*ఓం హంసవతీ ముఖ్యశక్తి సమన్వితాయై నమః.🙏*
(శ్రీ లలితా సహస్ర నామమూలలో 525వ నామము)
సీ. ఆజ్ఞాసుచక్రస్థ! హంసవతీ ముఖ్య శక్తి సమన్వితా! శరణు శరణు.
ఉచ్ఛ్వాస నిశ్వాస మొప్పుగా జరిపించు తల్లివమ్మా నీవు తలచి చూడ,
నీ పాద యుగళంబు నే నెరనమ్మిన చక్కగా కాచెడి సన్నుతాత్మ!
యిహపరంబుల సౌఖ్యమింపుగా గొలిపెడి కన్నతల్లివి నీవు కమల నయన!
తే.గీ. తల్లి గర్భాననుండగా దయను గాచు
పుట్టినప్పటినుండియు గిట్టువరకు
నీదు సంరక్షణే నన్ను నిలుపునమ్మ!
పాదముల్ పట్టి సేవింతు పలుకుమమ్మ.🙏
అమ్మకు వందనములతో🙏
చింతా రామకృష్ణారావు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి