ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి
ఈ రోజుల్లో ప్రతి మనిషికి అడుగడుగునా ఎన్నో సమస్యలు కొంతమంది విద్యార్థులకు పరీక్షల్లో మార్కులు సరిగా రాక పోవటం వలన తల్లిదండ్రులు ఏమంటారో అనే దిగులు, తల్లిదండ్రులు కూడా పిల్లలని వాళ్ళకు తమ తోటివారి పిల్లలలాగా ఎక్కువ మార్కులు రాకపోతే చిన్నతనంగా ఉంటుందని పిల్లలను కేవలం పరీక్షల్లో ఎక్కువ మార్కులు ర్యాంకులు తీసుకొచ్చే యంత్రాలలాగా పెంచుతున్నారు. ఏ ఒక్క తల్లితండ్రులు కూడా తమ పిల్లలు ఎందులో శ్రర్ధ చూపెడుతున్నారు అని చూడటంలేదు. కేవలం వాళ్ళ ఉద్దేశాలను పిల్లలమీద రుద్దుతున్నారు. దానికితోడు ఈ ప్రైవేట్ విద్య సంస్థలు కూడా వారి పోటీ సంస్థలకన్నా ఎక్కువ ర్యాంకులు తమ పిల్లలు తెచ్చుకోవాలని చాలా వత్తిడికి పిల్లలను గురిచేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు రోడ్డుమీద ఆడుకోవటం మట్టిలో తిరగటం అస్సలు చూడటంలేదు. ఎప్పుడు చుసినా చదువే చదువు. ఒకవేళ కొంత సమయం తీరిక ఉంటే సెల్ఫోను చేతిలో ఉంటుంది. ఉయ్యాలలో వున్న శిశువులకు కూడా నేటి తరం తల్లితండ్రులు సెల్ఫోన్ అలవాటు చేస్తున్నారు. సెల్ఫోన్ లేనిది శిశువులు పాలు త్రాగరు, పిల్లలు అన్నం తినరు.
మానవుడి జీవితం రోజు రోజుకు యాంత్రికంగా తయారవుతుంది. గడియారం ముళ్ళు తిరుగుతున్నట్లు మనుషులు దైనందిక జీవితానికి అలవాటు పడ్డారు. భర్త ఒక ఆఫీసులో, భార్య ఒక ఆఫీసులో ఇద్దరు ఇంటికి చెరే సరికి రాత్రి అవుతున్నది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారు చూసుకుంటారు లేకపోతె ఏ ఆయనో పెడితే ఆమె పిల్లమీద యెంత ప్రేమ చూపిస్తుందనేది ప్రస్నార్ధకమే ఇక తల్లిదండ్రులను కలవరిస్తూ పిల్లలు పడుకుంటారు. మరల ఉదయం పరుగు పరుగున తయారు కావటము ఎవరి స్కూళ్లకు/ ఆఫీసులకు వాళ్ళు వెళ్ళటం సరిపోతుంది. అమ్మముద్దులు నాన్న లాలనలు పిల్లలకు పూర్తిగా కరువు అయ్యాయంటే అబద్దం కాదు. జీతాలు లక్షలలో సంపాయిస్తున్నారు కానీ ప్రయోజనం ఏమిటి. పిల్లలు ఏమిచేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో తెలియదు. సమాజంలో కొంతమంది పిల్లలను దుర్వేసనాలకు అలవాటు చేయటమే తమ ద్యేయంగా ఉండి పిల్లలను పాడు చేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు సంపాదనపరులు కావటము మంచిదే ఆర్థికంగా బలపడతారు కానీ వాళ్ళు తమ సమయాన్ని పిల్లలకు కేటాయించలేరు అధవా రాత్రి పిల్లలు నిద్రించక ముందు ఇల్లు చేరిన ఆఫీసులో పనిచేసిన బడలిక, ట్రాఫిక్లో తిరిగిన అలసటతో పిల్లలను చూసుకోలేకపోతారు. తల్లిదండ్రులు పిల్లలను విసుక్కుంటారు దాని పర్యవసానంగా పిల్లలకి తల్లి దండ్రుల మీద ప్రేమ సన్నగిల్లి అది ద్వేషంగా మారటానికి ఆరస్కారం అవుతుంది.
స్త్రీకి స్వేచ్ఛ కావలి కాదని ఎవరు అన్నారు. కానీ ఆస్వేచ్ఛ యెంత ఉన్నదంటే తన సంసారాన్ని తానె పాడు చేసుకునేంత వున్నది. ఫ్యామిలీ కోర్టులో నూటికి 90 శాతం కేసులు అధిక సంపాదనవల్ల ఇరువురు ఇమడలేక ఎవరికి వారు తన మాట చెందాలని పంతం పట్టేవే కనబడుతాయి. ఇది అది అనకుండా డిగ్రీ స్థాయిలో ఒక సజెక్టు భార్యాభర్తలు ఒకరితో ఒకరు అరమరికలు లేకుండా ఎలావుండాలి అనేది బోధిస్తే బాగుంటుందని నేననుకుంటాను.
ఇంకా వుంది
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి