gnanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
gnanam లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

20, ఫిబ్రవరి 2022, ఆదివారం

ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి

ఎందుకు బ్రతకాలి, ఎలా బ్రతకాలి 

ఈ రోజుల్లో ప్రతి మనిషికి అడుగడుగునా ఎన్నో సమస్యలు కొంతమంది విద్యార్థులకు పరీక్షల్లో మార్కులు సరిగా రాక పోవటం వలన తల్లిదండ్రులు ఏమంటారో అనే దిగులు, తల్లిదండ్రులు కూడా పిల్లలని వాళ్ళకు తమ తోటివారి పిల్లలలాగా ఎక్కువ మార్కులు రాకపోతే  చిన్నతనంగా ఉంటుందని పిల్లలను కేవలం పరీక్షల్లో ఎక్కువ మార్కులు ర్యాంకులు తీసుకొచ్చే యంత్రాలలాగా పెంచుతున్నారు.  ఏ ఒక్క తల్లితండ్రులు కూడా తమ పిల్లలు ఎందులో శ్రర్ధ చూపెడుతున్నారు అని చూడటంలేదు.  కేవలం వాళ్ళ ఉద్దేశాలను పిల్లలమీద  రుద్దుతున్నారు. దానికితోడు ఈ ప్రైవేట్ విద్య సంస్థలు కూడా వారి పోటీ సంస్థలకన్నా ఎక్కువ ర్యాంకులు తమ పిల్లలు తెచ్చుకోవాలని చాలా వత్తిడికి పిల్లలను గురిచేస్తున్నారు. ఇప్పుడు చిన్న పిల్లలు రోడ్డుమీద ఆడుకోవటం మట్టిలో తిరగటం అస్సలు చూడటంలేదు. ఎప్పుడు చుసినా చదువే చదువు. ఒకవేళ కొంత సమయం తీరిక ఉంటే సెల్ఫోను చేతిలో  ఉంటుంది. ఉయ్యాలలో వున్న శిశువులకు కూడా నేటి తరం తల్లితండ్రులు సెల్ఫోన్ అలవాటు చేస్తున్నారు.  సెల్ఫోన్ లేనిది శిశువులు పాలు త్రాగరు, పిల్లలు అన్నం తినరు. 

మానవుడి జీవితం రోజు రోజుకు యాంత్రికంగా తయారవుతుంది. గడియారం ముళ్ళు తిరుగుతున్నట్లు మనుషులు దైనందిక జీవితానికి అలవాటు పడ్డారు. భర్త ఒక ఆఫీసులో, భార్య ఒక ఆఫీసులో ఇద్దరు ఇంటికి చెరే సరికి రాత్రి అవుతున్నది. ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వారు చూసుకుంటారు లేకపోతె ఏ ఆయనో పెడితే ఆమె పిల్లమీద యెంత ప్రేమ చూపిస్తుందనేది  ప్రస్నార్ధకమే ఇక తల్లిదండ్రులను కలవరిస్తూ పిల్లలు పడుకుంటారు. మరల ఉదయం పరుగు పరుగున తయారు కావటము ఎవరి స్కూళ్లకు/ ఆఫీసులకు వాళ్ళు వెళ్ళటం సరిపోతుంది. అమ్మముద్దులు నాన్న లాలనలు పిల్లలకు పూర్తిగా కరువు అయ్యాయంటే అబద్దం కాదు. జీతాలు లక్షలలో సంపాయిస్తున్నారు కానీ ప్రయోజనం ఏమిటి. పిల్లలు ఏమిచేస్తున్నారో, ఎవరితో తిరుగుతున్నారో తెలియదు. సమాజంలో కొంతమంది పిల్లలను దుర్వేసనాలకు అలవాటు చేయటమే తమ ద్యేయంగా ఉండి పిల్లలను పాడు చేస్తున్నారు. భార్య భర్తలు ఇద్దరు సంపాదనపరులు కావటము మంచిదే ఆర్థికంగా బలపడతారు కానీ వాళ్ళు తమ సమయాన్ని పిల్లలకు కేటాయించలేరు అధవా రాత్రి పిల్లలు నిద్రించక ముందు ఇల్లు చేరిన ఆఫీసులో పనిచేసిన బడలిక, ట్రాఫిక్లో తిరిగిన అలసటతో పిల్లలను  చూసుకోలేకపోతారు. తల్లిదండ్రులు పిల్లలను విసుక్కుంటారు దాని పర్యవసానంగా పిల్లలకి తల్లి దండ్రుల మీద ప్రేమ సన్నగిల్లి అది ద్వేషంగా మారటానికి ఆరస్కారం అవుతుంది. 

స్త్రీకి స్వేచ్ఛ కావలి కాదని ఎవరు  అన్నారు. కానీ ఆస్వేచ్ఛ యెంత ఉన్నదంటే తన సంసారాన్ని తానె పాడు చేసుకునేంత వున్నది. ఫ్యామిలీ కోర్టులో నూటికి 90 శాతం కేసులు అధిక సంపాదనవల్ల ఇరువురు ఇమడలేక ఎవరికి వారు తన మాట చెందాలని పంతం పట్టేవే కనబడుతాయి. ఇది అది అనకుండా డిగ్రీ స్థాయిలో ఒక సజెక్టు భార్యాభర్తలు ఒకరితో ఒకరు అరమరికలు లేకుండా ఎలావుండాలి అనేది బోధిస్తే బాగుంటుందని నేననుకుంటాను. 

 

 

ఇంకా వుంది


25, జనవరి 2022, మంగళవారం

పాపేన జాయతే

 పాపేన జాయతే వ్యాధిః పాపేన జాయతే జరా | పాపేన జాయతే దైన్యం దుఃఖం గోకో భయంకర!|| తస్మాత్ పాసం మహావైరం దోషబీజ మమంగళమ్ |


భారతే సంతతం సన్తో నాచరని థయాతురా! " “పాపములే రోగములకు, వృద్ధావస్థకు, నానావిధ విఘ్నములకు బీజ ములు. పాపములవలననే దైన్యము, దుఃఖము, రోగములు, వార్ధక్యము, భయంకుశోకములు నుత్పన్నములు కాగలవు. అందువలననే భారతవర్ష మింకు వివేకవంతు లై నమహాత్ములు భయముతో నెన్నడును బాపముల నాచరింపరు. ఎందువలె ననగా


నాపాపములు మహా నైరముల నుత్పశ్నముచేయగలవు. పాపము లేదోషములను బీములై , యమంగళకారకములు కాగలవు.


స్వధర్మాచరణమం.కు సంలగ్నలై యున్న వాహి, భగవంతుని మంత్రపేక్ష వహించినవారు, శ్రీహరిసమారాధనము కంచు పంలగ్ను లై యున్న వారు, తలిదండ్రులను, గురువును, దైవమును, నతిథులను, భక్తితో సేవించు వారు, తపమ నం దాసక్తి కల్గియున్న వారు, వ్రతాపవాసముల నాచరించువారు, సదా తీర్థ సేవన మొనరించువారు నగుమానవులను గాంచి గరుత్మంకు భయము వలవ పలాయనముచి త్తగించునురగములవలె ఆగములు పాతిపోగలవు. అట్టి

20, జనవరి 2022, గురువారం

ఈశావాస్యోపనిషత్తు

 ఈశా వాస్యమిదxసర్వం యత్కించ జగత్యాం జగత్, 

తేన త్యక్తేన భుంజీథా మాగృధః కస్య స్విద్ ధనమ్.

ఇది ఈశావాస్యోపనిషత్తు లోని మొదటి మంత్రము. ఈ మంత్రము పూర్తి జగత్తు అంతా ఈశ్వరుని చేతనే వ్యాపించబడి వున్నదని పేర్కొంటున్నది.

జగత్యామ్ = అఖిల బ్రహ్మాండము నందు; యత్ కించ ఏదైతే; జగత్ =జడ, చేతన స్వరూపమైన జగత్తుగలదో; ఇదమ్ = ఈ; సర్వమ్ = సమస్తమును; ఈ = ఈశ్వ రునిచే; వాస్యమ్ =వ్యాపించియున్నది; తేన=అందుచే; త్యక్తేన త్యాగపూర్వకముగ (ఈశ్వరుని వెంట నిడుకొని); భుంజీథా= (దీనిని) అనుభవింపుము; మాగృధః= ( దీనియందు) ఆసక్తుడవు గాకుండుము; (ఏలయన) ధనమ్ = ధనము-సంపద భోగ్య పదార్థములు; కస్యస్విత్ = ఎవరిది? అనగా ఎవరిదీకాదు.

తాత్పర్యము ఈశ్వరుని చేత : అఖిల బ్రహ్మాండము నందుగల చేతనా చేతన జగత్తంతయు వ్యాపించియున్నది. అందుచే ఈశ్వరుని సాన్నిహిత్యము ననుభవించుచు, సమర్పణ బుద్ధి ద్వారా త్యాగపూర్వకముగ, ప్రాప్తించిన దానిని అనుభవింపుము. కాని దాని యందు ఆసక్తుడవు గాకుండుము. ఈ సంపద, ధనము, భోగ్యసామగ్రి ఎవరిది? అనగా ఎవరికీ చెందినదికాదు.

వ్యాఖ్య: అఖిల విశ్వబ్రహ్మాండము నందుగల చరాచరాత్మకమైన జగత్తు నీ చూపుద్వారా, వినికిడి ద్వారా తెలియవచ్చు చున్నదంతయునూ సర్వాధారుడు, సర్వనియంత, సర్వాధిపతి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సకల కళ్యాణగుణ స్వరూపుడునగు పరమేశ్వరుని చేత వ్యాపింపబడి యున్నది; సదా, సర్వత్ర అతనిచేత పరపూర్ణమై యున్నది. (గీత.9-4) ఇందలి ఏ అంశము కూడా అతనితో రహితమై లేదు. (గీత.10-39, 42) ఈ విధంగా తెలిసి ఆ పరమేశ్వరుని నిరంతరము సన్నిహితంగా భావిస్తూ - సదా, సర్వదా అతనిని స్మరించుచునే నీవు ఈ జగత్తునందు త్యాగభావం కలిగి కేవలం కర్తవ్య నిర్వహణకై మాత్రమే విషయములను యధోచితముగా ననుభవింపుము. అనగా - విశ్వరూపుడగు -

ఈశ్వరుని అర్చించుట కొరకే కర్మలను ఆచరించుము. విషయములందు మనస్సును చిక్కుకొననివ్వకుము. ఇందులోనే నీకు నిశ్చితమైన మేలు గలదు. (గీత.2-64; 3-9; 18–46) నిజమునకు ఈ భోగ్యపదార్ధములు ఎవరివీ కావు. మనుజుడు పొరపాటుగా వీనియందు మమతా, ఆసక్తిని (ముడి వేసుకొని కూర్చుంటాడు) ఇవన్నియును పరమేశ్వరునివే, ఆతని కొరకే వీటినుపయోగించ వలయును. (త్వదీయం వస్తు గోవింద తుల్యమేవ సమర్పయే) అని మనుజుల పట్ల వేదభగవానుడిచ్చిన పవిత్రమైన ఆదేశము నెరుగుము.

వివరణ: ఈ ప్రపంచం మొత్తం కూడా ఈశ్వరుని శక్తితోటె వ్యాపించి యున్నది.  అంటే ఈ జగత్తులో ఏది కూడా ఈశ్వరునికన్నా బిన్నంగా లేదు. అంటే నీవు నీ ఇంద్రియ జ్ఞ్యానంతో ఏదయితో తెలుసుకుంటున్నావో అది మాత్రమే కాదు తెలుసుకుంటున్నాను అని అనుకునే నీవు కూడా ఆ ఈశ్వరుని స్వరూపమే కాక్ మరొక్కటి కాదు. కానీ మనుసులమైన మనం నేను, నాది, నావాళ్లు అనే భ్రాంతిలో ఉండి ఆ పరమేశ్వరుని కన్నా భిన్నంగా ఉన్నట్లు భవిస్తూ ఐహిక వాంఛల వెంట పరుగులిడుతూ ఆ భగవంతుని మరచి కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలాన్ని పొందుతున్నాము.  మనలో యెంత స్వార్ధం పెరుగుతుందో అంతగా పాప కర్మలు చేస్తూ ఉంటాము.  మీరు గమనించండి. నాకు వున్నదానితో నేను తృప్తి పడటం లేదు. కాబట్టి నాకు ఇంకా ఇంకా సంపద కావలి అంటే నేను నా తహతకు మించిన సంపదను కోరుకుంటున్నాను అని అర్ధం.  ఆ కోరికలు తీరటానికి నేను అన్యాయ పద్ధతులు వెతికి వాటి వల్ల సంపదను పోగు చేసుకుంటాను.  మరి ఆ సంపద నాకు మనశాంతిని ఇస్తుందా అంటే ససేమిరా ఇవ్వదు. ఎప్పుడు ఏదో ఒక అపరాధ భావం వెంటాడుతుంది.  ఖరీదైన మంచం, పరుపు అన్యాయ అర్జితంతో కొనగలను కానీ నిద్ర మాత్రం రాదు.  ఎందుకంటె నేను చేసిన పాపపు పనులు నా మదిని తొలచి నాకు నిద్ర రాకుండా చేస్తున్నాయి.  ఈ విషయం నేను ఇంకొకరికి చివరికి నా వాళ్ళు అనుకునే భార్యాపిల్లలకు కూడా చెప్పలేను.  అనవసరపు ఆలోచనలతో గుండె జబ్బులు, చెక్కర వ్యాధులు వెన్నాడుతాయి.  ఇప్పుడు పశ్చాత్తాప పడి ప్రయోజనమేముంది. కాబట్టి చేసిన ప్రతి కర్మకు ఫలితంగా కర్మ ఫలాన్ని అనుభవించాల్సిందే.  దానిని ఎవ్వరు ఆ ఆపలేరు. 


22, అక్టోబర్ 2020, గురువారం

జ్ఞానానం- అజ్ఞానం

 జ్ఞానానం- అజ్ఞానం 

మనము తరచుగా ఈ రెండు పదాలను వాడుతూవుంటాము. వాటి అర్ధాలు ఏమిటంటే జ్ఞానం అంటే తెలుసుకున్న విషయము, అజ్ఞానాం అంటే తెలియని విషయము. మనము ఎప్పుడైతే ఏదయినా ఒక విషయాన్ని తెలుసు కుంటామో అప్పుడు ఆ విషయానికి సంబందించిన జ్ఞానం మనకు వస్తుంది. అంటే ఆ విషయాన్ని తెలుసుకోనంత మటుకు మనకు ఆ విషయానికి సంబందించిన జ్ఞానము లెడు అంటే మరి వున్నది ఏమిటి అంటే ఆ విషయానికి సంబందించిన అజ్ఞానం వున్నదన్నమాట.  ఇలా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్నీ తెలుసుకుంటూ ఆ ఆ విషయాలకు సంబందించిన అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొందుతున్నాము. 

ప్రతి మనిషికి వారి వారి స్థాయికి తగ్గ జ్ఞానం ఉంటుంది. అంటే మనం ఈ ప్రపంచంలో వున్న జ్ఞానాన్ని ఒక రకంగా నిర్వచించ వచ్చు అదేమిటంటే నీకు తెలిసిన జ్ఞానం నీకు తెలియని జ్ఞానం ఈ రెంటి కలయికే పూర్తీ ప్రేపంచ జ్ఞానం నీవు రామాయణం చదివావు అంటే నీకు రామాయణ జ్ఞానం కలిగింది. మరొకరు భరతం చదివారు ఆయనకు భారతానికి సంబందించిన జ్ఞానం కలిగింది. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే నీకు రామాయణ జ్ఞానానము  అతనికి భారతానికి సంబందించిన జ్ఞానం వున్నాయి కానీ ఇద్దరికీ ఇతిహాసాలు సంబందించిన పూర్తి జ్ఞానం లేదని అర్ధం. నీవు భారతాన్ని ఆటను రామాయణాన్ని కూడా చదివితే కానీ ఇద్దరికీ రెండిటి జ్ఞానం కలుగుతుంది. ఇలా ప్రపంచంలో మనుషులు నిత్యం జ్ఞాన సముపార్జన చేస్తారు. ఒక మనిషి తన జీవితంలో పొందగలిగే జ్ఞానం మాత్రమే పొందగలుగుతాడు కానీ నిజానికి ఈ ప్రపంచాల్లో వున్న జ్ఞానం అపారం. యెంత జ్ఞానం ఉన్నదంటే ఎంతటి మేధావి అయినా ప్రపంచంలోని పూర్తీ జ్ఞానాన్ని పొందలేరు. 

మానవుడు పుట్టినప్పుడు వున్న జ్ఞానము శున్యము అంటే ఏమాత్రము తెలియనితనముతో ఉంటాడు. తాను దిన దినాభివృది చెందినట్లుగా అతని జ్ఞానం కూడా రోజు రోజుకి పెరుగుతువుంటుంది. కేవలం ఏడవటం మాత్రమే తెలిసిన శిశువు మాటలు నేర్చుకుంటాడు తరువాత వయసుతోపాటు జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. మనం తరచుగా ఒక మాట అంటూవుంటాము. అతనికి వయస్సు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు అని. దీనిని బట్టి సర్వులకు తెలిసిన విషయం ఏమిటంటే వయస్సును బట్టి జ్ఞానం ఉంటుంది. అంటే రోజు జ్ఞానం వృద్ధి చేసుకోవాలి అని.  

ఓ తత్సత్