20, ఫిబ్రవరి 2022, ఆదివారం

గ్రహాల కు మన మీద కోపంకలిగించే అంశాలు

 గ్రహాల కు మన మీద కోపంకలిగించే అంశాలు  తెలుసుకొందాము !

*********************************************************************

1. చంద్రుడు :- అద్దం పుట్టడానికి చంద్రుడు కారణమట. అందుకే అద్దములో దిగంబరముగా చూచుకొనుట, వెక్కిరించుట చేయకూడదు.


2. గురువు :- సర్వ శాస్త్రములు తెలిసిన గురువు బృహస్పతి, ఎవరైనా గురువుని కించపరచితే గురుదేవునికి అగ్రహము కలుగుతుందట.

3. బుధుడు :- బుధుడికి చెవిలో వ్రేలు పెట్టి తిప్పుకుంటే కోపమట. అందునా బుధవారం అస్సలు చేయకూడదట. వ్యాపారాన్ని అశ్రద్ధ చేసిన, జ్ఞానం ఉంది అని విర్రవీగిన కోపమట

. 4. శని :- శనికి పెద్దల్ని కించపరచిన, మరుగుదొడ్లు శుచిగా లేకపోయినా కోపమట. తల్లితండ్రిని చులకన చేసిన కోపమట. సేవక వృత్తి చేసిన, సేవ చేసిన వారిని కాపాడతాడు.


5. సూర్యుడు :- పితృ దేవతలని దూషిస్తే రవికి కోపమట. సూర్య దేవునికి ఎదురుగా మల మూత్ర విసర్జన దంతావధానం చేయకూడదట.

6. శుక్రుడు :- శుక్రుడికి భార్య/భర్త అగౌరవ పరచుకుంటే కోపమట. లక్ష్మీ దేవి కృప లేకపోతే శుక్ర కృప కష్టమే. అమ్మకి శుచి శుభ్రత లేని ఇళ్లు మనుషులు నచ్చరుట, గొడవలు లేని ఇల్లు ఇష్టము.

7. కుజుడు :- అప్పు ఎగ్గొడితే కుజుడికి కోపమట. వ్యవసాయ పరంగా మోసం చేస్తే ఊరుకోడట.


8.కేతువు :- జ్ఞానం ఉండి కూడా పంచడానికి వెనకడిన, మోక్ష కారకుడు అయిన కేతువుకి పెద్దలకు మరణాంతరము చేయవలసిన కార్యములు చేయకపోతే కోపమట. ఈయన జాతకంలో బాగోలేకపోతే పిశాచపీడ కలుగుతుంది.

 9. రాహువు :- రాహు వైద్య వృత్తి పేరుతో మోసగించినా, సర్పములని ఏమైనా చేసిన ఆయనకి కోపము కలుగునట. ఈయన భ్రమ మాయకి కారణము.

కామెంట్‌లు లేవు: