమంతా తెలుగు వాళ్ళము అన్న దృఢమైన ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి.
మన తెలుగు భాషని కాపాడు కోవడం అనేది మరియు మన భావి తరాలకు అందించడం మన అందరి బాధ్యత అని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలి.
8.. మనమంతా ముందుగా భారతీయులం మరియు హిందువులం
అన్న దృఢమైన ఆత్మ విశ్వాసం కలిగి ఉండాలి.
9.. ఈ దిశగా ప్రోత్సహించడానికి తగు చర్యలు ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొని ముందుకు సాగాలి.
10.. అన్ని రంగాలలోనూ తెలుగుని వ్యవాహారిక భాషగా దైనందిన జీవితంలో ఉపయోగించేలా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంది అని గ్రహించాలి.
11.అప్పుడే మన తెలుగు జాతి సాంస్కృతి మరియు సంప్రదాయాలును రక్షించు కొన్న వాళ్ళం అవుతాం.
12.. ఈ దిశగా ఈ సహస్ర శోభ ప్రపంచ తెలుగు మహాసభలును వేదికగా చేసుకొని పాటు పడాలి.
13.ఇది మన అందరికి ఒక సువర్ణ అవకాశం అని నేను భావిస్తున్నాను.
14.. జరిగి పోయిన దాని గురించి బాధ పడి ప్రయోజనం ఉండదు
15.. ఇప్పుడు జరగాల్సిందాని గురించి ఆలోచించాలి.
16.ముఖ్యంగా ప్రభుత్వం కూడా రెండు రాష్ట్రాల లోనూ, అధికారికంగా తన వంతు చట్ట పరమైన చర్యలు తీసుకోవాలి, ఉదహారనికి అన్ని బడుల లోనూ తెలుగు భాష ని బోధించే లాగ, దుకాణాల పేరు తెలుగులో తప్పని సరిగా ఉండాలి, మొదలైనవి.
ఐకమత్యంమే మహాబలం అన్న మాటని మనం అందరం దృఢంగా పాటించాలి
అప్పుడే ఈ కార్యసిద్ధిని సాధించి తీరాలి అని శపథం చేసి నెరవేర్చే విధంగా అందరూ ముందుకు వచ్చి తగు చేయూత నివ్వాలి.
ఇక నుంచి అయినా కొంత మంది నా కేందుకులే అన్న ఆలోచన నుంచి బయటకు వచ్చి తీరాలి.
ఈ కార్యక్రమంలో మీరు ఏ విధంగా పాల్గొన గలరు,
ఆలోచించండి.
ఇది నా అభిప్రాయం అండి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి