9, ఆగస్టు 2026, ఆదివారం

పాదారవింద శతకం - 2*

 *శ్రీ మూకశంకర విరచిత*

*మూక పంచశతి*

*పాదారవింద శతకం - 2*


*శ్లోకము - 42*


*మరుద్భిః సంసేవ్యా సతతమపి చాంచల్యరహితా*

*సదారుణ్యం యాంతీ పరిణతిదరిద్రాణసుషమా ।*

*గుణోత్కర్షాన్మాంజీరకకలకలైస్తర్జనపటుః*

*ప్రవాలం కామాక్ష్యాః పరిహసతి పాదాబ్జయుగలీ ॥*


*భావము :*


*అమ్మా! లేత చిగురుటాకులు కొన్నాళ్ళకి పండి రాలిపోతాయి. నీ పాదములు ఎప్పటికీ నవనవోన్మేషములు. చిగురుటాకులవలే కాక నీ పాదములు ఎప్పుడూ ఎరుపు వర్ణముతో ఉండి మమ్ములను అనుగ్రహిస్తాయి.*


🙏🙏🙏 *శ్రీమాత్రే నమః* 🙏🙏🙏

కామెంట్‌లు లేవు: