ఈ రెండు పద్యాలు మీరందరు వినే ఉందురు. అయిననూ మరోసారి వాటి తాత్పర్యంతో గుర్తుచేసుకుందామా.
మొదటి పద్యం:
చితా చింతో ద్వయో ర్మధ్యే చింతానామ గరీయసీ
చితా దహతి నిర్జీవం చింతా ప్రాణయుతం వపు:
...... చాణక్యకృతం నుండి.
చితి చింత ఈ రెండింటిలోనూ చింతచాలా దారుణమైనది. చితి నిర్జీవశరీరాన్ని మాత్రమే కాలుస్తుంది. చింత బ్రతికున్న శరీరాన్ని అనుక్షణం దహిస్తూనే వుంటుంది.
రెండవ పద్యం:
కిం కులేన విశాలేన శీల మేవాత కారణమ్
కృమయ: కిం నా జాయంతే కుసుమేషు సుగందిషు.
...... విక్రమార్కచరితం నుండి
నా వంశం గొప్పదని మిడిసిపడకు, మంచి సువాసనలు వెదచల్లే పూలలోకూడా పురుగులుంటాయని గమనించుకో. వంశం కులం కంటే నీకు సంస్కారాన్ని నేర్పి, గత వైభవ వారసత్వాన్ని నీకిచ్చిన రామతారక మంత్రమే అన్నింటికన్నా గొప్పదని గ్రహించుకో, ఆచరించుకో.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి