జ్ఞానానం- అజ్ఞానం
మనము తరచుగా ఈ రెండు పదాలను వాడుతూవుంటాము. వాటి అర్ధాలు ఏమిటంటే జ్ఞానం అంటే తెలుసుకున్న విషయము, అజ్ఞానాం అంటే తెలియని విషయము. మనము ఎప్పుడైతే ఏదయినా ఒక విషయాన్ని తెలుసు కుంటామో అప్పుడు ఆ విషయానికి సంబందించిన జ్ఞానం మనకు వస్తుంది. అంటే ఆ విషయాన్ని తెలుసుకోనంత మటుకు మనకు ఆ విషయానికి సంబందించిన జ్ఞానము లెడు అంటే మరి వున్నది ఏమిటి అంటే ఆ విషయానికి సంబందించిన అజ్ఞానం వున్నదన్నమాట. ఇలా మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్నీ తెలుసుకుంటూ ఆ ఆ విషయాలకు సంబందించిన అజ్ఞానాన్ని పోగొట్టుకొని జ్ఞానాన్ని పొందుతున్నాము.
ప్రతి మనిషికి వారి వారి స్థాయికి తగ్గ జ్ఞానం ఉంటుంది. అంటే మనం ఈ ప్రపంచంలో వున్న జ్ఞానాన్ని ఒక రకంగా నిర్వచించ వచ్చు అదేమిటంటే నీకు తెలిసిన జ్ఞానం నీకు తెలియని జ్ఞానం ఈ రెంటి కలయికే పూర్తీ ప్రేపంచ జ్ఞానం నీవు రామాయణం చదివావు అంటే నీకు రామాయణ జ్ఞానం కలిగింది. మరొకరు భరతం చదివారు ఆయనకు భారతానికి సంబందించిన జ్ఞానం కలిగింది. ఇక్కడ మనం తెలుసుకోవలసింది ఏమిటంటే నీకు రామాయణ జ్ఞానానము అతనికి భారతానికి సంబందించిన జ్ఞానం వున్నాయి కానీ ఇద్దరికీ ఇతిహాసాలు సంబందించిన పూర్తి జ్ఞానం లేదని అర్ధం. నీవు భారతాన్ని ఆటను రామాయణాన్ని కూడా చదివితే కానీ ఇద్దరికీ రెండిటి జ్ఞానం కలుగుతుంది. ఇలా ప్రపంచంలో మనుషులు నిత్యం జ్ఞాన సముపార్జన చేస్తారు. ఒక మనిషి తన జీవితంలో పొందగలిగే జ్ఞానం మాత్రమే పొందగలుగుతాడు కానీ నిజానికి ఈ ప్రపంచాల్లో వున్న జ్ఞానం అపారం. యెంత జ్ఞానం ఉన్నదంటే ఎంతటి మేధావి అయినా ప్రపంచంలోని పూర్తీ జ్ఞానాన్ని పొందలేరు.
మానవుడు పుట్టినప్పుడు వున్న జ్ఞానము శున్యము అంటే ఏమాత్రము తెలియనితనముతో ఉంటాడు. తాను దిన దినాభివృది చెందినట్లుగా అతని జ్ఞానం కూడా రోజు రోజుకి పెరుగుతువుంటుంది. కేవలం ఏడవటం మాత్రమే తెలిసిన శిశువు మాటలు నేర్చుకుంటాడు తరువాత వయసుతోపాటు జ్ఞానాన్ని పెంపొందించుకుంటాడు. మనం తరచుగా ఒక మాట అంటూవుంటాము. అతనికి వయస్సు పెరిగింది కానీ జ్ఞానం పెరగలేదు అని. దీనిని బట్టి సర్వులకు తెలిసిన విషయం ఏమిటంటే వయస్సును బట్టి జ్ఞానం ఉంటుంది. అంటే రోజు జ్ఞానం వృద్ధి చేసుకోవాలి అని.
ఓ తత్సత్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి