7, ఆగస్టు 2026, శుక్రవారం

దేవతలు 33 కోట్ల

  హిందూ దేవతలు 33 కోట్ల అని అంటారు, నిజమేనా??? 


త్రయత్రింశతి (33) కోటి దేవతలు ఎవరు?


చాలామంది హిందువులను వెక్కిరిస్తూ 

“మీ 33 కోటి దేవతల పేర్లు చెప్పండి” అంటారు. ఇక్కడ ‘కోటి’ అంటే సంఖ్య కాదు, ‘విధం / వర్గం’ అని అర్థం మరచిపోయారు!


సంస్కృతంలో కోటి అంటే రకం / విధం / వర్గం అని కూడా అర్థం వుంది.


ఉదాహరణలకు:

🔸ఉచ్ఛకోటి — ఉన్నత వర్గానికి చెందినవారు

🔸సప్తకోటి బుద్ధులు — 7 ప్రధాన బుద్ధులు


అందుకే వేదాలు చెప్పిన 33 కోటి దేవతలు అంటే 33 categories of divine forces అని అర్థం.


ఈ వివరాలు యజుర్వేదం, అథర్వవేదం, శతపథ బ్రాహ్మణం మొదలైనవాటిలో కూడా ఉన్నాయి. అలాగే బౌద్ధ మరియు పార్శీ గ్రంథాల్లో కూడా ఈ 33 వర్గాలు ఉన్నాయి.


ఇప్పుడు ఆ 33 వర్గాలు ఎవరు?


12 ఆదిత్యులు

 1. త్వష్ట

 2. పూష

 3. వివస్వాన్

 4. మిత్ర

 5. ధాతా

 6. విష్ణు

 7. భగ

 8. వరుణ

 9. సవిత

 10. శక్ర

 11. అంశ

 12. ఆర్యమ


11 రుద్రులు

 1. మన్యు

 2. మను

 3. మహినస

 4. మహాన్

 5. శివ

 6. ఋతధ్వజ

 7. ఉగ్రరేత

 8. భవ

 9. కాల

 10. వామదేవ

 11. ధృతవృత


8 వసువులు

 1. ధరా

 2. పావక

 3. అనిల

 4. అప

 5. ప్రత్యుష

 6. ప్రభాస

 7. సోమ

 8. ధ్రువ


మిగతా ఇద్దరు


1. ఇంద్రడు

2. ప్రజాపతి


ఇవే త్రీయత్రింశతి (33) దేవవర్గాలు.

ఇవి కంఠస్థం చేసుకోవడం కష్టం కాదు.


కాబట్టి ఎవరైనా “మీ 33 కోటి దేవతల పేర్లు చెప్పండి” అంటే ఈ సమాధానం చెప్పండి.


హిందూ ధర్మంలో సంఖ్య కాదు, వర్గాల రూపంలో 33 దేవశక్తులు ఉన్నాయని భావం.


సనాతన వైభవం తెలుసుకుందాం, నిలబెట్టుకుందాం 🙏

కామెంట్‌లు లేవు: